అందమైన హిల్‌స్టేషన్‌లకు కేరాఫ్ అడ్రస్.. చంఢీగడ్..!
చంఢీగఢ్ నగరం విభిన్న వారసత్వం, సంస్కృతి, ఆహారపు సమ్మేళనం. ఈ ప్రాంతం ఉద్యానవనాలు, స్మారక కట్టడాలకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. వారాంతపు సెలవుల్లో సందర్శించేందుకు చండీగఢ్ ఎంతో ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడి హిల్ స్టేషన్‌లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. చండీగఢ్ చాలా అందమైన నగరం. ఇక్కడ నివసించడానికి చాలామంది ఇష్టపడుతారు. అందమైన తోటలు, సరస్సులు, జలపాతాలు, పచ్చదనం నిండిన అనేక అద్భుతమైన ప్రదేశాలకు ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఈ నగరం పరిసరాల్లో కొన్ని అందమైన హిల్ స్టేషన్లు ఉన్నాయి. చండీగఢ్ సమీపంలోని హిల్ స్టేషన్‌లను లాంగ్ వీకెండ్‌లో చుట్టేయొచ్చు. మరెందుకాలస్యం బయలుదేరండి..

బరోగ్
నగర జీవితపు ఒత్తిడి నుండి తప్పించుకోవాలంటే ఛండీగడ్‌లోని బరోగ్ హిల్‌స్టేషన్‌ను సందర్శించాల్సిందే. బరోగ్ హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఉంది. చండీగఢ్ నుండి బరోగ్ సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో అనేక హోటల్స్, రిసార్ట్స్‌లు కూడా ఉన్నాయి. ఈ హిల్‌స్టేషన్ ట్రెక్కింగ్ ప్రియులకు, ప్రకృతి ప్రేమికులకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఫారెస్ట్ వాక్ వంటికి కూడా చేయొచ్చు. వీకెండ్స్‌లో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడి పర్వత శిఖరాలను నేరుగా తాకుతున్న అనుభూతి పర్యాటకులకు కలుగుతుంది.

చైల్
చైల్ హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఉన్న మరొక అందమైన హిల్ స్టేషన్. ఈ హిల్‌స్టేషన్ చంఢీగడ్‌కు సమీపంలో ఉంది. ఒకప్పుడు ఈ హిల్ స్టేషన్ మహారాజా భూపేంద్ర సింగ్ రాజధానిగా ఉండేది. అతను వేసవి సెలవుల్లో ఇక్కడికి వచ్చేవారని ఇక్కడివారు నమ్ముతారు. చుట్టూ పచ్చని ప్రకృతి అందాలతో ఈ ప్రాంతం పర్యాటకులను కనువిందు చేస్తుంది. ఈ ప్రదేశం విశ్రాంతి తీసుకునేందుకు వారాంతాల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు ఎంతో అనువైనది. చండీగఢ్ నుండి ఇక్కడికి సుమారు 104 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
కసౌలి
హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలి హిల్‌స్టేషన్ కూడా వారాంతల్లో సందర్శరించేందుకు ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ బ్రిటీష్, మొఘల్ పాలనపు అనేక చారిత్రక వారసత్వాన్ని చూడొచ్చు. సెలవులను ప్రశాంతంగా ఆస్వాదించాలనుకునేవారు తప్పకుండా కసౌలిని సందర్శించొచ్చు. కసౌలి హిల్ స్టేషన్లోని అతి ముఖ్యమైన ఆకర్షణ మంకీ పాయింట్. దీని చుట్టూ హార్స్ చెస్ట్‌నట్ మరియు హిమాలయన్ ఓక్ అడవులు ఉన్నాయి. ఈ ప్రదేశం పిల్లలకు చూపించడానికి సరైనది. చండీగ
ఢ్ నుండి కసౌలికి రెండు గంటల్లో చేరుకోవచ్చు. అలాగే, ఢిల్లీ నుండి కసౌలికి ఆరు గంటల్లో చేరుకోవచ్చు.

మోర్ని హిల్స్
చంఢీగడ్ కు సమీపంలో మోర్ని కొండలు వారాంతాల్లో సందర్శంచేందుకు ఎంతో అనువైన ప్రదేశం. ప్రకృతిసిద్ధమైన ఆహ్లాదాన్ని పొందేందుకు ఈ ప్రదేశం ఎంతో ఉత్తమమైనదని చెప్పుకోవచ్చు. కుటుంబంతో, స్నేహితులతో కలిసి విహరించేందుకు ఈ ప్రాంతం మంచి ఎంపిక. ఇక్కడి కొండపై ఉన్న పట్టణ అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. విభిన్నమైన వృక్షసంపద, జంతుజాలాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధిచెందింది. చండీగఢ్‌కు సమీపంలో ఉన్న ఉత్తమ హిల్ స్టేషన్ ఇది. ఇక్కడ బోటింగ్, బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్ వంటి కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ నుండి ఈ ప్రాంతాన్ని చేరుకునేందుకు సుమారు ఆరుగంటల సమయం పడుతుంది. ఈ ప్రాంతంలో పిల్లలతో సరదాగా గడిపేందుకు చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.



Click it and Unblock the Notifications












