సీతాకోక చిలుక అందమైన రెక్కలున్న ఒక కీటకం. అవి మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. చిన్నప్పుడు దానిని పట్టుకోవటానికి దాని వెంట ఎన్ని సార్లు పరిగెత్తామో తెలీదు ..! చూడటానికి ఎంతో అందంగా రంగురంగుల రెక్కలను ఊపుతూ ఎగిరిపోతాయి. సీతాకొక చిలుక సీతాదేవి కి ఇష్టమని నేనెక్కడా ఎవరో చెబితే విన్నాను ..! అది నిజమో కాదో నాకైతే తెలీదు.
సీతాకొక చిలకను పట్టుకోవటం అంటే చిన్నప్పుడూ అందరికీ సరదానే. ఇప్పుడైతే ఆ అవకాశం లేదులెండి ... అవి కనపడటమే తక్కువైపోయాయి. ఏమి చేస్తాం .. భూమాతని అతంగా కష్టపెడుతున్నాం మనం. వాటికి కనీసం ఆహారం లేకుండా మొక్కలను, చెట్లను నరికేస్తున్నాం ..
కానీ మీ సరదా తీరే మార్గం ఒకటుంది. అక్కడ వందల సంఖ్యలో ఒకే చోట సీతాకోక చిలుకలు దొరుకుతాయి. మీరు ఎంచక్కా పట్టుకోవచ్చు అనుకుంటున్నారేమో .. కాదు కాదు చూడటానికి. అవి బటర్ ఫ్లై పార్క్ లండీ ..!

బటర్ ఫ్లై పార్క్, బెంగళూరు
స్థాపితం : 2006, నవంబర్ 25
విస్తీర్ణం : 7. 5 ఎకరాలు
సుమారు 20 కు పైగా సీతాకోక చిలుకల జాతులు ఉన్నాయి. ఇందులో ఒక కృతిమ వాటర్ ఫాల్ కూడా కలదు. దేశంలోనే మొదటి బటర్ ఫ్లై పార్క్ ఇది.
చిత్ర కృప : Muhammad Mahdi Karim

బటర్ ఫ్లై పార్క్, షిమ్లా
విస్తీర్ణం : 10 ఎకరాలు
సుమారు 300 కు పైగా సీతాకోక చిలుకల జాతులు ఉన్నాయి. ఇక్కడ మ్యూజియం కూడా కలదు. దేశంలో రెండవ బటర్ ఫ్లై పార్క్ ఇది.
చిత్ర కృప : Biswajit_Dey

బటర్ ఫ్లై పార్క్, పుణె
స్థాపితం : మార్చ్ 8, 2011
విస్తీర్ణం : 2 ఎకరాలు
సుమారు 80 కు పైగా సీతాకోక చిలుకల జాతులు ఉన్నాయి. రాక్ గార్డెన్, జలపాతాలు మరియు జాగింగ్ ట్రాక్ లు పార్క్ లో చూడవచ్చు.
చిత్ర కృప : Gavriel

బటర్ ఫ్లై పార్క్, చండీఘర్
ప్రారంభం : 23 మే, 2011
విస్తీర్ణం : 7. 5 ఎకరాలు
ఇక్కడ కూడా పదుల సంఖ్యలో సీతాకోక చిలుకల జాతులు ఉన్నాయి.
చిత్ర కృప : Tanmay

బటర్ ఫ్లై పార్క్, సిక్కిం
విస్తీర్ణం : 14 ఎకరాలు
ఇది ఇండియాలోని మొట్టమొదటి ఓపెన్ - ఎయిర్ బటర్ ఫ్లై పార్క్. రంగ్ రంగ్ లో దీనిని స్థాపించారు. ఇక్కడ కొంత మంది ప్రకృతి ప్రేమికులు సొంతంగా బటర్ ఫ్లై పార్క్ లను కూడా ఏర్పాటు చేశారు.
చిత్ర కృప : Srinivas G

బటర్ ఫ్లై కన్జర్వేటరీ ఆఫ్ గోవా
విస్తీర్ణం : 4000 చ. మీ.
గోవా లోని పాండా లో బటర్ ఫ్లై కన్జర్వేటరీ ఆఫ్ గోవా కలదు. ఇక్కడ కృతిమంగా సన్నటి నీటి ప్రవాహాలు, చెరువులను ఏర్పాటు చేశారు. గోవా వెళితే బటర్ ఫ్లై కన్జర్వేటరీ ఆఫ్ గోవా తప్పక చూసిరండి.
చిత్ర కృప : indiawaterportal.org

ఓవలేకర్ బటర్ ఫ్లై ఫామ్ ఆఫ్ వాడి, థానే
ముంబై కి సమీపంలో ఓవలేకర్ బటర్ ఫ్లై ఫామ్ ఆఫ్ వాడి కలదు. దీనిని 2 ఎకరాలలో స్థాపించారు. ఇక్కడ 100 ల రకాల సీతాకోక జాతులను చూడవచ్చు.
చిత్ర కృప : Rajkamal Goswami Follow



Click it and Unblock the Notifications











