Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని టాప్ 10 థీమ్ పార్క్ లు !

భారతదేశంలోని టాప్ 10 థీమ్ పార్క్ లు !

By Staff

థీమ్ పార్క్ ... పిల్లలు, పెద్దల సరదాలకొరకు, కాలక్షేపం కొరకు ఉద్దేశించబడినవి. ఊర్లలో జరిగే జాతర, సంవత్సరానికి ఒకసారి నిర్వహించే ఎగ్జిబిషన్ మాదిరే ఇవి. తేడా ఏమిటంటే అత్యాధునిక హంగులతో, వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. లోనికి వెల్ళటానికి ఎంట్రీ టికెట్ లు 500 తగ్గకుండా వసూలు చేస్తారు. స్టాల్స్, రెస్టారెంట్లు, కాఫీ డే లు .. ఇలా అన్ని కార్పొరేట్ హంగులు ఇందులో ఉంటాయి.

ఇంకో విషయం ! వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి రాత్రి వరకు తెరుస్తారు. రోజూ వచ్చే పర్యాటకుల కన్నా సెలవు దినాలలో, వారాంతంలో వచ్చే పర్యాటకులు అధికం. ఆ సమయంలోనే సందడి ఉంటుంది. కొన్ని కొన్ని థీమ్ పార్క్ లో ప్రవేశంలో ఇచ్చే టికెట్ తోనే లోపల అన్ని తిరిగేయొచ్చు (వాటర్ రైడ్స్, డ్రై రైడ్స్, హై థ్రిల్ రైడ్స్, కిడ్స్ రైడ్స్ ఇలా ఎన్నో ..). వాటిని ఎక్కటానికి ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. తినటానికి, తాగటానికి మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి.

ఇది కూడా చదవండి : హాయ్ లాండ్ - విజయవాడ !

పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన థీమ్ పార్క్ లు నేడు భారతదేశంలో కూడా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఇండియాలో కొన్ని చోట్ల ఏర్పాటై పర్యాటకులకు వినోదాన్ని, కాలక్షేపాన్ని అందిస్తున్నాయి. మీరు ఒకవేళ ఈ ప్రదేశాల్లో ఉన్నట్లయితే తప్పక ఈ అమ్యూజ్ మెంట్ పార్కులను సందర్శించండి.

వండర్ లా అమ్యూజ్ మెంట్ పార్క్, బెంగళూరు

వండర్ లా అమ్యూజ్ మెంట్ పార్క్, బెంగళూరు

55 రైడ్ లను మరియు వివిధ రకాల డిస్కౌంట్ లను అందిస్తుంది. మీరు స్టే చేయాలనుకుంటే వండర్ లా లో రిసార్ట్ లు కూడా కలవు.

ఎక్కడ ఉంది?

బిదడి, మైసూర్ రోడ్, బెంగళూరు నుండి 28 కిలోమీటర్ల దూరం

టికెట్ ఎంత ?

పెద్దలకు రూ.900/- , పిల్లలకు రూ.720/- మరియు సీనియర్ సిటిజన్స్ కు రూ.680/-

టైమింగ్స్

సోమవారం - శుక్రవారం వరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మరియు శని, ఆదివారాలలో / సెలవు రోజులలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు.

చిత్ర కృప : Prathyush Thomas

అడ్లబ్స్ ఇమాజికా మరియు ఆక్వల్ మాజికా, ముంబై/ పూణే

అడ్లబ్స్ ఇమాజికా మరియు ఆక్వల్ మాజికా, ముంబై/ పూణే

ఎక్కడ ఉంది?

ముంబై - పూణే హై వే రోడ్ మీద ఖోపోలి ప్రదేశంలో

టికెట్ ఎంత ?

రెగ్యులర్ టికెట్ ధర - పెద్దలకు 1599,పిల్లలకు 1299 మరియు సీనియర్ సిటిజన్స్ కు 1299

లైన్ లో వేచికుండాల్సిన అవసరం లేకుండా క్విక్ పాస్ - పెద్దలకు 2299, పిల్లలకు 1999 మరియు సీనియర్ సిటిజన్స్ కు 1999

టైమింగ్స్

రైడ్స్ 7pm గంటలకల్లా క్లోజ్ చేస్తారు మరియు రెస్టారెంట్ లు 9pm గంటల వరకు తెరిచి ఉంచుతారు.

చిత్ర కృప : Imagica Adlabs

ఎస్సెల్ వరల్డ్ మరియు వాటార్ కింగ్డమ్, ముంబై

ఎస్సెల్ వరల్డ్ మరియు వాటార్ కింగ్డమ్, ముంబై

ఎక్కడ ఉంది ?

గోరై ఐస్లాండ్, బొరివాలి(వెస్ట్), ముంబై, మహారాష్ట్ర

టికెట్ ఎంత ?

ఎస్సెల్ వరల్డ్ - పిల్లలు - RS 500, పెద్దలు -RS 850, సీనియర్ సిటిజన్ RS 300

వాటార్ కింగ్డమ్ - పిల్లలు RS 600, పెద్దలు RS950, సీనియర్ సిటిజన్ RS 300
కంబైన్డ్ టికెట్ - పిల్లలు RS 890, పెద్దలు 1190, సీనియర్ సిటిజన్ RS 400

టైమింగ్స్

ప్రతిరోజు 10am నుండి 7 వరకు మరియు 8 pm వరకు శని, ఆదివారాలలో మరియు సెలవు దినాలలో

ఆక్వాటికా, కోల్కత్తా

ఆక్వాటికా, కోల్కత్తా

ఎక్కడ ఉంది?

కౌచ్పుకూర్, PO హతగాచియా, PS : KLC , రాజర్ హట్ టౌన్ షిప్ వద్ద, కోల్కత్త

టికెట్ ఎంత ?

పెద్దలకు రూ.350/- , పిల్లలకు రూ.200/-

శని, ఆదివారాలలో పెద్దలకు రూ.400/- , పిల్లలకు రూ.200/-
టైమింగ్స్ : 10 am నుండి 6 pm వరకు

చిత్ర కృప : abhinav sarkar

సైన్స్ సిటీ, కోల్కతా

సైన్స్ సిటీ, కోల్కతా

ఎక్కడ ఉంది?

సైన్స్ సిటీ, JBS హల్దనే అవెన్యూ, కోల్కతా

టికెట్ ఎంత ?

అన్ని యాక్టివిటీలకు రూ. 250/- మాత్రమే

టైమింగ్స్

ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు - 9 am నుండి 9 pm

అక్టోబర్ 1 నుండి మర్చి 31 వరకు - 9 am నుండి 8 pm మరియు ఆది, ప్రభుత్వ సెలవు దినాలలో తెరుస్తారు.

చిత్ర కృప : Biswarup Ganguly

కిడ్జానియా, ముంబై

కిడ్జానియా, ముంబై

ఎక్కడ ఉంది ?

ఆర్ సిటీ మాల్, ఘట్ కోపర్ వెస్ట్, ముంబై

టికెట్ ఎంత ?

శిశువులకు ఫ్రీ,

2-3 సంవత్సరాల పిల్లలకు 500,

4-16 సంవత్సరాల పిల్లలకు 950,

పెద్దలకు (17-59 వయస్సు) 500,

సీనియర్ సిటిజన్స్ కు 300

టైమింగ్స్ ?

ప్రతి నెల పట్టిక మారుతుంది.

చిత్ర కృప : Nagarjun Kandukuru

రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్

రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్

ఎక్కడ ఉంది ?

అనస్పూర్ విలేజ్, హయత్ నగర్ మండలం, హైదరాబాద్

టికెట్ ఎంత ?

పెద్దలకు రూ.1900/- , పిల్లలకు( 3-12 సంవత్సరాలు) రూ.1600/-

టైమింగ్స్ - 9 am నుండి 5: 30 pm

చిత్ర కృప : Ankur P

వండర్ లా అమ్యూజ్ మెంట్ పార్క్, కొచ్చి

వండర్ లా అమ్యూజ్ మెంట్ పార్క్, కొచ్చి

ఎక్కడ ఉంది ?

పల్లికర, కుమారపురం PO, కొచ్చి

టికెట్ ఎంత ?

పెద్దలకు రూ.900/- , పిల్లలకు రూ.720/- మరియు సీనియర్ సిటిజన్స్ కు రూ.680/-

టైమింగ్స్

సోమవారం - శుక్రవారం వరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మరియు శని, ఆదివారాలలో / సెలవు రోజులలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు.

చిత్ర కృప : RanjithSiji

క్వీన్స్ లాండ్, చెన్నై

క్వీన్స్ లాండ్, చెన్నై

ఎక్కడ ఉంది?

చెన్నై - బెంగళూరు ట్రంక్ రోడ్, శ్రీ పెరుంబుదూర్ మరియు పూనమలే మధ్య

టికెట్ ఎంత ?

పెద్దలకు రూ.550/- , పిల్లలకు రూ.450/-

టైమింగ్స్

సోమవారం - శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు మరియు శని, ఆదివారాలలో / సెలవు రోజులలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు.

చిత్ర కృప : Saad Faruque

ఫంటాసియా వాటర్ పార్క్ , పాట్నా

ఫంటాసియా వాటర్ పార్క్ , పాట్నా

ఎక్కడ ఉంది ?

ఫాంటాసియా వాటర్ పార్క్, సంపత్చక్- పార్స రోడ్, పాట్నా

టికెట్ ఎంత ?

ఒక్కొక్కరికి రూ. 350/- సోమవారం నుండి శుక్రవారం వరకు

ఒక్కొక్కరికి రూ. 450/- శని, ఆది వారాలు మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో

టైమింగ్స్ : 12 am - 6 pm

చిత్ర కృప : Swaminathan

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+