Search
  • Follow NativePlanet
Share
» » దక్షిణ భారత దేశంలో తెప్పల విహారం !

దక్షిణ భారత దేశంలో తెప్పల విహారం !

తెప్పల పై విహారం సాహసంతో కూడిన అత్యధిక ఆనందాన్ని ఇచ్చే క్రీడగా వుంటుంది. దక్షిణ భారత దేశంలో నేడు ఈ తెప్పల విహారం ఒక ప్రసిద్ధి చెందిన సాహస క్రీడ అయినప్పటికీ, ఇది పురాతన కాలం నాటి ఒక ప్రయాణ సాధనం. నీటిపై సాహస క్రీడలకు ఆసక్తి కల పర్యాటకులకు ఈ తెప్పల విహారం ఆనందానిస్తుంది. ఇది ఒక విహారమే కాక, ఒక రవాణా సాధనంగా కూడా వుంటుంది. ఈ తెప్ప విహారం కావేరి మరియు తుంగభద్రా నదులలో అధికంగా కనపడుతుంది. తెప్ప అంటే, వెదురు బద్దలతో తయారు చేయబడిన ఒక చిన్న బోట గా అంచులు కొంత వరకు మూయబడి వుంటుంది. నీరు లోనికి రాకుండా, జంతువుల చర్మం లేదా ప్లాస్టిక్ షీట్ వంటివి కింద వేస్తారు. తెప్పను నదులలో చేపలు పట్టేందుకు కూడా వాడతారు.

హోగె నక్కల్ జలపాతాలు
ఎంతో ఆనందకరమైన ఈ తెప్ప విహారం తమిళ్ నాడు లోని హోగె నక్కల్ లో బాగా కనపడుతుంది. పురాతనమైన ఈ బోట్లు జలపాతాల నీటిలో వేగంగా ప్రయాణిస్తాయి.

ఈ ప్రయాణం కొద్దిపాటి భయం కలిగించి నప్పటికీ, సాహస వంతులకు ఆనందాన్ని ఇస్తుంది. హోగె నక్కల్ లోని ఆనందకరమైన ఈ తెప్ప సాహస క్రీడ వర్షాకాలంలో మరింత ఆనందాన్ని ఇస్తుంది.

తుంగభద్ర నది
దక్షిణాదిన మీరు కర్నాటకలోని హంపి పట్టణం సందర్శించినపుడు, అక్కడ కల తుంగభద్ర నది లో కూడా ఈ తెప్ప ప్రయాణం చేయవచ్చు. తెప్ప నదిలో ప్రయాణిస్తుంటే , మీరు హంపి శిధిలాలను చూడవచ్చు. అలల తాకిడి ఎక్కువగా వున్న చోట ఈ తెప్ప ప్రయాణం మరింత ఆనందం కలిగిస్తుంది. ఈ ప్రయాణంలోనే మీరు అక్కడ మరి కొన్ని ప్రదేశాలు, హోటళ్ళు, రెస్టరెంట్లు చూడవచ్చు.

కావేరి నది
కావేరి నదిలో తెప్ప ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. కావేరి నది, కర్నాటక లోని కొడగు వద్ద పుట్టి, తమిళ నాడు రాష్ట్రం గుండా ప్రయాణించి చివరకు బంగాళా ఖాతంలో కలుస్తుంది. ఈ ప్రయాణంలో మీరు ఎన్నో అడవులను, పరిసరాలను చూస్తూ ఆనందించవచ్చు. ఈ ప్రాంతం లోని ప్రజలు, ప్రయాణీకులకు చవక ధరల ఈ తెప్ప ప్రయాణాల వలన వారి జీవనం సాగిస్తారు.

 దక్షిణ భారత దేశంలో తెప్పల విహారం !

భీమేశ్వరి
భీమేశ్వరి ప్రదేశం చేపలు పట్టేందుకు స్వర్గం గా ప్రసిద్ధి అయినప్పటికీ, తెప్ప విహారాలకు కూడా అనుకూలమే. అయితే ఈ ప్రాంతం లో మొసళ్ళు కూడా వుంటాయి. జాగ్రత్త పడాలి. ప్రయాణంలో తీర ప్రాంతం లో కల పచ్చటి చెట్లు ఆనందం కలిగిస్తాయి. ప్రకృతి అందాలు అద్భుతంగా వుంటాయి. సాహస నీటి క్రీడా కారులు ఈ ప్రయాణాన్ని బాగా ఆనందించ గలరు.

కాబిని నది
కాబిని నదిలో తెప్ప విహారం ఎంతో ఉత్సాహంగాను, ఆనందంగాను వుంటుంది. కాబిని ని కపిల అని కూడా అంటారు. ఈ నది, వయనాడ్ లో పుట్టి, కర్నాటక లోని కావేరి నదిలో కలుస్తుంది. ఈ నదిలో తెప్పలు తీరం ఒడ్డున ప్రయాణిస్తాయి కనుక మీరు బాగా ఆనందించవచ్చు. దక్షిణ ఇండియా పర్యటనలలో కల ఈ తెప్ప విహార క్రీడను ఒక ప్రత్యేకత కలిగినదిగా భావించవచ్చు.

హోన్నేమర్డు

కర్నాటక లోని హోన్నేమర్డు తెప్ప ప్రయాణం ఎంతో ఆసక్తిగా వుంటుంది. ఈ ప్రయాణం శరావతి యొక్క బ్యాక్ వాటర్స్ లో చేయబడుతుంది. ఇక్కడ కయాకింగ్, బోటింగ్ లు కూడా చేయవచ్చు. ప్రతి ఒక తెప్పలో గరిష్టంగా నలుగురు మాత్రమే కూర్చోనవచ్చు. ఈ ప్రాంతంలో మీరు తెప్పను స్వయంగా నడపటం ఎలా అనేది కూడా నేర్చుకొనవచ్చు. అది మీకు ఒక కొత్త అనుభవం కూడా కాగలదు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+