Search
  • Follow NativePlanet
Share
» »కోల్‌కతా దుర్గా పూజ ఎందుకంత ప్ర‌త్యేక‌మో తెలుసా... ?

కోల్‌కతా దుర్గా పూజ ఎందుకంత ప్ర‌త్యేక‌మో తెలుసా... ?

కోల్‌కతా దుర్గా పూజ ఎందుకంత ప్ర‌త్యేక‌మో తెలుసా... ?

ఏటా జరుపుకునే ఈ ద‌స‌రా పండుగను దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వ‌హించుకున్న‌ప్ప‌టికీ...కోల్‌కతాలో ఈ పండుగ ప్రత్యేక‌తే వేరు. పది రోజుల పాటు జరిగే ఈ పండుగలో దుర్గా మూర్తుల దేవతాలంకరణ అత్యంత అద్భుతంగా ఉంటుంది. గంగా నది నుంచి తెచ్చిన మట్టితో అమ్మవారి ప్రతిమను తయారుచేయ‌డం ఇందులో విశేషం. దేశంలోని చాలా ప్రాంతాలలో దుర్గా మాతా పూజా పండాల తలుపులు తెరవబోతున్నాయి. పండ‌ళ్లు అంటే మంట‌పాలు అని అర్థం. కోల్‌కతాలో దుర్గా మాతా వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మహాలయ మరుసటి రోజు నుండే పూజా పండాల‌లో సందర్శకుల రద్దీ మొద‌ల‌య్యింది. ఇక సాయంత్రం కాగానే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి మహానగరంలోని దుర్గాపూజ పండళ్ల‌ను సంద‌ర్శించేందుకు సిద్ధ‌మ‌వుతారు. కోల్‌కతాలోని ప్రసిద్ధ దుర్గాపూజ పండాల గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా దీనిని చ‌ద‌వాల్సిందే..

shobhabazarrajbari

కదిలే ట్రామ్‌లో దుర్గా పూజ

కోల్‌కతాలో తొలిసారిగా కదులుతున్న ట్రామ్‌లో దుర్గాదేవిని పూజించ‌డం జ‌రుగుతుంది. ఒక భవనం తరహాలో ఉండే ఒక ట్రామ్‌ను అలంక‌రించ‌బ‌డి ఉన్నారు. ఈ ట్రామ్ ధర్మతల్లా ఎస్ప్లానేడ్ ట్రామ్ డిపో నుండి సీల్దా వరకు ప్ర‌యాణిస్తుంది. ఈ ట్రామ్‌లో మ‌నుషులెవ‌రూ ఉండ‌రు. కేవ‌లం దుర్గామాత ప్ర‌తిమే ఉంటుంది. ఈ కదులుతున్న ట్రామ్‌లోనే దుర్గామాత విగ్ర‌హానికి పూజ‌లు నిర్వ‌హిస్తారు.

పెంపుడు జంతువులతో దుర్గా పూజ పండల్..

పండుగలు అంటే కుటుంబంలోని ప్రతి సభ్యునితో ఆనందంగా జరుపుకోవడమే. కోల్‌క‌త్తాలోని ఓ దుర్గామాత పండ‌ళ్లు మాత్రం కేవ‌లం పెంపుడు జంతువులు, ప‌క్షుల‌తో ప్రారంభించింది. దుర్గాపూజ సమయంలో పెంపుడు జంతువులను ఇళ్లలో వ‌దిలేసి అంద‌రూ బ‌య‌టికి వెళ‌తారు. కాబ‌ట్టి అవి ఇంట్లో ఒంట‌రిగా ఫీల్ అవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, బెల్గారియా ఆర్యనగర్ దుర్గా పూజ కమిటీ పెంపుడు జంతువులు, పక్షులచే ఓక పండల్‌ను ప్రారంభించ‌డం జ‌రిగింది.

badanagarnaparadada ,bhaisangh

కాంతారా సినిమా స్ఫూర్తితో...

కేరళలోని నిగూఢ అడవుల నేపథ్యంలో తెరకెక్కిన కాంతారా సినిమా అంద‌రికి గుర్తే ఉంటుంది. కాంతారా గొప్పతనాన్ని అనుభవించాలనుకుంటే మాత్రం ఉత్తర కోల్‌కతాలో ఉన్న జోరాసంకో సాధరణ దుర్గాత్సవ్ కమిటీ దుర్గాపూజకు వెళ్లాల్సిందే. ఇక్క‌డ దాదాపు 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న పూజా పండల్‌లో దుర్గామాత విగ్రహం మ‌న‌కు క‌నిపిస్తుంది. కేరళ సంప్రదాయ నృత్య రూపమైన 'దైవ కోలా' ఆధారంగా ఈ విగ్రహాన్ని నిర్మించారు.

సిలికాన్‌తో చేసిన విగ్రహాలు..ఇక్క‌డ ప్ర‌త్యేకం..

దుర్గాపూజ సంద‌ర్భంగా దుర్గా మాత విగ్ర‌హం, లక్ష్మి, సరస్వతి, కార్తికేయ, గణేశ, మహిషాసుర విగ్ర‌హాల‌న్నింటిని మట్టితో తయారు చేయడం గురించి తరచుగా మ‌నం వింటూనే ఉన్నాం. అయితే క‌ల‌క‌త్తాలోని ఈ ప్రాంతంలో మాత్రం దుర్గామాత విగ్ర‌హాల‌న్నీ సిలికాన్‌తో త‌యారుచేయ‌బ‌డ్డాయి. హరిదేవ్‌పూర్ 41 పల్లి దుర్గా పూజ పండల్‌లో ఈ అద్భుతాన్ని మ‌నం చూడొచ్చు. ఇవి అచ్చం మ‌నిషుల్లానే మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. కాశీ ఘాట్‌ల ఇతివృత్తంగా ఈ పూజా పండల్‌ను అలంకరించిన‌ట్లు తెలుస్తోంది..

movingtramjorasankodurgatsavcommittee

శోభాబజార్ రాజ్‌బారి

కోల్‌కతాలోని పురాతన, సాంప్రదాయ దుర్గా పూజ కమిటీలలో శోభాబజార్ రాజ్‌బారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పూజా పండల్‌లో, ప్రతి సంవత్సరం విగ్ర‌హాల‌ను ఏదైనా థీమ్ ఆధారంగా కాకుండా ఒక నిర్దిష్ట శైలిలో తయారు చేయ‌డం ఇక్క‌డ ఆన‌వాయితీ. ఈ సారి ఇక్క‌డి దుర్గాదేవిని బంగారు ఆభరణాలతో అలంకరించారు. ప్ర‌తిఏటా శోభాబ‌జార్ రాజ్‌బ‌రిలోని దుర్గామాత ప్ర‌తిమ‌ల‌ను చూసేందుకు సూదూర ప్రాంతాల నుంచి ప‌ర్యాట‌కులు, భ‌క్తులు త‌ర‌లి వ‌స్తుంటారు. ముఖ్యంగా అష్టమి, నవమి మధ్య సంధి పూజ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్క‌డ‌కు రావ‌డం జ‌రుగుతుంది.

బడానగర్ నాపర దాదా-భాయ్ సంఘ్

ఉత్తర కోల్‌కతాలోని బడానగర్ నపద దాదా-భాయ్ సంఘ్‌లో ప్ర‌తి సంవ‌త్స‌రం మా దుర్గా విగ్ర‌హాల ప్ర‌త్యేక రూపాల‌ను చూడొచ్చు. ఇక్కడ దుర్గ మాత పది చేతులతో కాదు రెండు చేతులతో దర్శనమివ్వబోతోంది. శివుని డ‌మ‌రుకం, త్రిశూల్ కూడా దుర్గ‌మాత చేతుల‌లో క‌నిపిస్తాయి. గ‌ణేష్-కార్తికేయ, సరస్వతి-లక్ష్మి వర్ భంగిమలో కాకుండా నమస్కార భంగిమలో కూర్చుని కనిపిస్తారు దుర్గామాత‌.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+