Search
  • Follow NativePlanet
Share
» »చౌల్ - ఒక పోర్చుగీసు పట్టణం !!

చౌల్ - ఒక పోర్చుగీసు పట్టణం !!

ఈ పర్యాటక ప్రదేశం ఆలిబాగ్ సమీపంలో కలదు. పట్టణంలో పోర్చుగీస్ శిధిలాలు మరియు అనేక చర్చ్ లు, యూదుల ప్రార్ధనాలయాలు ఉంటాయి. చౌల్ కాడు లైట్ హస్ కోర్లై పోర్ట్ సమీపంలో అందంగా నిలబడి ఉంటుంది.

By Mohammad

గతంలో చౌల్ పోర్చుగీసు పాలకుల పట్టణంగా ఉండేది. ఈ పట్టణం ముంబైనుండి దక్షిణ దిశగా 111 కి.మీ.ల దూరంలో మహారాష్ట్రలోని రాయ్ ఘడ్ జిల్లాలో కలదు. చరిత్ర తిరగేస్తే, పోర్చు గీస్ పాలకులు 500 సంవత్సరాల క్రిందట మొదటగా చౌల్ లో స్ధిరపడ్డారు.

చౌల్ - ఒక పోర్చుగీసు పట్టణం !!

చిత్రకృప : Christophe.Finot

సందర్శనా స్ధలాలు

ఈ పర్యాటక ప్రదేశం ఆలిబాగ్ సమీపంలో కలదు. పట్టణంలో పోర్చుగీస్ శిధిలాలు మరియు అనేక చర్చ్ లు, యూదుల ప్రార్ధనాలయాలు ఉంటాయి. చౌల్ కాడు లైట్ హస్ కోర్లై పోర్ట్ సమీపంలో అందంగా నిలబడి ఉంటుంది. కోర్లై కోట మరియు చౌల్ కోట లు రెండూ కూడా చారిత్రక ప్రధానమైనవే. ప్రకృతి ప్రియులు సహజ అందాలు కల రేవదండ బీచ్ తప్పక చూసి ఆనందించాలి. ఈ ప్రదేశంలో కల దత్త మందిరం మతపరంగానే కాక చారిత్రక పరంగా కూడా విశేషత కలిగి ఉంది.

చౌల్ - ఒక పోర్చుగీసు పట్టణం !!

చిత్రకృప : Rjshinde

దత్త మందిరం

దత్తమందిరం రేవదండ లో కలదు. దీనిలో మహారాష్ట్రులు పూజించే దత్తాత్రేయుడు విగ్రహం కలదు. ఈ దేవాలయాన్ని శివాజి పాలనలో శత్రువులను గమనించేందుకు నిర్మించినట్లు చెపుతారు. దత్తాత్రేయుడి జన్మదినం వైభవంగా అయిదు రోజుల పాటు జరుపుతారు. ఈ దేవాలయం కొండ శిఖరంపై కలదు. సుమారు 1500 మెట్లు ఎక్కాలి. పైకి ఎక్కి చూస్తే, చౌల్ మరియు రేవదండ పట్టణాలు ఎంతో రమణీయంగా కనపడతాయి.

చౌల్ - ఒక పోర్చుగీసు పట్టణం !!

చిత్రకృప : Ccmarathe

కొర్లై కోట

కొర్లై కోటను మారో లేదా కేసల్ కర్లూ అని కూడా అంటారు. దీనిని పోర్చుగీసు వారు కొర్లై పట్టణంలో మారో డిచౌల్ ద్వీపంపై నిర్మించారు. ఈ కోటను పోర్చుగీసు పాలకులు వారి పాలన రక్షణ కొరకు వినియోగించారు. రేవదండే ఓడరేవు మార్గాన్ని రక్షించేందుకు దీని నిర్మాణం జరిగింది. ఈ కోట నిర్మాణం ప్రపంచంలోని పటిష్టమైన కోటలలో ఒకటిగా ఖ్యాతి చెందింది. ఒకప్పుడు దీనిలో సుమారుగా 7000 గుర్రాలు, అదే సంఖ్యలో మనుషులు వసతి పొందేవారు.

రేవదండ

చౌల్ పట్టణం నుండి రేవదండ సుమారు 4 కి.మీ.ల దూరం ఉంటుంది. ఇది ఆలిబాగ్ సమీపంలో ఉంటుంది. దీనికి చారిత్రక ప్రాధాన్యత కలదు. ఈ ప్రాంతం వక్కల మరియు కొబ్బరి తోటలు కలిగి ఉంటుంది. స్ధానికంగా దీనిని మరాఠిలో నారలాచ్చి బాగ్ అంటారు. మంచి సువాసననిచ్చే ఒక బకులి అనే పూవు ఇక్కడ లభిస్తుంది. రేవదండ బీచ్ దూరంగా ఉన్నప్పటికి ఎంతో అందంగా ఉంటుంది. ఈ బీచ్ అంతా నల్లని ఇసుక కలిగి ప్రశాంతంగా ఉంటుంది.

చౌల్ - ఒక పోర్చుగీసు పట్టణం !!

చిత్రకృప : Alewis2388

చౌల్ కాడు లైట్ హౌస్

చౌల్ కాడు లైట్ హౌస్ కోర్లై పోర్టు సమీపంలో కలదు. దీనివద్దకు మెషీన్ బోట్ లో చేరవచ్చు. ప్రయాణం సుమారు గంటనుండి గంటన్నర వరకు పడుతుంది. లైట్ హౌస్ చుట్టూ ఉండే చౌల్ కాడు దిబ్బలు అందంగా ఉంటాయి. నావికుల కొరకు లైట్ హౌస్ చుట్టూ కొన్ని గుర్తులు నిర్మించారు.

ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

చౌల్ పట్టణం ఆలీ బాగ్ వద్ద ముంబైకి 108 కి.మీ.ల దూరంలో కలదు. ఇది ముంబై - గోవా జాతీయ రహదారిపై కలదు. తేలికగా చేరుకోవచ్చు. ముంబై, పూనే ల నుండి చౌల్ కు ప్రభుత్వ మరియు ప్రయివేట్ బస్సులు అనేకం కలవు.

రైలు ప్రయాణం

పెన్ రైల్వే స్టేషన్ చౌల్ కు అతి సమీపం సుమారు 46 కి.మీ.ల దూరంలో కలదు. పెన్ స్టేషన్ మహారాష్ట్ర లోని అన్ని ప్రధాన పట్టణాలకు మరియు బయటి ప్రదేశాలకు కొంకణ్ రైల్వేలో చక్కటి అనుసంధానం కలిగి ఉంది.

విమాన ప్రయాణం

ముంబై నగరంలోని ఛత్రపతి శివాజి విమానాశ్రయం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ఇండియాలోని అన్ని పట్టణాలకు మరియు నగరాలకు ప్రతిరోజూ రాకపోకలు కలిగి ఉంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+