Search
  • Follow NativePlanet
Share
» »సింగ‌పూర్, మ‌లేషియా చూడాల‌నుకుంటున్నారా..? అయితే ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

సింగ‌పూర్, మ‌లేషియా చూడాల‌నుకుంటున్నారా..? అయితే ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

చాలామంది విహార‌యాత్ర‌ల‌కు విదేశాల‌కు వెళ్లాల‌ని ప్లాన్ చేస్తుంటారు. విదేశాల్లోని అంద‌మైన ప్ర‌దేశాల‌లో కొన్నిరోజులు ప్ర‌శాంతంగా గ‌డ‌పాల‌ని భావిస్తుంటారు. ప‌ర్యాట‌కులు చాలామంది సింగపూర్, మలేషియావంటి ప్రాంతాల‌కు ప్లాన్ చేస్తుంటారు అయితే, అలాంటివారికోసం ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ముంబ‌యు టు సింగపూర్‌, మలేషియా చూసేయొచ్చు. ఈ ట్రిప్ ఆరురోజులు ఉంటుంది.

ఈ ఆరురోజుల్లో సింగ‌పూర్‌, మ‌లేషియాలోని ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను తిల‌కించ‌వ‌చ్చు. ఫైట్ జర్నీ చేయాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ఆగస్టు 13 నుంచి 19 మధ్యలో ఉంటుంది. రూ.1,15,900 ప్రారంభం ధరతో ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ‌మ‌వుతుంది. మెస్మరైజింగ్ సింగపూర్, మలేషియా పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ప‌ర్యాట‌కులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీ మరిన్ని వివరాల కోసం 8287931655కు "SM" అని SMS చేయాల్సి ఉంటుంది.

Do you want to see Singapore and Malaysia

ఆరు రోజుల టూర్ షెడ్యూల్‌..

మొద‌టి రోజు ముంబయి నుంచి కౌలాలంపూర్‌కు విమానంలో బయలుదేరతారు. ఆ మ‌రుస‌టి రోజు కౌలాలంపూర్ చేరుకుని, సింగపూర్‌ వెళ్లేందుకు మరో విమానం ఎక్కాల్సి ఉంటుంది. సింగపూర్‌లో ప్లైట్ దిగాక‌, అక్క‌డి టూర్ గైడ్‌ని కలుసుకుంటారు. ఆ త‌ర్వాత హోటల్ లో చెక్ ఇన్ అయ్యి, అక్క‌డే ప్రెష్ అవుతారు. అనంత‌రం భోజ‌నం చేసి సాయంత్రం ట్రామ్ రైడ్, జంతు ప్రదర్శనలతో నైట్ సఫారీని వీక్షిస్తారు. ఆ నైటంతా సింగపూర్‌లోనే ఉంటారు. మూడోరోజు టిఫిన్ చేశాక సింగ‌పూర్ సిటీ ట్రిప్ ఉంటుంది. అందులో ముఖ్యంగా సివిక్ డిస్ట్రిక్ట్, పడాంగ్, క్రికెట్ క్లబ్, హిస్టారిక్ పార్లమెంట్ హౌస్, సుప్రీం కోర్టు, సిటీ హాల్, తర్వాత మెర్లియన్ పార్క్, థియాన్ హాక్ కెంగ్ టెంపుల్, సింగపూర్ ఫ్లైయర్ వంటివి సంద‌ర్శిస్తారు.

లంచ్ అనంత‌రం తిరిగి వ‌న్ వే కేబుల్ కార్ రైడ్, మేడమ్ టుస్సాడ్స్, వింగ్స్ ఆఫ్ టైమ్, సింగపూర్ సీ అక్వేరియంతో సెంటోసా ఐలాండ్ టూర్ ఉంటుంది. ఆ తర్వాత హోటల్‌కి చేరుకుంటారు. రాత్రంతా అక్క‌డే ఉండిపోతారు. ఇక‌, నాలుగోరోజు అల్పాహారం ముగించుకుని అక్క‌డి ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను తిల‌కిస్తారు. ఒకరోజు రెస్ట్ తీసుకుని, ఆ మ‌రుస‌టి రోజు హోటల్‌లో టిఫిన్ చేసి చెక్అవుట్ చేస్తారు. అక్క‌డినుంచి బే ద్వారా గార్డెన్స్ సందర్శిస్తారు. కౌలాలంపూర్‌కు వెళ్లేందుకు సింగపూర్ విమానాశ్ర‌యానికి బ‌యలుదేరుతారు. కౌలాలంపూర్ చేరుకున్నాక హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. ఆ రాత్రంతా కౌలాలంపూర్‌లో బస చేస్తారు. ఆరో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత జెంటింగ్ హైలాండ్స్‌కు వెళ్తారు.

దాని తర్వాత బటు గుహలు విజిటింగ్ ఉంటుంది. అనంత‌రం వ‌న్ వే కేబుల్ కార్ జెంటింగ్‌ను సందర్శించవచ్చు. ఆ మ‌రుస‌టి రోజు హోటల్‌లో చెక్ అవుట్ చేసి కౌలాలంపూర్ నగర పర్యటనకు వెళ్తారు. అక్క‌డ కింగ్స్ ప్యాలెస్, చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇండిపెండెన్స్ స్క్వేర్, పార్లమెంట్ హౌస్, నేషనల్ మాన్యుమెంట్, జామెక్స్ మసీదు, పెట్రోనాస్ ట్విన్ టవర్ (స్కై బ్రిడ్జ్ ఎంట్రీ) వంటివి చూస్తారు. భోజ‌న‌మ‌య్యాక పుత్రజయను సందర్శిస్తారు. ఈవెనింగ్ 7.25 గంటలకు తిరుగు ప్రయాణానికి సిద్ధ‌మ‌వుతారు. ఏడోరోజు ముంబ‌యి చేరుకోవ‌డంతో ఈ పర్యటన ముగుస్తుంది.

ఫ్లైట్ షెడ్యూల్..

ఫ్లైట్ తేదీ సెక్టార్ డిపార్చర్ రాక

OD 216 - 13.08.2024 - BOM - KUL - 23:15 గంటలు 07:10 గంటలు +1

OD 803- 14.08.2024 -కుల్- సిన్- 10:30 గంటలు 11:30 గంటలు

OD 808 -17.08.2024 -సిన్-కుల్- 17.00 గంటలు 18.05 గంటలు

OD 215 -19.08.2024- KUL - BOM - 19:25 గంటలు 22:20 గంటలు

టూర్ ప్యాకేజీ ధ‌ర‌లు..

సింగిల్ ఆక్యుపెన్సీ- రూ. 137500/-

డబుల్ ఆక్యుపెన్సీ -రూ. 115900/-

ట్రిపుల్ ఆక్యుపెన్సీ- రూ. 115900/-

చైల్డ్ విత్ బెడ్ (2-11 సంవత్సరాల పిల్ల‌లు )- రూ. 101900/-

చైల్డ్ వితవుట్ బెడ్ (2-11 సంవత్సరాల పిల్ల‌లు )- రూ. 87900/-

ప‌ర్యాట‌కులు ఇత‌ర పూర్తివివ‌రాల కోసం ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+