Search
  • Follow NativePlanet
Share
» »గోవాలోని ఈ బీచ్‌ల‌ను అస్స‌లు మిస్స‌వ్వొద్దు..!

గోవాలోని ఈ బీచ్‌ల‌ను అస్స‌లు మిస్స‌వ్వొద్దు..!

గోవాలోని ఈ బీచ్‌ల‌ను అస్స‌లు మిస్స‌వ్వొద్దు..!

గోవా కేవలం హాలిడే డెస్టినేషన్ మాత్రమే కాదు. వర్షాకాలంలో గోవా అందం మరింత రెట్టింప‌వుతుంది. దేశంలోనే టాప్ పర్యాటక ప్రదేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడి అందమైన బీచ్‌లు కేవలం దేశీయులనే కాకుండా అంతర్జాతీయ పర్యాటకులను సైతం అలరిస్తాయి. దీంతో ఎక్కడెక్కడి నుండో ప‌ర్యాట‌కులు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటారు. పచ్చదనం మధ్య సముద్రపు అలలను చూడటానికి ఇష్టపడే వారి కోసం గోవా ఎంతో ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం అని చెప్పుకోవ‌చ్చు. ఆగ‌స్టులో గోవా వెళ్లాలని ప్ర‌ణాళిక సిద్ధం చేస్తుంటే మాత్రం తప్పకుండా ఈ బీచ్‌లను సందర్శించడం మ‌ర‌వొద్దు.

1

మోర్జిమ్ బీచ్

ఇది గోవాకు ఉత్తరాన ఉన్న ఒక బీచ్. ఇది తెల్లటి ఇసుక, బ్యాక్ వాటర్స్‌, డాల్ఫిన్‌లకు ప్రసిద్ధి చెందింది. వర్షాకాలం ఈ బీచ్ మరియు బ్యాక్ వాటర్స్ ని పచ్చదనంతో నింపుతుంది. బోట్ రైడ్ చేయడానికి లేదా ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది.

2

ఆరంబోల్ బీచ్‌

గోవాలోని హిప్పీ హాట్‌స్పాట్‌గా పిలువబడే ఈ బీచ్ మట్టి స్నానాలు, సముద్రపు బీచ్ పార్టీలు, సంగీతం, రుచికరమైన ఆహారానికి కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. మొత్తంమీద ఇక్కడి ప్ర‌శాంతమైన వాతావరణం ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఉత్తర గోవాలోని ప్రధానమైన టూరిస్ట్ బీచ్‌లలో ఈ అరంబోల్ బీచ్ ఒకటి. ఈ ప్రాంతంలో మత్స్యకారులు అత్య‌ధికంగా నివసిస్తారు. గోవా చుట్టుపక్కల దట్టమైన అటవీప్రాంతం కారణంగా ఇది గోవాలోని పచ్చని బీచ్‌లలో ఒకటిగా పేరుగాంచింది.

3

బాగా బీచ్‌

గోవాలోని అత్యంత ప్రసిద్ధ, రద్దీగ‌ల‌ బీచ్‌లలో ఇది ఒకటి. బాగా బీచ్ నైట్ లైఫ్, షాక్స్, సీ ఫుడ్, వాటర్ స్పోర్ట్స్, సంగీతానికి ప్రసిద్ధి చెందింది. గోవాలోని టాప్ టూరిస్ట్ బీచ్‌లలో బాగా బీచ్ చాలా ఫేమస్. ఇది ఉత్తర గోవాలో ఉంటుంది. ఇక్కడికి వ‌చ్చే సంద‌ర్శ‌కులు సేద తీరేందుకు అనువైన గుడిసెలు, ఫిషింగ్ బోట్‌లు వరుసగా ఉంటాయి.

పాలోలెమ్ బీచ్

ఈ బీచ్ గోవా దక్షిణ భాగంలో సముద్రతీర గ్రామం సమీపంలో ఉంది. ప్రశాంతమైన వాతావ‌ర‌ణం, వెదురు గుడిసెలు, ఇక్క‌డి అందాలు విదేశీ పర్యాటకుల‌ను సైతం ఆక‌ర్షిస్తున్నాయి. ఎవరైనా బీచ్‌కు దగ్గరగా తక్కువ ధరకు విడిది చేయాలంటే మాత్రం ఈ పాలోలెమ్ బీచ్ సరైన ప్రదేశం. ఇక్కడి కొబ్బరి చెట్ల మధ్య ఉండే చిన్న అందమైన ఇళ్లు పర్యాటకులకు కొత్త అనుభూతి క‌లిగిస్తుంది. ఎదురుగా క‌నిపించే సముద్రం కూడా ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటుంది.

బెనాలిమ్ బీచ్

అస్తమించే సూర్యుడి అందాల‌ను చూడాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ బీచ్‌ను ఎంచుకోవాల్సిందే. ఈ బీచ్ సమీపంలోని సెయింట్ జాన్స్ చర్చి కూడా పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా పేరుగాంచింది. బెనాలిమ్ బీచ్ దక్షిణ గోవాలో ఉంటుంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా పర్యాటకులను ప్రధానంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతం ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంటుంది.

వర్క బీచ్‌

ఈ బీచ్ గోవా దక్షిణ భాగంలో ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణానికి ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బీచ్‌లో కొన్ని షాక్స్‌లు, విశ్రాంతి తీసుకోవడానికి లాంజ్ కుర్చీలు ఉంటాయి. ఒంట‌రిగా గ‌డిపేందుకు ఈ బీచ్ ఎంతో ఉత్త‌మ‌మైన‌దనే చెప్పుకోవ‌చ్చు. న‌గ‌ర‌పు హ‌డావుడి జీవితం నుంచి కాస్త విశ్రాంతి కోరుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్రాంతంలో కాసేపు సేద‌తీరాల్సిందే..

More News

Read more about: morjim beach goa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+