Search
  • Follow NativePlanet
Share
» »పర్యటనలలో చేసే సాధారణ తప్పులు!

పర్యటనలలో చేసే సాధారణ తప్పులు!

మనం సాధారణంగా పర్యటించే టపుడు కొన్న్ని తప్పులు చేస్తాం. కాని మొదటి సారి పర్యటించే వారే కాదు, కొంతమంది ఎన్ని సార్లు పర్యటించినా ఈ తప్పులు చేస్తారు. ఈ పర్యటన తప్పులు, చివరకు పర్యటనా అనుభవాన్ని కలిగిస్తాయి.

ఈ పర్యటన మీ హోం టవున్ ప్రయాణమైనా సరే లేదా ఒక కొత్త కంట్రీ కి మీరు వెళుతున్నా సరే ఈ రకమైన తప్పులు జరగటం సర్వ సాధారణం. ఏ రకమైన తప్పూ చేయకుండా పర్యటించటం సాధ్యమా ? ఖచ్చితమైన పర్యటన ఎలా చేయగలం? తప్పులు చేయని వారు ఏమీ చేయరు అనేది నానుడి. కనుక తప్పులతో అయినా సరే మనం కనుక పర్యటిస్తూ వుంటే, ఎంతో అనుభవం వచ్చి తీరుతుంది. ఆ అనుభవంతో ఆ తప్పులు చేయటం సరిదిద్దుకునే సామర్ధ్యం వస్తుంది. కనుక ఆ తప్పులను తప్పించి మీ ప్రయాణం సుఖకరం అయ్యేలా చూసుకోండి.

పర్యటనలలో చేసే సాధారణ తప్పులు!

పర్యటనలో మనం సాధారణంగా చేసే తప్పులు ఎలా ఉంటాయంటే...

అడ్వాన్సు బుకింగ్
చాలామంది ప్రయాణం ముందు తమ పర్యటన వివరాలు మరో మారు సరి చూసుకోరు. అది ట్రైన్, ఫ్లైట్, బస్సు లేదా హోటల్ బుకింగ్ వివరాలు ఖచ్చితంగా లేకుంటే, అవి మిమ్ములను ఆనందించాల్సిన సమయంలో విచార పడేలా చేస్తాయి.

తప్పు పేర్ల తో టికెట్ లు బుక్ చేయడం
తెలిసో, తెలియకో ఒక్కొక్కపుడు తప్పు పేర్లతో టికెట్ లు బుక్ చేయటం, వాటి చెకింగ్ సమయంలో గుర్తింపు కార్డ్ లకు అవి సరి పడక అవస్థలు పడటం కూడా జరుగుతుంది. కనుక ప్రయాణం ముందు వివరాలు సరి చూసుకోండి.

అధిక లగేజ్ సమస్య
సాధారణంగా మన ప్రయాణంలో అవసరం లేని కొంత లగేజ్ కూడా చేరుస్తాము. ఈ లగేజ్ కొద్ది రోజులు గడిచేటప్పటికి సమస్యగా మారుతుంది. దుస్తులు, కాస్మెటిక్స్ వంటివి రిపీట్ చేసుకోవచ్చు. ఈ సమయంలో మీకు ట్రావెల్ ఆనందం కాని ఫాషన్ కాదని గుర్తుంచుకోవాలి.

కాష్ సరి చూసుకోండి.
ప్రయాణం సమయంలో ప్రయాణం పూర్తిగా కాష్ లభ్యత తో ముడి పది వుంటుంది. సొమ్మును కనపడిన దాని పై ఖర్చు చేసే కంటే, కొంత వేరుగా ఎమర్జెన్సీ కొరకు ఉంచుకోండి. సొమ్ము ఆ క్షణంలో తీవ్ర అవసరమై ఇబ్బంది పెట్టవచ్చు. అవసర మనుకున్నది తప్పక ఖర్చు చేయాల్సిందే.

మీ ప్రయాణం మీరే నిర్ణయించుకోండి.
పుస్తకాలు చూసి, అనధికార సమాచారం పై ఆధారపడక, మీకై మీరే అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకొని ప్రయానించండి. లేదంటే, ఇబ్బంది పడే అవకాశం వుంది. మీరు ప్రయాణించే ప్రదేశం గురించిన వివరాలు ముందస్తుగా తెలుసుకోండి. స్థానికులు సూచించ గలరు. కాని దానిని మీరు సరి చూసు కోవాలి.

ప్యాకింగ్
సుదీర్ఘ ప్రయాణాలు చేసేటపుడు వస్తువులను సరిగా ప్యాక్ చేసామా లేదా అనేది గమనించండి. లిక్విడ్ బాటిల్స్ మూతలు సరిగా పెట్టండి. ప్రత్యేకించి ఫ్లైట్ ట్రావెల్ లో వీటిని గమనించండి.

ఇన్సూరెన్స్ పాలసీ
ట్రావెల్ అనుభవం లేని వారు సాధారణంగా ఇన్సురన్సు పాలసీ ల పట్ల జాగ్రత్త వహిన్చరు. వాటిని ఆచరిస్తే, అవి మీ భద్రతకు తోడ్పడ తాయి. అయితే, వీటిని అతిగా పోక అవసరం మేరకు వినియోగించండి. విదేశాలకు వెళ్ళే వారైతే, అక్కడి ఫోన్ లు, వాటి అద్దెలు గురించి కూడా తెలుసుకోండి.

ఫోటోగ్రఫీ
మనలో చాలా మంది ఫోటోలు అధికంగా తీసి సమయం వృధా చేస్తారు. కనుక మీకు అవసరమని తోచిన ప్రదేశం లోనే సమయం వెచ్చించండి. తర్వాత తీరిగా వీటిని ఎందుకు తీసామా అని అనుకుంటారు కూడాను.

లగేజ్ పట్ల శ్రద్ధ పెట్టండి.
కొన్ని మార్లు మన లగేజ్ పట్ల జాగ్రత్త పడకపోవటం జరుగుతుంది. కొత్తవారికి మన లగేజ్ భాద్యత అప్పగించకండి. అది ఎయిర్ పోర్ట్ లేదా రైల్వే స్టేషన్ అయినా సరే, లగేజ్ పై నిరంతరమూ ఒక కన్ను వేసి ఉంచాలి.

సహనం వహించండి
ప్రయాణంలో సహనం వహించండి. ఇతర ప్రదేశాల వ్యక్తులతో సాధారణంగా మనం అసహనం తో ప్రవర్తిస్తాము. మన చుట్టూ కల సమాజాన్ని అర్ధం చేసికోనలేము. వాళ్ళతో సరిగా వ్యవహరించక పోవటం మన తప్పు అని గ్రహించండి. మీరు వారి ప్రదేశంలో వున్నారనేది గుర్తుంచుకోవాలి. అసహనం సహకరించదు.

మీరు కనక ఎల్లపుడూ ప్రయాణాలు చేస్తూ, ఏవైనా కొన్ని పై రకమైన తప్పులు చేసిన వారైతే, మీ అనుభవాలను మాతో పంచుకోండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+