Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలో ఉన్న మిస్టరీ దేవాలయాల గురించి మీకు తెలుసా?

భారతదేశంలో ఉన్న మిస్టరీ దేవాలయాల గురించి మీకు తెలుసా?

ఆయా కాలంలో పాలించిన రాజులకు కూడా ఈ టెంపుల్స్ ని ఒక ఉత్తమ నిర్మాణాలుగా తీర్చిదిద్దేవారు.దానితో పాటు తమ గొప్పతనం చాటుకొనేవారు. ఇండియాలో పురాతనమైన టెంపుల్స్ అంటే 2000 నాటి చరిత్రలు కలవి.

By Venkata Karunasri Nalluru

ప్రాచీన కాలం నుంచి మన హిందుమతం తన భక్తులకు ఈ రకమైన ఎన్నో టెంపుల్స్ ను అందిస్తోంది. ఆయా కాలంలో పాలించిన రాజులకు కూడా ఈ టెంపుల్స్ ని ఒక ఉత్తమ నిర్మాణాలుగా తీర్చిదిద్దేవారు.దానితో పాటు తమ గొప్పతనం చాటుకొనేవారు. ఇండియాలో పురాతనమైన టెంపుల్స్ అంటే 2000 నాటి చరిత్రలు కలవి వాటి ప్రత్యేకతలతో ఎన్నో వున్నాయి.ప్రతి ఒక్క దానికి దాని విశిష్టత దానిదిగా చెప్తారు.

భారతదేశంలో ఉన్న మిస్టరీ దేవాలయాలు

1.వారణాశి

1.వారణాశి

మిస్టరీ టెంపుల్స్ వారణాశిలోని సింధియా ఘాట్ కు సమీపంలో లీనిన్ టవర్ ఆఫ్ పైజా వలె ఒక వైపుకు వాలిపోయిన ఒక టెంపుల్ వుంది.ఈ టెంపుల్ కూడా దూరం నుంచే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.ఈ టెంపుల్ వాస్తవంగా 1830 లో నిర్మించినప్పటికీ అక్కడి ఘాట్ కారణంగా నదిలో మునిగిందని చెప్తారు.నేడు ఈ శివా టెంపుల్ ను మూసేశారు.ఎలా మునిగింది?ఎందుకు మునిగింది?ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

pc:youtube

2. ఒకే ఒక్క బ్రహ్మదేవాలయం

2. ఒకే ఒక్క బ్రహ్మదేవాలయం

ఇది ఒక గొప్ప ఆశక్తి గల టెంపుల్. బ్రహ్మదేవునికి గల ఒకే ఒక్క దేవాలయం పుష్కర్ లో వుంది. ఈ టెంపుల్ ను 14వ శతాబ్దంలో నిర్మించారు.దీనిలో నాలుగు తలల బ్రహ్మదేవుని విగ్రహం వుంటుంది.ఈ టెంపుల్ నిర్మాణం వెనుక ఆశక్తికరమైన కథ ఒకటి వుంది.

pc:youtube

3. చైనీయుల కాళీ టెంపుల్

3. చైనీయుల కాళీ టెంపుల్

కలకత్తాలో చైనా టవున్ అనే పేరుతో తామ్గ్రాలో ఒక చిన్న టవున్ వుంది. ఈ ప్రదేశంలో వుండేవారు చైనా రావటంతో ఈ ప్రదేశానికి చైనా టవున్ అనే పేరొచ్చింది.చైనీయులు ఈ గుడికి వచ్చి నూడుల్స్, చాప్స్ వంటివి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు.ఈ చైనీయులందరూ కాళీ మాత భక్తులు.

pc:youtube

4. అదృశ్యంలో టెంపుల్

4. అదృశ్యంలో టెంపుల్

ఒక టెంపుల్ అదృశ్యం అవటం మళ్ళా కొంతకాలం తర్వాత తిరిగి రావటం వంటివి నమ్ముతారా?నమ్మాలి.వడోదరాకు 40 మైళ్ళ దూరంలో స్తంభేశ్వర్ మహదేవ్ టెంపుల్ వుంది. ఈ టెంపుల్ అరేబియా మహాసముద్రంలో వుంటుంది.అలలు తక్కువగా వుండే సమయంలో దీనిని చూడగలం. అంటే అది సముద్రంలో మునిగుంటుందన్నమాట.అలలు ఎత్తులో వుంటే ఇంకా టెంపుల్ చూట్టం కష్టమే.ఎందుకంటే అది కనపడదుగా.

pc:youtube

5.బులెట్ దేవుడు

5.బులెట్ దేవుడు

రాజస్థాన్ లోని జోద్పూర్ లో బులెట్ బాబా లేదా ఓం గున్నా అనే గుడి వుంది. ఇక్కడ గుడిలో రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్ వుంటుంది.దానినే ఇక్కడి వారు ఒక దేవుడిగా పూజిస్తారు.ఈ దేవుడికి లిక్కర్ కూడా నైవేద్యంగా పెడతారు.గ్రామస్థులు తమ దేవుడు తమను రోడ్ యాక్సిడెంట్స్ నుంచి కాపాడతారని ప్రగాఢంగా నమ్ముతారు.

pc:youtube

6. పూజించబడే ఎలుకలు

6. పూజించబడే ఎలుకలు

రాజస్థాన్ కి బికనీర్ కు దక్షిణంగా 30కి.మీ ల దూరంలో తేస్నోక్ అనే ప్రదేశంలో కర్ణి మాత టెంపుల్ వుంది.ఈ ఎలుకలు కర్ణి మాత అవతారంగా అంటే దుర్గామాత అవతారంగాను, ఆమెకు గల నలుగురు పిల్లల అవతారంగాను నమ్ముతారు. టెంపుల్ ఆవరణలో ఎలుకలు స్వేచ్చగా తిరుగుతాయి.వీటికి పాలు,ఇతర ఆహారాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు.

pc:youtube

7. పగోడా ఆకారం దేవాలయం

7. పగోడా ఆకారం దేవాలయం

మనాలీలోని నాలుగంతస్తుల హిడింబా టెంపుల్ ఒక ప్రత్యేక పగోడ ఆకారంలో వుంటుంది.దీని శిలతీరు తెన్నులు ఇతర ఆలయాలతో పోలిస్తే విభిన్నంగా వుంటుంది.ఈ టెంపుల్ లో హిడింబ దేవి అంటే రాక్షసి హిడింబ సోదరి వుంటుంది.ఈ దేవతను ఆనాడు కుళు రాజవంశీయులు కులదేవతగా పూజించేవారు.

pc:youtube

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+