Search
  • Follow NativePlanet
Share
» »హుస్సేన్‌ సాగర్‌ అలలపై దేశంలోనే అతిపెద్ద రికార్డ్‌-బ్రేకింగ్‌ వాటర్‌ ఫౌంటేయిన్‌

హుస్సేన్‌ సాగర్‌ అలలపై దేశంలోనే అతిపెద్ద రికార్డ్‌-బ్రేకింగ్‌ వాటర్‌ ఫౌంటేయిన్‌

భాగ్య‌న‌గ‌రంలోని హుస్సేన్‌ సాగర్‌ అలలపై దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. (ఈ రోజు మార్చి 12) సాయంత్రం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఈ షోను ప్రారంభించారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన 'కోహినూర్' వజ్రం గురించిన కథను ప‌ర్యాట‌కుల‌కు చూపించ‌నున్నారు.

కథను రాజ్యసభ ఎంపీ, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ పర్యవేక్షణలో రచయిత ఎస్‌.ఎస్‌.కంచి, నేపథ్య గాయని సునీత గాత్రాన్ని, వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతాన్ని అందించారు. భాగ్య‌న‌గ‌రంలో పర్యాటకానికి సంబంధించిన మరో స‌రికొత్త ఆక‌ర్ష‌ణ‌గా ఈ ప్రాజెక్టు నిల‌వ‌నుందడంలో సందేహ‌మే లేదు.

waterfountainonhussainsagarwaves

మ‌ర్చిపోలేని ఆడియో ఎక్స్‌పీరియన్స్

కోహినూర్ కథతో దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ షోను డిజైన్ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, దేశ స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను ప్ర‌ద‌ర్శించారు. ఈసంగ్రామ ఘ‌ట్టాలను హుస్సేన్‌ సాగర్ అలలపై అందమైన లైటింగ్ ప్రొజెక్షన్ ద్వారా పర్యాటకులను ఆకట్టుకునేలా వివ‌రిస్తున్నారు.

దీంతోపాటు 5.1 డాల్బీ స్టయిల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ద్వారా ఆడియో ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా స్పష్టమైన అనుభూతుని అందిస్తోంది. ఈ షో పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంద‌నే చెప్పాలి. స్టోరీ టెల్లింగ్ విషయంలో, చారిత్రక ఘట్టాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వ‌డంతోపాటు సాంకేతిక సృజనాత్మకతకు పెద్దపీట వేశార‌నే చెప్పాలి. దీంతో పాటుగా ఈ లేజర్ షోకు వచ్చే పర్యాటకులు 800 నుంచి 1000 మంది కూర్చునేలా సంజీవయ్య పార్కులో సీటింగ్‌తోపాటు అన్ని వసతులతో కూడిన గ్యాలరీని ఏర్పాటుచేశారు.

waterfountainonhussainsagarwaves

రికార్డ్‌-బ్రేకింగ్‌ వాటర్‌ ఫౌంటేయిన్‌

మొత్తంగా రొబోటిక్ నాజిల్స్ అండ్ లైటింగ్‌ను ఇక్క‌డ చూడ‌వ‌చ్చు. సాగ‌ర్‌లో వెయ్యికి పైగా రొబోటిక్ నాజిల్స్, DMX ప్రొటోకాల్‌తో అడ్వాన్స్‌డ్ అండర్ వాటర్ లైటింగ్ సిస్టమ్స్ ద్వారా అద్భుతమైన రంగు రంగుల లైట్లు చూప‌రుల‌ను ఎంత‌గానో ఆకర్షిస్తాయి. లేజర్ టెక్నాలజీ ఇక్క‌డ హైలేట్‌గా చెప్పొచ్చు. ఈ ఆకర్షణీయమైన లేజర్ రంగుల కోసం మొత్తం మూడు 40W RGB లేజర్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే, సంద‌ర్శ‌కుల గ్యాలరీ, రూఫ్ టాప్ రెస్టారెంట్ కూడా ఉంది. 800 నుంచి 1000 మంది కూర్చునేలా సీటింగ్ గ్యాలరీ, సంజీవయ్య పార్క్, మల్టీ మీడియా షోను పనోరమిక్ వ్యూ కోసం ఈ రూఫ్ టాప్ రెస్టారెంట్‌ను అందించారు.

అలాగే, 260 అడుగుల ఎత్తు, 540/130 డైమెన్షన్‌తో దేశంలోనే అతిపెద్ద, అతి ఎత్తయిన రికార్డ్‌-బ్రేకింగ్‌ వాటర్‌ ఫౌంటేయిన్‌ను అందిస్తున్నారు. హెచ్‌డీ ప్రొజెక్షన్ సెంట్ర ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిల‌వ‌నుంది. ఒక్కొక్కటి 34 వేల ల్యుమెన్స్ సామర్థ్యం గల 3 హెచ్‌డీ ప్రొజెక్టర్ల ద్వారా వాటర్ స్క్రీన్ పై స్పష్టమైన, ఆకర్షణీయమైన ప్రొజెక్షన్ ఉండేలా తీర్చిదిద్దారు. బీమ్ మూవీంగ్ హెడ్‌లైట్స్ ద్వారా విజువల్ ఎఫెక్ట్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా చూపరుల మ‌న‌సుదోచేలా ఉంది. మొత్తానికి కుటుంబ‌స‌మేతంగా భాగ్య‌న‌గ‌రంలో విహ‌రించేందుకు ఇదో అద్భుత ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

More News

    Read more about: bhagyanagaram telangana
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+