Search
  • Follow NativePlanet
Share
» »గోవాలోని ఈ బీచ్‌ల‌లో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు చేసుకోండి..

గోవాలోని ఈ బీచ్‌ల‌లో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు చేసుకోండి..

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు ఇక కొన్ని రోజులు మాత్ర‌మే మిగిలింది. ఈ కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల‌ను ఎంతో హాయిగా జ‌రుపుకోవాల‌నుకుంటే మాత్రం గోవాలోని ఈ ప్ర‌దేశాల‌కు త‌ప్ప‌కుండా వెళ్లాల్సిందే. గోవాలో న్యూ ఇయర్ సందర్భంగా, ప్ర‌తి ప్ర‌దేశం ఎంతో అందంగా ముస్తాబ‌వుతుంది. ఇక్క‌డ ప్ర‌తి క్లబ్ పబ్‌లో పార్టీలు నిర్వహిస్తుంటారు. అయితే సముద్రపు అలల మధ్య బీచ్‌లో కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడం కొత్త అనుభూతినే ఇస్తుంది. గోవాలో ప్ర‌సిద్ధిచెందిన ఈ బీచ్‌ల‌లో న్యూ ఇయ‌ర్ పార్టీ వేడుక‌ల‌ను జ‌రుపుకోండి.

మోర్జిమ్ బీచ్

గోవాలోని మోర్జిమ్ బీచ్‌లో ప్ర‌శాంత‌మైన వాత‌వ‌ర‌ణాన్ని ఆస్వాదించొచ్చు. మోర్జిమ్ బీచ్ ఉత్తర గోవాలో ఉంటుంది. ఈ ప్ర‌దేశాన్ని డిసెంబరు-జనవరి సమయంలో సంద‌ర్శించొచ్చు. ఇక్క‌డ అనేక జాతుల పక్షులు, తాబేళ్లు కూడా ఈ బీచ్‌లో కనిపిస్తాయి. స్నేహితులతో క‌లిసి న్యూ ఇయర్ పార్టీ వేడుకలు చేసుకునేందుకు ఈ బీచ్ ఎంతో అనువైన‌ది.

anjunabeach , goa

అరాంబోల్ బీచ్

సూర్యాస్తమయ దృశ్యాల‌ను వీక్షించాలంటే గోవాలోని అరాంబోల్ బీచ్‌ను త‌ప్ప‌కుండా సంద‌ర్శించాల్సిందే. ఇంకా ఈ బీచ్‌లో వివిధ రకాల సీ ఫుడ్‌తో సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్క‌డి బీచ్‌లో న్యూ ఇయర్ పార్టీ చాలా బాగుంటుంది. చాలామంది ప‌ర్యాట‌కులు చ‌లికాలంలో మాత్రమే ఇక్కడికి రావడానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. అరాంబోల్ బీచ్ గోవాలోని అత్యుత్తమ బీచ్‌లలో ఒకటిగా పరిగణించబడింది. ఇది ఉత్తర గోవాలో ఉంటుంది.

పలోలెం బీచ్‌

స్విమ్మింగ్ చేసేందుకు దక్షిణ గోవాలోని పలోలెం బీచ్ ఎంతో అనువైన‌ది. తెలియని వ్యక్తులు కూడా స్నేహితులుగా మారే బీచ్ ఇది. న్యూ ఇయర్ వేడుక‌లు జ‌రుపుకునేందుకు ఇది ఉత్తమ‌మైన ప్రాంతం. ఒంటరిగా గోవాకు వెళ్లినట్లయితే, పలోలెం బీచ్‌ను త‌ప్ప‌కుండా సందర్శించండి.

morjimbeach , goa

అంజునా బీచ్

అంజునా అనేది ఉత్తర గోవాలోని అత్యంత ప్రసిద్ధి చెందిన బీచ్‌ల‌లో ఒక‌టి. దీని పొడవు దాదాపు 2 కిలోమీట‌ర్లు. స్నేహితుల స‌మూహంతో క‌లిసి గోవా వెళితే మాత్రం త‌ప్ప‌కుండా ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించండి. ఈ బీచ్‌లో అనేక ప్రసిద్ధ క్లబ్‌లు ఉన్నాయి.
సాహ‌స కార్య‌కలాపాలు ఆస్వాదించాల‌నుకునేవారు ఈ బీచ్‌కు రావొచ్చు. ఎందుకంటే ఇక్క‌డ వాటర్ స్పోర్ట్స్ వంటి స్పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ తినుబండ‌రాలు, పానీయాలు అతి త‌క్కువ ధ‌ర‌లకే ల‌భిస్తాయి.

బాగా బీచ్

గోవాలోని బాగా బీచ్ ఉత్తర గోవాలోని ఒక ప్రధాన బీచ్‌ల‌లో ఒక‌టిగా ప్ర‌సిద్ధిచెందింది. ఈ బీచ్ ఫోర్ట్ అగ్వాడా నుండి మొదలై, కలంగుటే వ‌ర‌కూ ఉంటుంది. ఆ తర్వాత బాగా బీచ్ చివరకు అంజునా బీచ్‌లో చేరుతుంది. ఈ ప్రాంతం ఫిషింగ్‌కు అనువైనదని చెప్పుకోవ‌చ్చు. ప్రతి శనివారం రాత్రి ఈ బీచ్‌లో ఒక మార్కెట్‌ను నిర్వ‌హిస్తారు. ఇక్క‌డ అన్ని రకాల వస్తువులను విక్రయించే చిన్న స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ల‌భించే అన్ని వస్తువులు త‌క్కువ ధ‌ర‌లే ఉంటాయి.

calangutebeach , new year

కలంగుటే బీచ్

ఉత్తర గోవాలోని కలంగుటే బీచ్ గోవాలో అతి పొడవైన బీచ్‌గా పేరుగాంచింది. దీనిని 'క్వీన్ ఆఫ్ బీచ్' అని కూడా పిలుస్తారు. గోవాలోని కలంగుటే బీచ్ కూడా ప్రపంచంలోని టాప్ 10 బీచ్‌లలో చేర్చబడింది. ఇంత అద్భుతమైన బీచ్‌లో న్యూ ఇయర్ పార్టీ వేడుకలు జరుపుకోవడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ బీచ్‌లో ప‌ర్యాట‌కులు స్విమ్మింగ్, జెట్ స్కీయింగ్, సర్ఫింగ్ వంటి ఇతర వాటర్ స్పోర్ట్స్‌ను కూడా ఆస్వాదించొచ్చు.

కండోలిమ్ బీచ్

రాజధాని పనాజీకి సుమారు 15 కిలోమీట‌ర్ల దూరంలో ఉత్తర గోవాలో కండోలిమ్ బీచ్ ఉంటుంది. ఈ బీచ్‌లో కాలానుగుణంగా సముద్రపు నీటి రంగు మారుతూ ఉంటుందని ఇక్క‌డికి వెళ్లే వారు చెబుతున్నారు. ఫోటోగ్రఫీని ఆస్వాదించాల‌నుకునే వారు ఖచ్చితంగా గోవాలోని ఈ బీచ్‌కు వెళ్లాల్సిందే.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+