Search
  • Follow NativePlanet
Share
» » ముంబై వింతలు - టూరిస్ట్ టేస్ట్ లు !

ముంబై వింతలు - టూరిస్ట్ టేస్ట్ లు !

ముంబై నగరం పేరు చెప్పగానే చాలామంది జనాభా ఎక్కువ, మురికి వాడ లు, ఎపుడు ఏమి జరుగుతుందో తెలియదు అని అంటారు. ఇదంతా నిజమే. కాని మీ ఈ భావనలు కాసేపు పక్కన పెట్టండి. వేరే నగరాల వలెనె ఇది కూడా ఎన్నో ప్రత్యేకతలు కూడా కలిగిన సిటీ. మీ పర్యటన ముగిసిన వెంటనే, ఒక్కసారి ముంబై నగరం లో మేము తెలిపే చిన్న చిన్న అంశాలు పరిశీలించండి. వాటి ఆనందాలు పొందండి.

బాలీవుడ్ టూర్

బాలీవుడ్ టూర్

సినిమా అంటే ఇష్టం లేని వారు ఎవరు వుంటారు. సినీ ప్రియులకు బాలీవుడ్ సందర్శన మించినది లేదు. కనుక ఇక్కడి ఫిలిం సిటీ ఒక్కసారి సందర్శించండి. ఇక్కడ ప్రతి సంవత్సరం వందకు పైగా సినిమాలు తీస్తారు.

Pic credit: Meanest Indian

బాలీవుడ్ టూర్

బాలీవుడ్ టూర్

ఫిలిం సిటీ ని 1978 లో నిర్మించారు. ఈ ఫిలిం సిటీ సుమారు 350 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి వుంది. దీనిలో 20 ఇన్డోర్ స్టూడియో లు, అవుట్ డోర్ సెట్టింగ్ లు, షూటింగ్ లు వుంటాయి. పబ్లిక్ ని అనుమతించరు. ముందస్తు అనుమతి కావాలి. గైడ్ తో వెళితే అనుమతిస్తారు. మహారాష్ట్ర టూరిజం శాఖ వీటిని నిర్వహిస్తుంది. షూటింగ్ లు, బాలీవుడ్ నటుల నివాసాలు కూడా చూడవచ్చు.

Picture Credit: wallygrom

ధారవి స్లమ్ టూర్

ధారవి స్లమ్ టూర్

స్లం అంటే చూడరానిది అని భావించకండి. ఈ మురికి వాడలు ఆసియా ఖండంలోనే పెద్దవి. ఈ టూర్ లు స్థానిక టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తాయి. టికెట్ ధర రూ.500 నుండి రూ.4000 వరకూ వుంటాయి.

దారవి స్లం టూర్

దారవి స్లం టూర్

దారవి లో స్మాల్ స్కేల్ పరిశ్రమలు చాలా కలవు. ఇక్కడ అందరూ కలసి మెలసి సంఘ జీవనం చేయటం చూస్తారు.

Picture Credit: markhillary

ముంబై రాత్రి జీవనం

ముంబై రాత్రి జీవనం

ముంబై నగరం నిద్రించదు. అనే మాట వాస్తవమే. చీకటి పడితే చాలు, ముంబై నగరం అంతా మారి పోతుంది. ప్రేయసీ ప్రియులు, కుటుంబాలు, షికార్లు కొట్టే వారు అందరూ నగర సంచారం మొదలు పెట్టి ఆనందిస్తారు. మెరైన్ డ్రైవ్ లో కూర్చొని చక్కని పాటలు వింటూ సముద్ర తరంగాల ధ్వనులను ఆనందించండి. లేదా చౌ పట్టి వంటి సాధారణ బీచ్ కు వెళ్ళండి. అక్కడ కల రెండు బిలియన్ డాలర్ ల విలువ కల ముకేష్ అంబాని నివాసం అన్తిలియా టవర్స్ చూసి ఆనందించండి.

Picture Credit: Enygmatic-Halycon

ముంబై నగర రాత్రి జీవితం

ముంబై నగర రాత్రి జీవితం

2008 ఉగ్రవాద దాడి జరిగిన, దేశంలోనే అతి బిజీ గా వుండే సి ఎస్ టి రైలు స్టేషన్ చూడండి. సాయంత్రం అయ్యిందంటే చాలు ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశం లైట్ ల వెలుగులలో కన్నులకు విందు చేస్తూ వుంటుంది.

Picture Credit : souravdas

ముంబై స్ట్రీట్ ఫుడ్

ముంబై స్ట్రీట్ ఫుడ్

ముంబై నగరం వెళ్లేవారికి 'ఖావో గల్లీస్' కు వెళ్ళకుండా పర్యటన పూర్తి కాదు. ఇక్కడ మీకు అసలు సిసలైన ముంబై స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది.

Picture Credit: Marco Zanferrari

ముంబై స్ట్రీట్ ఫుడ్

ముంబై స్ట్రీట్ ఫుడ్

ముంబై స్ట్రీట్ ఫుడ్ లో ప్రత్యేకమైనవి పావ్ భాజీ, భేల్ పూరీ లు. మాంసాహారులకు ఎన్నో రకాల వెరైటీ లు దొరుకుతాయి.

Picture Credit: surtr

ముంబై డబ్బావాలాస్

ముంబై డబ్బావాలాస్

ముంబై డబ్బావాలాల గురించి హార్వర్డ్, బిజినెస్ స్కూల్ కూడా స్టడీ చేసింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ డబ్బా వాలాలు ప్రతి రోజూ సుమారు 200,000 లంచ్ బాక్స్ లను నగరంలోని వివిధ ఆఫీస్ లకు అందిస్తారు. వీరి నిర్వహన చూసి తీరాల్సిందే.

Pic Credit : Ayan

ముంబై డబ్బావాలాస్

ముంబై డబ్బావాలాస్

ముంబై డబ్బావాలాస్ ఒకప్పుడు బ్రిటిష్ పాలకుల అవసరాలకు గాను ఈ రకంగా లంచ్ బాక్స్ లు అందించేవారు. వీరు నేటికీ అదే పద్ధతి కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. వీరి నిర్వహణా విధానం చూడాలంటే, చర్చి గెట్ రైల్వే స్టేషన్ వద్దకు ఉదయం 11.30 నుండి 12.30 గంటల మధ్య చూడాలి. లంచ్ బాక్స్ లు ట్రైన్ లలో పెట్టి వాటిని సంబంధిత సిబ్బందికి అందించేందుకు ఆఫీస్ లకు బయలుదేరుతారు.
Picture Credit: joshidaniel.com

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+