Search
  • Follow NativePlanet
Share
» »గోవా వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే, ఈ టూర్ ప్యాకేజీ మీకోస‌మే..!

గోవా వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే, ఈ టూర్ ప్యాకేజీ మీకోస‌మే..!

ఈ వేస‌వి సెలవుల్లో చాలామంది చల్ల‌ని ప్ర‌దేశాల‌కు, హిల్‌స్టేష‌న్‌, బీచ్‌ల‌కు వెళ్లాల‌నుకుంటారు. అయితే, చాలామంది గోవా వంటి ప్ర‌దేశాల‌ను ఎంచుకుంటుంటారు. అయితే, గోవా చుట్టేయాల‌నుకుంటున్న‌వారికి తెలంగాణ టూరిజం ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా అతి త‌క్కువ ఖ‌ర్చుతో హైదరాబాద్ నుంచి గోవా టూర్ బ‌య‌లుదేరొచ్చు. తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ నాలుగు రోజులపాటు కొన‌సాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా పెద్దలకు రూ. 11,999గా టికెట్ ధరను ప్రకటించారు. గోవాలోని ప్రకృతి అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్ర‌దేశం ఎల్ల‌ప్పుడూ విదేశీ పర్యాటకుల తాకిడితో కోలాహలంగా ఉంటుంది. ఇక్కడి బీచ్ ల గురించి, టూరిస్ట్ ప్రదేశాల గురించి చెప్పుకోని వారంటూ ఎవ‌రూ ఉండరు.

GOA PACKAGE TOUR - ITINERARY పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి గోవా(Goa Tour Packag) టూర్ ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రోడ్డు మార్గానే ఈ టూర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి https://tourism.telangana.gov.in/p ఈ టూర్ ప్యాకేజీని బుక్‌చేసుకోవ‌చ్చు. మొత్తం 4 రోజుల పాటు టూర్ ఉంటుంది.

Do you want to go to Goa this tour package is for you

టూర్ షెడ్యూల్ వివ‌రాలివే..!

హైదరాబాద్ - గోవా టూర్(GOA PACKAGE TOUR - ITINERARY) ప్యాకేజీని తెలంగాణ టూరిజం(Telangana Tourism) ఆపరేట్ చేస్తోంది. ప్రతి సోమవారం తేదీల్లో ఈ టూర్ జర్నీ ఉంటుంది. ఈ టూర్‌లో భాగంగా మొద‌టి రోజు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ రోజు నైటంతా జ‌ర్నీ ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంటలకు కలంగుట్ కు చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి నార్త్ గోవాలోని పలు ప్రాంతాలను చూస్తారు. ఇందులో మపుసా సిటీ, బోగ్దేశ్వర్ ఆలయం, Fort Aguada, బాగా బీచ్ ను చూస్తారు. మరో రెండు బీచ్‌ల‌కు కూడా వీక్షిస్తారు. మూడో రోజు సౌత్ గోవా ట్రిప్ ఉంటుంది.

అక్క‌డ ఓల్డ్ గోవా చర్చిలతో పాటు డోనా పౌలా బీచ్ ల‌కు కూడా వెళ్తారు. సౌత్ గోవా ట్రిప్‌లో భాగంగా Miramar, Mangueshi టెంపుల్, కోల్వా బీచ్, మార్డోల్ బీచ్ ల్లో విహ‌రించొచ్చు. పాన్ జిమ్ లో సాయంత్రం క్రూజ్ బోట్‌లో జర్నీకూడా ఉంటుంది. ఈ బోట్ జ‌ర్నీకి ప్ర‌యాణికులే డ‌బ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కరికి రూ. 500 చెల్లించాలి. ఇక, నాలుగోరోజు క‌లంగుట్ నుంచి ఉద‌యం11 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఐదో రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకోవ‌డంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

Do you want to go to Goa this tour package is for you

టికెట్ ధరల వివ‌రాలు ఇలా ఉన్నాయి...

తెలంగాణ టూరిజం అందిస్తోన్న హైద‌రాబాద్ టు గోవా ట్రిప్ వెళ్లాల‌నుకునేవారు పెద్దలకయితే రూ. 11999/ చెల్లించాలి. పిల్లలకయితే రూ. - 9599/ ధ‌ర‌గా నిర్ణ‌యించారు, సింగిల్ అక్యుపెన్సీకయితే రూ. 14900గా చెల్లించాల్సి ఉంటుంది. ప్ర‌యాణికులు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి https://tourism.telangana.gov.in/p ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు.

More News

    Read more about: goa travel guide telangana
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+