Search
  • Follow NativePlanet
Share
» »దండేలి : సాహస క్రీడల కన్నుల విందు !

దండేలి : సాహస క్రీడల కన్నుల విందు !

By Mohammad

దండేలి ఉత్తర కన్నడ జిల్లాలోని ఒక గ్రామం. దీని చుట్టూ దట్టమైన అడవులు, పశ్చిమ కనుమలు, నదులు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి ఇదొక ముఖ్య పర్యాటక ప్రదేశంగా చెప్పవచ్చు. అప్పట్లో మైసూర్ మహారాజులకు దండేలి వేట విడిది గా ఉండేదట. అరుదైన జంతుజాలాలతో, దట్టమైన పచ్చని ప్రకృతి అందాలతో ఈ ప్రదేశం పర్యాటకులను కనువిందు చేస్తుంది.

దండేలి దండకారణ్యంలో ఉన్నది కనుక దండేలి అన్న పేరొచ్చిందని, కాదు .. కాదు దండనాయక అన్న రాజు ఇక్కడి అందాలకు మోహితుడై దీనికి దండయారణ్యం అని, ఊరికి దండేలి అని పేరు పెట్టారని చెబుతారు.

ఇది కూడా చదవండి : కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన వన్య జంతు అభయారణ్యాలు !

దండేలి లో వన్య ప్రాణుల అభయారణ్యం ప్రసిద్ధి చెందినది. ఇది కర్ణాటకలో రెండవ పెద్ద వన్య ప్రాణుల అభయారణ్యం. 2007 లో టైగర్ రిజర్వ్ జోన్ గా ప్రకటించబడింది. ఈ అభయారణ్యం చుట్టూ కావేరి నది ప్రవాహాలు, కాళీ నది మరియు దాని ఉపనదులు ప్రవహిస్తుంటాయి. దండేలి గోవాకు 125 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుండి 480 కిలోమీటర్ల దూరంలో కలదు.

దండేలి వన్య ప్రాణుల అభయారణ్యం

దండేలి వన్య ప్రాణుల అభయారణ్యం

దండేలి వన్య ప్రాణుల అభయారణ్యం చేరిన తర్వాత పర్యాటకులు అక్కడి దృశ్యాలను, రివర్ వ్యాలీ లను, కొండ చరియలు చూడవచ్చు. వాటిని దాటుకుంటూ అలానే ముందుకు వెళితే వివిధ రకాల వన్య జంతువులను, పక్షులను మరియు జలచరాలు గమనించవచ్చు.

చిత్ర కృప : Alosh Bennett

దండేలి వన్య ప్రాణుల అభయారణ్యం

దండేలి వన్య ప్రాణుల అభయారణ్యం

200 రకాల పక్షులకు, 300 కు పైగా జంతువు జాతులకు ఈ అభయారణ్యం నిలయంగా ఉన్నది. పులి, జింకలు, గుంట నక్కలు, ఏనుగులు, దుప్పులు మొదలైన వాటితో పాటు అరుదైన పక్షులను చూడవచ్చు. పర్యాటకులు టాప్ లెస్ జీప్ లో ప్రయాణించి గైడ్ ద్వారా వాటి వివరాలను అడిగి తెలుసుకోవచ్చు.

చిత్ర కృప : Abhayaranya Dandeli

కాళీ నది

కాళీ నది

కాళీ నది లో పర్యాటకులు బోటింగ్, పడవ ప్రయాణం చేయవచ్చు. ఇక్కడ అనేక పక్షులు కనిపిస్తుంటాయి. చెకుముకి పిట్టలు, మైనా, కోకిల, చిలుక ఇలా ఎన్నో గమనించవచ్చు. నది పై గల వంతెన నుండి పర్యాటకులు సదాశివ ఘడ్ ఫోర్ట్ ను చూడవచ్చు. రాప్టింగ్ పై ఆసక్తి గలవారికి ఈ నది సూచించదగినది.

చిత్ర కృప : Hemakumar Madabathula

కుల్గి నేచర్ క్యాంప్

కుల్గి నేచర్ క్యాంప్

కుల్గి నేచర్ క్యాంప్ దండేలి బస్ స్టాండ్ కు 12 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడి నుండి దండేలి వన్య ప్రాణుల అభయారణ్యం కొద్ది దూరంలో ఉంటుంది. నేచర్ క్యాంపు లో వసతి కై గుడారాలు ఉంటాయి. ఒక్కో గుడారానికి ఒక్కో పక్షి పేరు పెట్టారు. వసతి కై దండేలి వైల్డ్ లైఫ్ ను సంప్రదించండి.

రిసార్ట్ లు : కాళీ అడ్వెంచర్ రిసార్ట్, బిసన్ రివర్ రిసార్ట్, దండేలి జుంగల్ క్యాంపు, ఓం ఫారెస్ట్ క్యాంపు

చిత్ర కృప : sanjesh_ananda

శిరోలి పీక్

శిరోలి పీక్

శిరోలి పీక్ దండేలి నుండి 25 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇది వన్య ప్రాణుల అభయారణ్యం పరిధిలోకే వస్తుంది. శిరోలి శిఖరాన్ని చేరిన పర్యాటకులు అక్కడి నుండి సహ్యాద్రి పర్వతాలను చూడవచ్చు.

చిత్ర కృప : UrbanWanderer

శిరోలి పీక్

శిరోలి పీక్

శిరోలి పీక్ ఉత్తర కన్నడ ప్రాంతంలో ఉన్నత శిఖరం కావటంవలన ట్రెక్కర్లు బాగా ఇష్టపడతారు . ఈ శిఖరం నుండి సూర్యాస్తమయం చూసి ఆనందిస్తారు. దండేలి వైల్డ్ లైఫ్ శాంక్చువరీ మరియు పడమటి కనుమలు కూడా కనపడతాయి. పర్యాటకులు అటవీ శాఖ అనుమతులతో ఈ ప్రాంతం ప్రవేశించవచ్చు.

చిత్ర కృప : toufeeq hussain

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

దండేలి ప్రదేశం కేవలం ప్రకృతి అందాలకే పరిమితం అనుకుంటే పొరబడినట్లే! ఇక్కడ ఉల్లవి దేవాలయం, సైక్స్ పాయింట్, సూపర్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్, కవనా గుహలు మరియు సింధేరి రాక్స్ వంటివి ఉన్నాయి.

చిత్ర కృప : Sarpa_Fotografy

దండేలి ఎలా చేరుకోవాలి ?

దండేలి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : దండేలి కి సమీపాన గోవా లోని డబోలిం అంతర్జాతీయ విమానాశ్రయం, బెల్గాం విమానాశ్రయం కలవు. ఇక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో దండేలి చేరుకోవచ్చు.

రైలు మార్గం : రైలు లో వెళ్లాలంటే ముంబై లేదా బెంగళూరు నుండి ప్రయాణించి లోండా కు చేరి, అక్కడి నుండి రోడ్డు మార్గాన దండేలి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం : బెంగళూరు, గోవా, కార్వార్, ముంబై, బెల్గామ్, హుబ్లీ ప్రాంతాల నుండి అనేక బస్సులు దండేలి కి కలవు.

చిత్ర కృప : kerala kerala Holidays

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+