Search
  • Follow NativePlanet
Share
» »భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నారా? ప్రయాణ సమయం, బస్సు రూట్లు, ఖర్చుల పూర్తి గైడ్ ఇదే!

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నారా? ప్రయాణ సమయం, బస్సు రూట్లు, ఖర్చుల పూర్తి గైడ్ ఇదే!

విశాఖపట్నం విమాన సర్వీసులను భోగాపురానికి తరలించడాన్ని సమర్థిస్తూ, పాత విమానాశ్రయం కోడ్ 'VTZ'నే కొనసాగించేందుకు ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 3న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఆగస్టు 17 నుంచి విమానాలన్నీ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే నడుస్తున్నాయి. నగరానికి కాస్త దూరంగా ఉండటంతో ప్రయాణికులు ప్రయాణ సమయం, రూట్లు, ఛార్జీలు ముందుగానే సరిచూసుకోవడం మంచిది. లేదంటే సమయం, డబ్బు వృథా అయ్యే ప్రమాదముంది. కాగా ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్ బుకింగ్ సిస్టమ్స్ అన్నీ ఇప్పటికే కొత్త లోకేషన్ వివరాలను అప్‌డేట్ చేశాయి.

మీ టికెట్‌పై 'VTZ' అని ఉన్నా.. అది పాత ఐఎన్‌ఎస్ డేగా కాదని, భోగాపురం ఎయిర్‌పోర్ట్ అని గుర్తుంచుకోండి. ఇల్లు దాటేముందే ఎయిర్‌లైన్ యాప్ లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా టెర్మినల్, గేట్ వివరాలను క్రాస్ చెక్ చేసుకోండి. నగరం నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఎన్‌హెచ్-16 మీదుగా వెళ్లడానికి సాధారణంగా 60 నుంచి 95 నిమిషాలు పడుతుంది. అదే ఎన్ఏడీ, సిరిపురం లేదా రుషికొండ ప్రాంతాల నుంచి బయలుదేరితే 90 నుంచి 120 నిమిషాల సమయం కేటాయించుకోవాల్సి ఉంటుంది. దారిలో టోల్ ప్లాజా ఉంటుంది కాబట్టి ఫాస్టాగ్‌లో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోండి. వర్షం లేదా పీక్ ఆఫీస్ అవర్స్‌లో ప్రయాణిస్తుంటే ముందస్తుగా మరో 20 నుంచి 30 నిమిషాల అదనపు సమయాన్ని ప్లాన్ చేసుకోవడం మేలు.

Bhogapuram Airport Travel Guide 2026: Routes, Bus Fares, and Tips for Visakhapatnam Passengers

ఏరో ఎక్స్‌ప్రెస్ రూట్లు, ఛార్జీలు, టైమింగ్స్

ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం రెండు రూట్లలో ప్రతి 30 నిమిషాలకు ఒక 'ఏరో ఎక్స్‌ప్రెస్' ఎలక్ట్రిక్ బస్సును అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ASR-1 రూట్.. ఓల్డ్ గాజువాక, ఎన్ఏడీ జంక్షన్, గురుద్వారా, జూ పార్క్, ఆనందపురం, తగరపువలస మీదుగా ఎయిర్‌పోర్ట్ జంక్షన్‌కు చేరుకుంటుంది. ఇక ASR-2 రూట్.. ఓల్డ్ గాజువాక, సింధియా, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, వీఎంఆర్‌డీఏ పార్క్, సిరిపురం, ఇస్కాన్, ఐటీ హిల్స్, మరికావలస, ఆనందపురం మీదుగా సాగుతుంది. ప్రయాణించే దూరాన్ని బట్టి టికెట్ ధరలు ₹100 నుంచి ₹400 వరకు ఉంటాయి. మార్నింగ్ ఫ్లైట్స్ కోసం తెల్లవారుజామున 4:30 గంటల నుంచే ఈ బస్సులు మొదలవుతాయి. బయలుదేరే ముందే ఏపీఎస్‌ఆర్‌టీసీ యాప్‌లో బస్సు లైవ్ లోకేషన్, స్టాప్‌ వివరాలను చెక్ చేసుకోవచ్చు.

ఎన్ఏడీ, సిరిపురం, రుషికొండ నుంచి క్యాబ్‌లా? షటిల్ బస్సా?

ఒంటరిగా ప్రయాణించే వారికి ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎంతో పొదుపైన మార్గం. ఎన్ఏడీ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు బస్సు ఛార్జీ ₹350, సిరిపురం నుంచి ₹350, ఐటీ హిల్స్ నుంచి ₹250, మరికావలస నుంచి ₹200, తగరపువలస నుంచి ₹100గా ఉంది. అదే యాప్ ఆధారిత క్యాబ్‌లలో అయితే వన్-వే ప్రయాణానికి ₹1,000 నుంచి ₹2,000 వరకు అవుతుంది. కుటుంబంతో వెళ్లేవారు, వయోవృద్ధులు లేదా ఎక్కువ లగేజీ ఉన్నవారికి క్యాబ్‌లే అనుకూలంగా ఉంటాయి. పీక్ అవర్స్‌లో రుషికొండ లేదా ఎన్ఏడీ నుంచి వెళ్లేవారు అనుకున్న సమయం కంటే ఒక్క బస్సు ముందే బయలుదేరడం మంచిది. అలాగే అరకు లేదా లంబసింగి పర్యటనలకు వెళ్లేవారు నగరంలోకి వచ్చి సమయం వృథా చేసుకోకుండా నేరుగా తగరపువలస లేదా ఎయిర్‌పోర్ట్ జంక్షన్‌ నుంచే పికప్ ప్లాన్ చేసుకోవచ్చు.

భోగాపురం విమానాశ్రయం వద్ద ప్యాసింజర్ డ్రాప్-ఆఫ్, పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక పార్కింగ్ కోసం అక్కడ ఏర్పాటు చేసిన సైన్‌బోర్డులను ఫాలో అవ్వండి. ప్రారంభంలో ఎయిర్‌పోర్ట్ రద్దీని తట్టుకోవడానికి కాస్త ముందే చేరుకోవడం మంచిది. లగేజీ నిబంధనలు, చెక్-ఇన్ ముగిసే సమయాల కోసం ఎయిర్‌లైన్ యాప్‌లను పరిశీలించండి. ఇక విమానంతో పాటు పుణ్యక్షేత్రాల పర్యటనలు ప్లాన్ చేసుకునేవారు ముందుగా రైలు టికెట్లు, దర్శన సమయాలను ఖరారు చేసుకోవాలి. ఐఆర్‌సీటీసీ తత్కాల్ ఏసీ క్లాస్‌కు ఉదయం 10:00 గంటలకు, స్లీపర్ క్లాస్‌కు ఉదయం 11:00 గంటలకు బుక్ చేసుకోవచ్చు. తిరుమల టీటీడీ ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను నిర్దేశిత సమయానికి పొందండి. శ్రీశైలం, తిరువణ్ణామలై ఆలయాల దర్శన పాస్‌ల కోసం వాటి అధికారిక పోర్టళ్లను మాత్రమే ఉపయోగించండి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+