Search
  • Follow NativePlanet
Share
» »శీతాకాలంలో ప్రయాణించాల‌నుకుంటున్నారా..? అయితే వీటిని పాటించండి..

శీతాకాలంలో ప్రయాణించాల‌నుకుంటున్నారా..? అయితే వీటిని పాటించండి..

శీతాకాలం చాలా మందికి ఇష్టమైన సీజన్. చాలా మంది ఈ సీజన్‌లో ప్రయాణం చేయాలని ప్ర‌ణాళిక‌లు వేస్తుంటారు. అయితే, ఈ సీజ‌న్‌లో ప్రయాణం చాలా కాస్త కష్టంగానే ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతలు, వణుకు పుట్టించే చలి కారణంగా ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ప్ర‌యాణాలను ఇష్టపడే వారు ఏ సీజన్‌లోనైనా విహారానికి వెళతారు. చాలా మంది ప‌ర్యాట‌కులు ముఖ్యంగా చలి కాలంలో ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. ఈ సీజన్‌లో, ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజలను ఇంటి నుండి బయటకు వచ్చేలా చేస్తుంది. అయితే, ఎముకలు కొరికే చలికాలంలో హిల్ స్టేషన్‌లో ప్రయాణించడం అంటే ఎంతో స‌వాలుతో కూడుకున్న ప‌ని అని చెప్పుకోవాలి. ఈ శీతాకాలంలో ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మాత్రం త‌ప్ప‌కుండా ఈ విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం.

ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఈ సీజ‌న్‌లో సంద‌ర్శించ‌డమంటే ప‌ర్యాట‌కులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన‌వ‌చ్చు. అందులో మీరు లేదా మీతో పాటు వచ్చే ఎవరైనా అనారోగ్యానికి గురికాక త‌ప్ప‌దు. ఇలాంటి పరిస్థితిలో, మీ ట్రిప్‌ని ఎంజాయ్ చేయాల‌నుకుంటే మాత్రం కొన్ని విష‌యాల‌ను గ‌మ‌నంలో ఉంచుకోవాలి.

wintertraveltips

ప్రయాణానికి సంబంధించిన ముఖ్యమైన చిట్కాలు

శీతాకాలంలో ప్రయాణానికి బయలుదేరే ముందు, వాతావరణానికి అనుగుణంగా వెచ్చని దుస్తులను కొనుగోలు చేయాలి. బస చేయడానికి ప్రీ-హోటల్ బుకింగ్, మెడిసిన్ కిట్, వాతావరణ సూచన, కొన్ని ఇతర ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా, బడ్జెట్ యొక్క సరైన నిర్వహణ చాలా ముఖ్యం. వింటర్ ట్రిప్‌కు వెళ్లే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం-

బడ్జెట్ నిర్ణయించండి

ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా డబ్బు అవసరం ఎంతో ముఖ్యం. కాబట్టి ముందుగా మీ బడ్జెట్‌ను నిర్ణయించుకోండి. అప్పుడు ట్రిప్ ప్లాన్ చేయ‌డం ఉత్త‌మం. ఎందుకంటే శీతాకాలంలో కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి. వీటిని ప‌క్క‌న పెట్టేయ‌లేము. అత్యవసర పరిస్థితుల కోసం కొంత అదనపు డబ్బును కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది.

ప్రీ-హోటల్ బుకింగ్

శీతాకాలం అయినా వేస‌వి అయినా, ట్రిప్‌కి వెళ్లే ముందు టూర్ అండ్ ట్రావెల్స్ కంపెనీ సహాయంతో మీ కోసం సౌకర్యవంతమైన హోటల్‌ను బుక్ చేసుకోవడం ఎంతో ఉత్త‌మం. ఇలా చేయడం వల్ల మీరు ఒంటరిగా ఉన్నా, కుటుంబంతో లేదా స్నేహితులతో ఉన్నా, ఎటువంటి అసౌక‌ర్యానికి గురి కాకుండా ఉంటారు.

ఉన్ని దుస్తులు అందుబాటులో ఉంచుకోవాలి...

చలికాలంలో ప్రయాణించడానికి ముందు మీ ప్యాకింగ్‌లో ఉన్ని దుస్తులతో పాటు ఉన్ని లోపలి దుస్తులను కూడా భ‌ద్ర‌ప‌రుచుకోవాలి. అదనపు టాప్స్ మరియు స్వెటర్లను కూడా ఉంచండి. ఉన్ని సాక్స్, గ్లోవ్స్, షూస్ ఉంచాలని నిర్ధారించుకోండి. పురుషులకు ఉన్ని క్యాప్‌లు, మఫ్లర్‌లు మొదలైనవి ఎంతో ముఖ్యం. అలాగే, మహిళలకు ఉన్ని క్యాప్‌లు మరియు శాలువాలు కలిగి ఉండటం మర్చిపోవద్దు. వింటర్ కేర్ బాడీ లోషన్, లిప్ బామ్, మాయిశ్చరైజర్, వాసెలిన్ మొదలైన వాటిని ఉంచుకోవడం మర్చిపోవద్దు.

wintertravel tips

మెడికల్‌ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలి..

సాధారణ జ్వరం, ఫ్లూ, అలర్జీ మరియు జలుబు వంటి వాటికి సంబంధించిన మందులను కలిగి ఉండే మందుల కిట్‌ను త‌ప్ప‌నిస‌రిగా మీ ప్యాకింగ్‌లో ఉంచుకోవాలి. అలాగే గ్యాస్, వాంతులు, కడుపునొప్పి, డైజిన్, పుడిన్ హరా వంటి చిన్న మందులను ఉంచడం మర్చిపోవద్దు. వీలైతే, ఒక చిన్న బాటిల్ డెటాల్, కొన్ని కాటన్ బాల్స్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. బీపీ లేదా మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, వైద్యుడిని సంప్రదించిన తర్వాత మీ మందులను ఉంచుకోవడం మర్చిపోవద్దు.

వాతావరణ సూచన

శీతాకాలంలో బయటకు వెళ్లే ముందు, వాతావరణం గురించి తాజా సమాచారాన్నిఎప్ప‌టిక‌ప్ప‌డూ తెలుసుకుంటూ ఉండాలి. దీనివ‌ల్ల‌ మారుతున్న వాతావరణంలోని మార్పుల వ‌ల్ల కలిగే సమస్యలను నివారించుకోగ‌లరు. వీటన్నింటితో పాటు మీరు వెళ్లే ప్రదేశాన్ని క్షుణ్ణంగా ముందుగా పరిశీలించడం ఎంతో మంచిది.

More News

    Read more about: traveling in winter tips
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+