Search
  • Follow NativePlanet
Share
» » వారణాసి నగరంలో దేవ దీపావళి వెలుగులు !

వారణాసి నగరంలో దేవ దీపావళి వెలుగులు !

వారణాసి నగరం భారతదేశం లో ఒక అద్భుత ప్రాఛీన ఆధ్యాత్మిక ప్రదేశం. పూర్వకాలంలో ఈ పట్టణాన్ని బెనారస్ లేదా కాశి అని పిలిచేవారు. ఎన్నో టెంపుల్స్, ఘాట్స్, మందిరాలు, నిరంతరం ప్రవహించే గంగా నది, లతో వారణాసి ఇండియాలోని ఇతర నగరాల కంటే కూడా ప్రసిద్ధి పొంది ప్రతి ఒక్కరకూ తెలిసిన నగరంగా పేరు పడింది. ఈ కారణంగానే విదేశీ పర్యాటకత కూడా ఇక్కడ అభివృద్ధి చెందినది.

దేవ దీపావళి అనేది దేవతలు కార్తిక పౌర్ణిమ లేదా కార్తిక మాసం లో వచ్చే పౌర్ణమి నాడు ఆచరించే దీపావళి పండుగ. పవిత్రమైన ఈ వారణాసి నగరంలో దీపావళి ఉత్సవాలు మాత గంగా నది, మరియు కాశి విశ్వనాథుడి కి ప్రార్ధనలుగా చేయబడతాయి. దేవ దీపావళి ని గంగ మహోత్సవం చివరి రోజున నిర్వహిస్తారు. సుమారు పది లక్షల మట్టి ప్రమిదలు ఒత్తులతో వెలిగించి గంగా నది ఒడ్డున నీటిలో వదులుతారు.

ఈ సమయంలో సాయంత్రపు గంగా హారతి రోజూ కంటే కూడా అతి వైభవంగా జరుగుతుంది. వారణాసి గురించి ఎవరికి ఎన్ని అపోహలు ఉన్నప్పటికీ ఈ పూజలలో పాల్గొంటే చాలు అవి తొలగి పోతాయి. వారు వారణాసి మహిమను తప్పక నమ్ముతారు. ఈ సమయంలో ఇక్కడ 84 ఘాట్ లలో జరిగే పూజలు, వేడుకలు మంత్రాల ప్రభావం మిమ్ములను మంత్రముగ్ధులను గావించి ఆనందింప చేస్తాయి.

 వారణాసి నగరంలో దేవ దీపావళి వెలుగులు !
వారణాసి దేవ దీపావళి !

వారణాసి దేవ దీపావళి !

దేవ దీపావళి ఉత్సవ నిర్వహణ ఉత్తర ప్రదేశ్ టూరిజం శాఖ నిర్వహిస్తుంది. అనేక కష్ట నష్టాలకు ఓర్చి అందరిని ఆనందింప చేస్తుంది. ఈ ఉత్సవాలకు టూరిస్ట్ లు ప్రపంచ నలుమూలల నుండి వస్తారు. వీరందరకూ వసతులు, ఇతర సౌకర్యాలు ఒక కమిటీ నిర్వహిస్తుంది.

వారణాసి దేవ దీపావళి !

వారణాసి దేవ దీపావళి !

లక్షల కొలది దీపాలతో వెలిగే ఘాట్ లు చూసేవారికి కన్నుల పండువగా వుంటాయి. వారణాసి చరిత్రలో ఈ ప్రమిదల దీపాలు నదిలో వదలటం ఇటీవలి కాలంలో మొదలైనప్పటికి, ప్రతి సంవత్సరం వీటి సంఖ్య పెరిగి భక్తులలో మరింత ఆనందాన్ని నింపుతోంది. భక్తులు గంగా మాతను తలచుకొని వారి వారి కోరికలు తీర్చమంటూ ఈ దీపాలను నదిలోకి జారవిడుస్తారు.

వారణాసి దేవ దీపావళి !

వారణాసి దేవ దీపావళి !

ఈ ఉత్సవాల నిర్వహణ లో గంగకు ఇచ్చే హారతి కార్యక్రమాలు ఎంతో వైభవోపేతంగా వుంటాయి. వారణాసిలో ఇవి ప్రధాన ఘట్టాలు. ఈ రకమైన గంగా హారతి పండుగ అయిదు రోజులూ అట్టహాసంగానే జరుగుతుంది.

వారణాసి దేవ దీపావళి !

వారణాసి దేవ దీపావళి !

దశాశ్వమేద ఘాట్ లో గంగా హారతి ఉత్సవం జరుగుతూండగా, పోలీస్ సిబ్బంది మరియు సైనికా అధికారులు, అమర్ జవాన్ జ్యోతి వద్ద మృత వీరుల సమాధిలకు పూల దండలు వేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తారు. దేశం కొరకు ప్రాణాలు అర్పించిన వారికి సైనిక వందనాలు చేసి శ్రావ్య సంగీతాలతో మరణించిన వారిపై భక్తి శ్రద్ధలు చాటుతారు.

వారణాసి దేవ దీపావళి !

వారణాసి దేవ దీపావళి !

కర్పూర హారతులు, అగర వత్తులు, దీపాలు, మొదలైన వాటి తో నిర్వహించే మంత్ర సమేత ప్రార్ర్ధనలు అక్కడ కల 84 ఘాట్ లలో ప్రతిధ్వనిస్తాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరిలో కలిగే భావా వేశం వర్ణించ నలవి కాదు.

వారణాసి దేవ దీపావళి !

వారణాసి దేవ దీపావళి !

కార్తిక పౌర్ణమి నాడు అంటే, దేవా దీపావళి రోజున గంగా నది స్నానం జీవిత కాలంలో చేసిన పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు. తాము పవిత్రులమైనామని భావిస్తారు. ఇదే విస్వాశం తో హైందవులు కార్తీక పౌర్ణమి స్నానాలను ఇతర నదులలోను, సమీప సముద్రాల లోను కూడా చేస్తారు.

వారణాసి దేవ దీపావళి !

వారణాసి దేవ దీపావళి !

దేవ దీపావళి పండుగ సమయంలో భారత దేశ సంస్కృతి ప్రతిబింబించే విధంగా భారతీయ సంస్కృతి కి తగినట్లు అనేక కళలను ప్రదర్శిస్తారు. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాంప్రదాయ నృత్యాలు, గీతాలు, భజనలు చేస్తారు. వీటిలో ఎంతోమంది ప్రసిద్ధ కళాకారులు పాల్గొంటారు.

వారణాసి దేవ దీపావళి !

వారణాసి దేవ దీపావళి !

భారత దేశంలోని ప్రతి వేడుక ఒకే విధంగా కనపడి నప్పటికీ, విభిన్నంగా వుంటాయి. ప్రతి పండుగ దానికి సంబంధించిన అంశాలతో, ఆచారాలతో వైవిధ్యత చూపుతుంది. అయితే, ప్రతి పండుగకూ, సంగీతం, దీపపు వెలుగులు, వివిధ రకాల రంగులు అన్ని పండుగలకూ హై లైట్ గా వుంటాయి. కార్తీక పౌర్ణమి రోజున జరిగే దేవా దీపావళి కూడా ఈ పండుగల వంటిదే, కాని విభిన్నమైనది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+