బాలీవుడ్, టాలీ వుడ్ మరియు కొలీ వుడ్ ఇలా ఎన్నో ప్రదేశాలను మనం పిలుస్తూ ఉంటాము. అసలు మనం సినిమాలలో చూసే అందమైన జలపాతాలు, పార్క్ లు ఎక్కడ షూట్ చేస్తారో మీకు తెలుసా? భారత దేశ చిత్ర పరిశ్రమ పూర్తి గా ఫిలిం సిటీ ల పై ఆధార పడి వుంది. ఈ ఫిలిం సిటీ లలో మీకు స్కూల్, కాలేజ్ లేదా హాస్పిటల్, హౌస్ ఏదైనా సరే షూటింగ్ కు దొరుకుతుంది. ఇంకా వాటర్ ఫాల్స్, నదులు, డాములు వంటి ప్రకృతి దృశ్యాలు కూడా కృత్రిమ రీతిలో నిర్మించి, ప్రేక్షకులను ఆనందింప చేస్తారు. మరి ఈ రకమైన ప్రసిద్ధి చెందిన ఫిలిం సిటీ ల గురించి తెలుసుకుందాం .

రామోజీ ఫిలిం సిటీ
మీరు సినిమా చూసినా లేక చూడకపోయినా రామోజీ ఫిలిం సిటీ గురించి వినే వుంటారు. ఈ ఫిలిం సిటీ అతి పెద్దది. ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధ్లి చెందినది. నేటి యువతరం జంటలు తమ ఫస్ట్ నైట్ లను ఇక్కడే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు కూడాను.

రామోజీ ఫిలిం సిటీ
రామోజీ ఫిలిం సిటీ లో ఢిల్లీ లోని మొఘల్ గార్డెన్స్ సెట్టింగ్ ఇక్కడ చూడండి. అచ్చం ఒరిజినల్ గార్డెన్స్ ను పోలి వుంటాయి. చెపితే గాని నమ్మలేరు

రామోజీ ఫిలిం సిటీ
మైసూరు బృందావన్ గార్డెన్స్ యొక్క సెట్టింగ్ ఇక్కడ చూడండి.దీనిని అనేక సినిమాలలో చిత్రీకరించారు.

రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో మరొక అందమైన సెట్టింగ్. ఈరకమైన వింతసెట్టింగ్లు మీకు ఎన్నో దర్శన మిస్తాయి.

నోయడా ఫిలిం సిటీ
నోయ డా ఫిలిం సిటీ కూడా ప్రసిద్ధి చెందినదే. దీనిని కూడా త్లప్పక చూడాలి. ఈ ఫిలిం సిటీ లో ఎక్కువగా మార్వా ఫిలిం లు మరియు వీడియో స్టూడియో లు, ఆసియన్ అకాడమీ అఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ కలవు.

ముంబై ఫిలిం సిటీ
ముంబై ఫిలిం సిటీ ని దాదా సాహెబ్ ఫాల్కే చిత్రనగరి అని కూడా అంటారు. ఇది సంజయ్ గాంధి నేషనల్ పార్క్ పొలిమేరలలో కలదు.

ముంబై ఫిలిం సిటీ
ఇక్కడ పాపులర్ టి వి షో లు కూడా చిత్రీకరించాబడతాయి ' కామెడి నైట్ విత్ కపిల్ ' వంటి ఫిలిం లు ఇక్కడ షూట్ చేసారు.

ముంబై ఫిలిం సిటీ
టాప్ సక్సెస్ అయిన సినిమా ధూమ్ - 2 లో టన్నెల్ సీన్ చూసే వుంటారు. దానిని ఇక్కడే చిత్రీకరించారు.

ముంబై ఫిలిం సిటీ
దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అమితాబ్ నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్ పతి గురించి వినే వుంటారు. ఇక్కడే కౌన్ బనేగా కరోడ్ పతి షూటింగ్ జరిగింది.

ముంబై ఫిలిం సిటీ
బాలీవుడ్ లో టాప్ సక్సెస్ అయిన షా రుఖ్ ఖాన్ నటించిన ఫిలిం ఓం శాంతి ఓం ఇక్కడే షూట్ చేసారు.

ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ, బెంగుళూరు
సినీ ప్రేమికులు బెంగుళూరు ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ తప్పక చూడాలి. ఇక్కడ మీరు చూసేది, ఒక దయ్యాల మహల్ యొక్క బయటి భాగాలు.

ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ, బెంగుళూరు
ఇక్కడ మీరు చూసేది ఒక దయ్యాల మహల్ . భయపడకండి...ఇదంతా ఒక సెట్టింగ్ మాత్రమే సుమా.

ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ
ఇక్కడ మీరు చూసేది కార్టూన్ సిటీ. దీని సందర్శనలకు పిల్లలు ఎంతో ఇష్టపడతారు.

ఇన్నోవేటివ్ సిటీ
ఇన్నోవేటివ్ సిటీ లో అద్దాల సీన్లు. అద్దాలతో కొంత సేపు ఆడుకోవచ్చు. అద్దాలతో చూసి ఎంతో సమయం గరిపెయవచ్చు. వీటిని ఇష్టపడని వారు వుండరు.

ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ, బెంగుళూరు
అద్దాల మహల్ యొక్క ఇంటీరియర్ భాగాలు చూడండి. వీటిని ఎన్నో సినిమా షూటింగ్ లకు వాడారు.



Click it and Unblock the Notifications











