Search
  • Follow NativePlanet
Share
» »కాక‌తీయ జూలాజిక‌ల్ పార్క్‌లోని ద‌త్త‌త స్కీమ్ గురించి మీకు తెలుసా?!

కాక‌తీయ జూలాజిక‌ల్ పార్క్‌లోని ద‌త్త‌త స్కీమ్ గురించి మీకు తెలుసా?!

జంతు ప్రేమికుల‌కు స్వర్గ‌ధామంగా నిలుస్తోన్న వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ జూలాజిక‌ల్ పార్క్ గురించిన ఆస‌క్తిక‌ర‌ విశేషాలు చాలా ఉన్నాయి. ఇక్క‌డి జంతువులు, ప‌క్షుల ఆల‌న పాల‌న చూసుకునేందుకు ఔత్సాహికుల‌కు ద‌త్త‌త స్కీమ్‌ పేరుతో అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. నిజానికి ఈ స్కీమ్ 2016 నుంచే అమ‌లులో ఉన్న‌ప్ప‌టికీ ఇటీవ‌ల కాలంలో మంచి ప్రాచుర్యం పొందుతోంది. వినోదంతోపాటు విజ్ఞానాన్ని పంచుతోన్న కాక‌తీయ జూలాజిక‌ల్ పార్క్ గురించి తెలుసుకుందాం రండి!

తెలంగాణ రాష్ట్రంలోనే రెండ‌వ అదిపెద్ద జూలాజిక‌ల్ పార్క్‌గా నిలుస్తోన్న‌ వరంగల్‌లోని కాకతీయ జూలాజికల్ పార్క్ ప్ర‌కృతి ప్రేమికుల‌తోపాటు జంతు ప్రేమికుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తోంది. సుమారు 92 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్‌లో 440పైగా జంతు, ప‌క్షి జాతులు అనువైన వాతావరణంలో సంద‌డి చేస్తూ ద‌ర్శ‌న‌మిస్తాయి. చిరుతపులి మొద‌లుకుని మొసలి, జంగిల్ క్యాట్, నెమ‌లి, సాంబార్ జింక, మౌస్ డీర్, తెల్ల నెమలి, న‌క్ష‌త్ర తాబేలు, కాకాటిల్స్, క్రిష్ణ జింక, వైట్ రియా పక్షి ఇలా అనేక జంతు, పక్షి జాతులతో అదో అరుదైన అరణ్యాన్ని త‌ల‌పిస్తుంది.

kakatiyazoologicalpark

సంఖ్య పెర‌గాల్సిన అవ‌సముంది..

జంతు ప్రేమికులు ఇక్క‌డి పక్షులు, జంతువుల సంరక్షణతోపాటు నిర్వహణలో పాలుపంచుకోవడానికి అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. సంరక్షణలో భాగస్వాములు కావాలనుకునే వారికి జూ పార్కు పక్షులను, జంతువులను దత్తతగా అందిస్తోంది. ఈ సంరక్షణ, దత్తతను మూడు, ఆరు, సంవత్సరం ఇలా మ‌న వీలును బ‌ట్టీ ప‌లు కేట‌గిరీగా విభ‌జించారు. వీటి సంరక్షణలో భాగంగా ఖరీదైన పౌష్టికాహారం, వైద్యం అందిస్తారు.

ఈ స్కీమ్‌లో భాగ‌స్వాములు అవ్వ‌డం ద్వారా జంతువుల, పక్షుల దత్తతను తీసుకొని వాటి నిర్వహణ, సంరక్షణలో పాలుపంచుకునేందుకు ఇప్ప‌టికే ప‌లు కార్పొరేట్ సంస్థలు, విద్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, జంతు, పక్షు ప్రేమికులను ముందుకొస్తున్నారు. మ‌రింత మంది ముందుకు రావాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. 2016 నుండి ఇప్పటి వరకు 90 మంది వివిధ జంతువులు, పక్షులను దత్తత తీసుకున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మ‌రింత పెర‌గాల్సిన అవ‌సరం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

kakatiyazoologicalpark Warangal

ఎన్ క్లోజర్‌ల ద‌గ్గ‌ర దాత‌ల పేర్లు..

ఇప్ప‌టి వ‌ర‌కూ దత్తత తీసుకొనేవారికి భారం కాకుండా మూడు, ఆరు నెలలు, సంవత్సరం స్కీముల‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు అట‌వీశాఖ అధికారులు వెల్ల‌డించారు. పక్షులు, జంతువుల ఎన్ క్లోజర్‌ల ద‌గ్గ‌ర‌ దత్తత తీసుకున్న వారి పేర్లను బోర్డుల‌పై రాసి ఉంచుతారు. అలాగే, వాటికి అందించే ఫుడ్ మెనూను ఎప్ప‌టిక‌ప్పుడు దాతలకు వివ‌రించ‌డంతోపాటు వాటి యోగ‌క్షేమాల‌ను కూడా ద‌త్త‌త తీసుకున్న‌వారు తెలుసుకునేందుకు వీలుంటుంది. దీంతోపాటు దత్తత స్కీమ్‌లో ఉన్న‌ దాతల కుటుంబాల‌కు ఏడాదిలో రెండు మూడు సార్లు జూను ఉచితంగా చూపించే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు అధికారులు.

అలాగే, దత్తత తీసుకున్న పత్రాలను ఇన్ కమ్ టాక్స్‌లో చూపించుకోవచ్చు. దాతలు వారి వారి కాల పరిమితిని బట్టి జూలాజికల్ పార్క్ వరంగల్ పేరిట చెక్కు లేదా క్యాష్ అకౌంట్లో వేయవచ్చు. దత్తత తీసుకోవాలనుకొనే దాతలు అధికారిక వెబ్‌సైట్‌ www.kakatiyazoo.in ను సందర్శిస్తే పూర్తి వివ‌రాలు అందుబాటులో ఉంటాయి. మ‌రెందుకు ఆల‌స్యం.. ప‌క్షులు, జంతువుల‌పై మీకున్న ప్రేమ‌ను పంచేందుకు మీ వంతుగా ముందుకు రండి!

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+