Search
  • Follow NativePlanet
Share
» »క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు ...హోటల్ లీలా పాలస్!

క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు ...హోటల్ లీలా పాలస్!

ప్రతి కొత్త సంవత్సరం అద్భుతమైన ఆనంద క్షణాలను తెస్తుంది. ఎన్నో వాగ్దానాలు చేసుకుంటాం. సంవత్సరం అంతా అలానే ఆనందాలతో కుటుంబ సభ్యులు లేదా ప్రియమైన వారితో ఆనందించాలని భావిస్తాం. ప్రతి వారూ ఈ నూతన సంవత్సర మరియు క్రిస్టమస్ వేడుకలను వివిధ ప్రదేశాలలో వివిధ రీతులలో చేసుకొనే ఆనందిస్తారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సమయంలో తీము చేసే వ్యయానికి కూడా ఆలోచించారు. సౌకర్యాలు, ఆనందం కావాలని కోరుకుంటారు. మరి ఇంత అద్భుతమైన న్యూ ఇయర్ స్వాగత వేడుకను న్యూ ఢిల్లీ లోని లీలా పాలస్ హోటల్ మరింత ఆకర్షణీయంగా చేసి మీకు మరువలేని అనుభూతులు అందించాలని కొన్ని ప్లాన్ లు ప్రకటించింది.

ఎన్నో ఆశ్చర్యాలు, చక్కని పరిసరాలు, ఉత్తమ గెస్ట్ సేవలు, వారి సాంప్రదాయక ఆతిథ్యం వంటివి మీకు సంతృప్తి ని తప్పక ఇస్తాయి. ఢిల్లీ లోని అందమైన గెస్ట్ రూమ్ లలో రెండు రాత్రులు వుండండి, వారు చేసే అతిధి మర్యాలు పొంది ఆనందించండి.

లీలా పాలస్ లో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలు

ఖరీదైన కారులో నుండి అడుగు బయట పెడితే చాలు, హోటల్ ప్రాంగణ ముందు భాగంలో ఎర్రటి తివాచీలు పరచబడి వుంటాయి. సెల్యూట్ లు చేసే సిబ్బంది, మిమ్మల్ని ఒక అందమైన షాంపేన్ గ్లాస్ తో లోపలి ఆహ్వానిస్తారు. కొద్దిపాటి చిరుతిండి అందిస్తారు. ఆధునిక సౌకర్యాల రూమ్ ఏర్పరుస్తారు. మీ వేడుకలను చక్కటి అద్దాలు బిగింఛి కళ్ళు మిరుమిట్లు గొలిపే దీపాల వెలుగులు కల రెస్టారెంట్ లో లంచ్ తో ప్రారంబించండి. శాంతా క్లాస్ బహుమతులు, యురోపియన్ స్టైల్ న్యూ ఇయర్ వేడుకలు లీలా పాలస్ ప్రత్యేకతలు.

దేశీయ సంస్కృతి

పరిసరాలు ఆధునిక హంగులతో నిండి అనేక రకాల చిత్రాలు, భారత దేశ చరిత్ర , సంస్కృతులు ప్రతిబింబించే లా వుంటాయి. క్రిస్టమస్ రోజు మరుసటి రోజు బాక్సింగ్ డే అంటారు. ఈ రోజు కూడా వివిధ రకాల ప్రోగ్రాం లు వుంటాయి. హోటల్ లోపలి భాగాలు ఒక స్వర్గాన్ని తలపిస్తాయి. ఈ ప్రత్యేక ఏర్పాట్లతో క్రిస్టమస్, న్యూ ఇయర్ లు ఆనందించేందుకు ఒక గొప్ప అవకాశం కాగలదు. జీవితంలో మరపురాని ఆనందాకర క్షణాలను ఈ సమయంలో అనుభవించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు వుంటాయి.

కొత్త సంవత్సర హంగామా !
వేడుకల స్వాగతం
వెల్కం షాంపేన్ మరియు కొన్ని చిరు తిండ్లు మీరు రాగాని అందిస్తారు. బ్రేక్ ఫాస్ట్ బఫే టైపు లో వుంటుంది. ఎయిర్పోర్ట్ పిక్ అప్ డ్రాప్ లు వుంటాయి. క్యూబ్ లో క్రిస్టమస్ మరియు లీలా పాలస్ లో న్యూ ఇయర్ ఏర్పాట్లు. క్రిస్టమస్ వేడుకలు 24 డిసెంబర్ నుండి - 26 డిసెంబర్ 2013 వరకు. న్యూ ఇయర్ వేడుకలు 31 డిసెంబర్ నుండి 02 జనవరి 2014 వరకూ వుంటాయి. లీలా హోటల్ చార్జీలు ఈ వేడుకలకు గాను రూ. 44,500 గా కలవు. ఈ మొత్తంలో మీకు రెండు రాత్రుల సౌకర్యాలు వుంటాయి. -

సౌకర్యాల ఏర్పాట్లు
- 24 గంటల బట్లర్ సర్వీస్,

- అడ్వాన్స్డ్ ఇన్ రూమ్ టెక్నాలజీ,

- స్పెషల్ రెస్టారెంట్ లు

- స్పా , ఫిట్నెస్ సెంటర్ ల వాడకం,

- టెంపరేచర్ నియంత్రించబడిన రూఫ్ టాప్ కల స్విమ్మింగ్ పూల్స్,

- మీటింగ్ రూమ్ లు,

- ఇంటర్నెట్ సేవలు మొదలైన ఎన్నో సౌకర్యాలు మీరు ఉపయోగించుకొనవచ్చు. .

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+