సాహస క్రీడల సమగ్ర సమ్మేళనం.. దండేలి పర్యాటకం!
చుట్టూ దట్టమైన అడవులు.. ఎగసిపడే జలధారలతో నిండిన జలపాతాలు.. పుష్కలంగా వన్యప్రాణులతో నిండిన నిర్మలమైన నదీ పరీవాహక ప్రదేశాలు.. అలాంటి పర్యాటక సాహస నేల ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలి. ఇక్కడ వేసే ప్రతి అడుగులోనూ ప్రకృతితో మాట్లాడవచ్చు.. ప్రకృతిని పలకరించవచ్చు.. మొత్తంగా ప్రకృతిలో మమేకమవ్వొచ్చు.
అందుకే తదుపరి వారాంతపు విహారయాత్రలో హృదయాన్ని తాకే దండేలిని మీ పర్యాటక జాబితాలో తప్పకుండా చేర్చాల్సిందే. రాబోయే సీజన్ ఈ ప్రాంత పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం.. అక్కడి ప్రకృతి అందాల మధ్య దాగిన కొన్ని సాహసాలను ఒక్కొక్కటిగా పలకరిద్దాం రండి.

వైట్ వాటర్ రాఫ్టింగ్
వింధ్య పర్వతాలకు దక్షిణంగా తెల్లటి వాటర్ రాఫ్టింగ్‌కు ఉత్తమమైన ప్రదేశాలలో ఇదీ ఒకటి. ఉధృతంగా ప్రవహించే కాళీ నది కెరటాలపై సాగే ఈ సాహసయాత్రకు ఆసక్తితోపాటు ధైర్యం కూడా అవసరమే. దండేలిలో స్థానిక అడ్వెంచర్ అవుట్‌ఫిట్‌లు సాధారణంగా ఒక్కో వ్యక్తికి దాదాపు 1,400 రూపాయలు చొప్పున తీసుకుంటారు. ఉదయం మరియు మధ్యాహ్నం బృందాలుగా పర్యాటకులను తీసుకువెళతారు. అనుభవం లేనివారికి తగిన తాత్కాలిక తర్ఫీదు ఇస్తారు. నిత్యం నిపుణుల పర్యవేక్షణలో మిమ్మల్ని నది వంపుల గుండా వైల్డ్ రైడ్‌కి తీసుకువెళతారు.
కయాకింగ్
కాళీ నది జలాల గుండా ప్రయాణించడానికి కయాకింగ్ మంచి ఎంపిక. అలా గ్లైడ్ చేస్తున్నప్పుడు అక్కడి అడవుల సుందరమైన దృశ్యాలను దగ్గరగా చూడవచ్చు. అంతేకాదు, రిజర్వాయర్‌లో జలాలు కలిసే ప్రదేశానికి కూడా వెళ్లవచ్చు. ఇక్కడ నుండి, చుట్టుపక్కల ఉన్న ద్వీపాలలో దాగిన పక్షుల కిలకిలారావాలు మనసారా ఆస్వాదించేందుకు ఈ నదిలో కయాకింగ్ ఎంతో సహకరిస్తుంది. నది వెంబడి ఉన్న కొన్ని జలమార్గాలు నావిగేట్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు పర్యవేక్షకుల మాటలను అసరించడం ఉత్తమం!

మౌంటైన్ బైకింగ్
దండేలిలోని అరణ్యాలలో మౌంటెన్ బైకింగ్ జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని అందిస్తుంది. అరుదైన వన్యప్రాణులకు నిలయమైన దండేలి అరణ్యాలలోని కఠినమైన మార్గాలకు కేరాఫ్ ఆడ్రస్‌గా చెప్పొచ్చు. మౌంటెన్ బైకింగ్‌ను ఇష్టపడేవారు ఇక్కడి ఇరుకైన వంపులు తిరిగే మార్గాల్లో బైక్‌పై దూసుకుపోవచ్చు. ఎంతో సాహసంతో కూడుకున్న మౌంటైన్ బైకింగ్ ప్రమాదాలతోపాటు ఎన్నో అనుభవాలను చేరువ చేస్తుంది. ఇది కూడా పర్యవేక్షకుల సహకారంతో చేయడం మంచిది.

ట్రెక్కింగ్
పర్వతాలు, నదులు, గుహలు, అరణ్యాలు మరియు లోయలు కలిసి దండేలిని ట్రెక్కర్‌లను ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఈ సాహసయాత్రలో కొత్తవారైతే, దండేలి వెలుపల ప్రశాంతత నిండి, సున్నపురాయితో గంభీరంగా దర్శనమిచ్చే కవాలా గుహలు అన్వేషించదగినవి. పెడోమీటర్‌పై ట్రెక్కింగ్ లో మైళ్ల దూరాన్ని దాటిన అనుభవం ఉన్నవారికి సైతం కుల్గి-నాగ్జారీ వ్యాలీ మరియు పొటోలి-షిరోలి ట్రెక్‌లు చాలా సవాళ్లను పరిచయం చేస్తాయి. కఠినమైన ఇక్కడి ట్రెక్ జీవితంలో గుర్తుండుపోయే అనుభవాలను అందిస్తుంది.

కాన్యోనింగ్
కాన్యోనింగ్ అనేది హైకింగ్, రాపెల్లింగ్ మరియు క్లైంబింగ్‌లను మిళితం చేసే సాహస క్రీడగా చెప్పుకోవచ్చు. దండేలిలో ప్రవహించే నీటి ప్రవాహాలు సాహశీకుల శరీరాన్ని అమాంతం ముంచెత్తుతాయి. అలాంటి ప్రవాహంలో ఇలా అన్ని నైపుణ్యాలూ మిలితమయ్యే కాన్యోనింగ్ లాంటి సాహస క్రీడ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి పూర్తిస్థాయిలో అనుభవం అవసరమనే విషయాన్ని గ్రహించాలి. దండేలీ సాహస క్రీడలకు బయలుదేరితే మాత్రం వర్షం లేని సమయాన్ని ఎంపిక చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.



Click it and Unblock the Notifications













