డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తుల కోలహాలం అంతా ఇంతా కాదు. కలియుగ దైవంగా పేరు పొందిన కేరళలోని శబరిమల దర్శనార్థం సంవత్సరం పొడవునా భక్తులు వేచి చూస్తుంటారు. ఆ సమయం రానే వచ్చింది. అయితే, ఈ ఏడాది భక్తుల తాకిడి ఎక్కువవడంతో దర్శన సమయంలో పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. దానిని అధిగమిస్తూ శబరిమల విశిష్టతతో పాటు అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్తున్నభక్తులు ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి.
శబరిమల స్వామి అయ్యప్ప ఆలయంలో వార్షిక మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర నవంబర్ 16న ప్రారంభమైంది, డిసెంబర్ 27న మండల పూజ రోజు వరకు ఈ పూజలు నిర్వహించబడతాయి. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆలయం మూసివేయబడుతుంది, డిసెంబర్ 30న మకరవిళక్కు ఉత్సవం కోసం తిరిగి తెరవబడుతుంది. జనవరి 15న మకరవిళక్కు జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇప్పడు ఇక్కడ భక్తుల రద్దీ పెరుగుతుంది. ఈ రద్దీ కారణంగా రోజుకి మూడు గంటలకు పైగా వాహనాలు చాలా చోట్ల, కొన్ని అటవీ ప్రాంతాల్లో నిలిచిపోయాయి.

గతేడాది పోలిస్తే ఈ ఏడాది ఏర్పాట్లు బాగా తగ్గాయి...
నిలక్కల్ వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని పెంచాలని దేవస్వం బోర్డు (టీడీబీ), పతనంతిట్ట కలెక్టర్‌ను గతంలోనే ఆదేశించడం జరిగింది. 10 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని దేవస్వం బోర్డు ప్రెసిడెంట్ తెలిపారు. అయినా ఇక్కడ అంత పార్కింగ్ స్థలం లేదు. గత ఏడాది పోలీస్తే అంతకంటే దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది 7 వేల వాహనాలను పార్కింగ్ చేసుకునే అవకాశం ఉండగా ప్రస్తుతం 6 వేలకు తగ్గింది. అన్నం, నీళ్లు లేక అయ్యప్ప భక్తులు నాలుగు గంటలకు పైగా అటవీ మార్గంలో పడిగాపులు కాసిన పరిస్థితి దాపురించింది. 2019 హైకోర్టు ఆదేశాల ప్రకారం పంపాలో వాహనాల పార్కింగ్‌ను నిషేధించారు.
ఇది 2018 వరదల తర్వాత చక్కపాళం, త్రివేణి, హిల్‌టాప్‌లో పార్కింగ్ చేసేందుకు వీలుగా ఉన్న 5 వేల వాహనాలను నిలక్కల్‌కు తరలించారు. సన్నిధానం, నిలక్కల్, పంపా వద్ద జనాలను సరిగ్గా సమన్వయం చేయడంలో పోలీసులు విఫలమయ్యారని టీడీబీ ఫిర్యాదులు చేసింది. పతినెట్టం బడిలో గతంలో అనుభవం, నైపుణ్యం ఉన్న పోలీసులను నియమించాలన్నది బోర్డు వాదన.
ఈ శని, ఆదివారాల్లో సన్నిధానంలో ఎన్నడూ లేని విధంగా రద్దీ నెలకొంది. పలువురు బారికేడ్లను దాటుకుని ఇతర మార్గాల ద్వారా ఆలయం లోపలికి ప్రవేశించారు. గతంలో నిమిషానికి 70 మంది భక్తులు పతినెట్టం బడి ఎక్కుతుండగా, ఇప్పుడు 50 మంది మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. అంటే ఇక్కడ రద్దీ ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సిందే.

తొక్కిసలాటలో చనిపోయిన బాలిక...
ఆలయంలోని రద్దీని నిర్వహించేందుకు వర్చువల్ క్యూ బుకింగ్‌ల గరిష్ట పరిమితి 90,000 నుండి 80,000కి తగ్గించబడింది. సన్నిధానం వద్ద క్యూ శబరిపీఠం వరకు విస్తరించి ఉంది. భక్తుల రద్దీ కారణంగా పంబా వద్ద భక్తులపై పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. దాని కారణంగా యాత్రికుల వాహనాలు కూడా ఎరుమేలి, పంబా, నిలక్కల్, మరియు ఎలావుంకల్ వంటి ప్రదేశాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. ఈ ప్రాంతాలలో వాహనాలు చాలా వరకూ క్యూలో నిలిచాయి. కొందరు భక్తులు 18 గంటల వరకు నిలిచి, చివరకు సహనం కోల్పోయారు. విసుగు చెంది, కొంతమంది వ్యక్తులు క్యూ లైన్లను ఉల్లంఘించడం జరిగింది.
బారికేడ్‌ల మీదుగా దూకి, పాతినెట్టం పాడికి చేరుకున్నారు. అక్కడ కలిగిన రద్దీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పదకొండేళ్ల బాలిక మృతి చెందింది. క్యూ లైన్‌లో నిల్చుని దర్శనం కోసం వేచి చూస్తున్న 11 ఏండ్ల బాలిక స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను పంపా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ బాలిక శనివారం మరణించింది. ఆ బాలిక తమిళనాడులోని సేలంకు చెందిన యువతిగా గుర్తించారు.



Click it and Unblock the Notifications












