భారతదేశంలో అనేక ఏళ్లుగా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలను ఇక్కడివారు విశ్వసిస్తున్నారు. వాటిని ఏన్నో యేళ్ల నుంచి పాటిస్తూ ఉన్నారు కూడా. భారత్‌లోని ఒక్కో ప్రాంతం ఒక్కో వేడుకలు, పండుగలకు ఎంతో ప్రసిద్ధిచెందింది. అందులో గోవా ఒకటి. గోవా దాని సంస్కృతి, ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. గోవా పేరు చెప్పగానే అందరికీ ఇక్కడి బీచ్‌లే గుర్తుకొస్తాయి. గోవా దాని అద్భుతమైన బీచ్‌లతో పాటు ఆధునిక సంస్కృతికి ఎంతగానో ప్రసిద్ధి చెందింది. స్నేహితులు, పార్టనర్‌తో కలిసి సందర్శించేందుకు గోవా ఒక గొప్ప ప్రదేశం.
దాదాపు ప్రతి నెలా ఇక్కడ ఏదో ఒక పండుగ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ జరిగే ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఇక్కడ ఏడాది పొడవునా అనేక ప్రత్యేకమైన పండుగలు జరుపుకుంటూనే ఉంటారు. అందులో ఒకటి దివార్ ద్వీపంలో నిర్వహించే బొండేరం ఉత్సవం. ఇది ఎంతో ప్రత్యేకమైనది. ఇది రంగుల వేడుక. ఈ సీజన్‌లో గోవా వెళితే మాత్రం తప్పకుండా మీరు బొండేరామ్ ఉత్సవాన్ని వీక్షించాల్సిందే. ఈ ఉత్సవాన్ని గోవాలో ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఇక, ఈ ఏడాది ఆగస్టు 24న అంటే నేడే ఈ పండుగను జరుపుకుంటారు.

బొండేరం పండుగ ప్రత్యేకత...
బొండేరం పండుగ గోవాలో చాలా ప్రత్యేకమైన పండుగగా చెప్పొచ్చు. ఈ పండుగ గోవా సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఈ ఉత్సవం పంజిమ్ నగరానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న దివార్ ద్వీపంలో నిర్వహిస్తారు. బొండేరం అనేది పోర్చుగీస్ పదం. దీనికి అర్థం జెండా. ఈ ఫెస్టివల్‌లో అందరూ రంగుల రంగుల దుస్తులు ధరించి ఆటపాటలతో ఎంజాయ్ చేస్తుంటారు. దీనిని చూసేందుకు భారతదేశం నుండి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు తరలి వస్తుంటారు. ఇప్పుడు ఆగస్టు 24న దివార్ ద్వీపంలో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవంలో పాల్గొనడం ద్వారా గోవా స్థానిక రుచులను కూడా ఆస్వాదించవచ్చు.

మాక్ ఫైట్ నిర్వహణ..
గోవా రాజధాని పంజిమ్‌కు సమీపంలో ఉన్న దివార్ ద్వీపంలో బొండెరామ్ పండుగను నిర్వహిస్తారు. ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా, అందంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారు ఈ పండుగ వైభవాన్ని చూడటమే కాకుండా, సమీపంలోని ప్రాంతాలను వీక్షించేయొచ్చ. ఈ ద్వీపంలోని ప్రజలు పోర్చుగీసు పాలకులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన సమయాన్ని గుర్తుచేస్తూ ఈ పండుగను ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగ సందర్భంగా ఇక్కడివారు జెండాలు చింపి మాక్ ఫైట్ నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో జరిగిన నిరసన నేడు సంతోషకరమైన వేడుకగా రూపాంతరం చెందిడమే కాకుండా ఇక్కడి సంస్కృతికి చిహ్నంగా మారింది.
ప్రధాన ఆకర్షణ ఇదే..
ఈ పండుగ ప్రత్యేక ఆకర్షణ ఫ్లోట్ పరేడ్. ఇందులో స్థానిక ప్రజల సృజనాత్మకతతో పాటు కళాత్మక ప్రతిభను కూడా చూడొచ్చు.వీటితోపాటు గోవా జానపద కథలు, పౌరాణిక కథలు వంటివి చూడొచ్చు. సాంప్రదాయ గోవా సంగీతం ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ పండుగలో స్థానిక ప్రజలు ప్రత్యేక వేషధారణలతో చేసే సంప్రదాయ నృత్యం ఎంతో ప్రత్యేకం.



Click it and Unblock the Notifications













