Search
  • Follow NativePlanet
Share
» »నీల్ ద్వీపపు అందాలు - మరువ లేని అనుభవాలు !!

నీల్ ద్వీపపు అందాలు - మరువ లేని అనుభవాలు !!

అండమాన్ మరియు నికోబార్ దీవుల సముదాయంలో నీల్ ద్వీపం ఒకటి. ఈ ద్వీపం సుమారు 19 కి. మీ. ల పొడవు కలిగి అనేక అందమైన ఇసుక తిన్నెలు కలిగి వుంటుంది. ఈ ద్వీపంలో హావ్ లాక్ ఐలాండ్ కంటే కూడా నిర్మలమూ, ప్రశాంత వాతావరణం వుంటుంది. ఈ దీవికి ఈ పేరు ఒక బ్రిటిష్ సోల్జర్, జేమ్స్ జార్జ్ స్మిత్ నీల్ పేరుపై పెట్టారు. ఇది సౌత్ అండమాన్ జిల్లా పాలన క్రింద కలదు.

ద్వీపం వెడల్పు 5 కి. మీ.లు గా వుంది, రెండు గంటల సమయంలో తిరిగి వచ్చేదిలా వుంటుంది. ఈ బీచ్ లో కల పచ్చటి నీరు కను విందు చేస్తూ వుంటుంది. నీల్ ద్వీపంలో ఎక్కువగా నివాసితులు వుండరు, మరియు వచ్చే సందర్శకులు కూడా అధికంగా వుండరు. ఈ ద్వీపం మొత్తంగా అయిదు గ్రామాలు మాత్రమే. జనాభా చాలా తక్కువ. ఈ గ్రామాల పేర్లు, నీల్ కేంద్ర, భరత్పూర్, సీతాపూర్, రాం నగర్ మరియు లక్ష్మనాపూర్. కూరల సాగు ఇక్కడి ప్రజల వృత్తి. ఈ ద్వీపంలో పండే కూరగాయలు, అండమాన్ దీవులన్నిటికి సరిపోతాయి. ఈ సుందర ద్వీపం హావ్ లాక్ ఐలాండ్ కు సమీపమే అయినప్పటికీ, టూరిస్ట్ లు అధికంగా ఇక్కడకు రారు. కనుక, ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనుకునే వారికి ఈ ప్రదేశం సరైనది.

నీల్ ఐలాండ్ ఎలా చేరాలి ?

ఇండియా లోని అనేక మెట్రో నగరాల నుండి పోర్ట్ బ్లెర్ కు విమానాలు కలవు. ఒక సారి మీరు పోర్ట్ బ్లెర్ చేరితే, అక్కడ నుండి నీల్ ఐలాండ్ ఎంతో దూరం వుండదు. 40 కి. మీ.ల దూరం మాత్రమే. కేపిటల్ సిటీకి ఈశాన్య దిశగా వుంది. రెండు గంటల వ్యవధిలో ఫెర్రీ ల పై చేరవచ్చు. ప్రయాణపు రుసుము రూ. 200 గా వుంటుంది. కొన్ని బోటు లు పోర్ట్ బ్లెర్ నుండి నీల్ ఐలాండ్ కు లేదా వయా హావ్ లాక్ ఐలాండ్ కూడా ప్రయాణిస్తాయి. అయితే, ఈ బోటు జర్నీలో వాతావరణ పరిస్థితులు ప్రధాన పాత్ర వహిస్తాయి.

వాతావరణ మార్పులను బట్టి బోటు సమయాలు వుంటాయి. నీల్ ఐలాండ్ లో ఒక టికెట్ ఆఫీస్ మరియు వెయిటింగ్ రూమ్ కూడా కావు. ఇవి ద్వీపానికి ప్రవేశం మరియు వదిలే చోటు అయిన భరత్పూర్ జెట్టి సమీపంలో కలవు. మీరు కనుక హావ్ లాక్ ఐలాండ్ నుండి ప్రయానిన్చాలనుకుంటే, అక్కడ రంగాట్ ఫెర్రీ సిద్ధంగా వుంటుంది. అది మిమ్ములను ఈ దీవికి ఒక గంటలో చేర వేస్తుంది.

ఐలాండ్ చేరి అక్కడ ఏమి చేయాలి ?

ప్రశాంతమైన ఈ దీవికి చేరిన వెంటనే, టూరిస్ట్ లు ముందుగా బుక్ చేసు కున్నట్లు అయితే గెస్ట్ హౌస్ చేరండి. ఐలాండ్ అంతా తిరిగేందుకు సైకిళ్ళు, టూ వీలర్ లు అద్దెకు దొరుకుతాయి. ఆటో రిక్షాలు కూడా దొరుకుతాయి. సైకిళ్లకు రూ. 50 - 75 , టూ వీలర్లకు రూ.౩౦౦ రోజువారీ అద్దె వుంటుంది. అంతా తిరిగిన తర్వాత సా. 5 గంటల లోపు మీ వాహనానికి పెట్రోల్ వేయించటం మరువకండి.

అనేక ఫొటోగ్రాఫ్ లు తీసుకోవచ్చు. స్నార్కెలింగ్ నీల్ ఐలాండ్ లో ఆనందించదగిన క్రీడ. ఒక్కసారి సముద్రం లో మునిగితే చాలు, పగడపు దీవులు కను విందు చేస్తాయి. వివిధ రంగుల చేపలు, ముత్యపు చిప్పలు కనపడతాయి. ఇక్కడ స్కూబా శిక్షణ కూడా కలదు. స్నార్కెలింగ్ , డైవింగ్ లలో డైవ్ ఇండియా కోర్సులు నిర్వహిస్తుంది.

మీరు కనుక ప్రశాంతంగా వుండ దలిస్తే, లక్ష్మన్పూర్ బీచ్ ఇసుకలో కాలి నడక ఆనందించండి. స్విమ్మింగ్ చీయాలనుకుంటే, సీతాపూర్ బీచ్ అనుకూలం. భరత్పూర్ బీచ్ లో షెల్ల్స్ సేకరించండి.

ఏమి చూడాలి ?

ఈ ఐలాండ్ లోని పడమటి భాగంలో సూర్యాస్తమయం చూసి ఆనందించండి. ఇక్కడ కల కొండలు ఎక్కి కూడా సన్ సెట్ ఆనందించవచ్చు. సీతాపూర్ బీచ్ లో సన్ రైజ్ తప్పక చూడాలి. స్విమ్మింగ్ చేయవచ్చు. ప్రశాంత కాలి నడక చేయవచ్చు. రాం నగర్ బీచ్ లో అడుగున గ్లాస్ వుండే బోటులో వెళ్లి నీటిలోని కోరల్ దీవులు, రంగు రంగుల చేపలు చూడవచ్చు. స్నార్కెలింగ్, వాటర్ స్కూటర్, బాతింగ్ ఆనందించవచ్చు.

అందాల దీవిలో అద్భుత సమయం!

నీల్ ఐలాండ్ చూసేందుకు అక్టోబర్ నుండి మే వరకూ సరైన సమయం. ఈ సమయంలో డైవింగ్ సెంటర్ లు కోర్సులు కూడా నిర్వహిస్తాయి.

ఏమి తినాలి ?

నీల్ ఐలాండ్ లో చిన్న హోటళ్ళు కలవు. తక్కువ రేట్ లో రుచికర ఆహారం అందిస్తాయి. ఇవే కాక బీచ్ రిసార్ట్ లు కూడా రుచికర వంటకాలు అందిస్తాయి. గ్రీన్ హీవెన్ రెస్టారెంట్ , గాన గార్డెన్ రెస్టారెంట్ లు ఫిష్ , పాన్ కేక్ లకు ప్రసిద్ధి. వీటిలో మీరు కుటుంబ సభ్యులతో ఆనందించ దగిన ఏర్పాట్లు కలవు. ఇక్కడ మార్కెట్ లో సౌతపా స్వీట్లు ప్రసిద్ధి. కొబ్బరి తోటలలో ఆనందిస్తూ కోకోనట్ పాలు తాగవచ్చు. ఇక్కడ కల అన్ని రిసార్ట్ లలో ఉన్నత నాణ్యత కల ఆల్కహాల్ దొరుకు తుంది.

ఎక్కడ వుండాలి ?

నీల్ ఐలాండ్ లో అనేక రిసార్ట్ లు, గెస్ట్ హౌస్ లు కలవు. ఇవి మీ సెలవులను ఆనందంగా గడిపే అనేక ఏర్పాట్లు కలిగి వున్నాయి. భరత్పూర్ జెట్టి నుండి కొకన్ హాట్స్ రిసార్ట్ ఒక కి. మీ. దూరంలో వుంటుంది. జెట్టి సమీపంలోనే హాబీల్ నెస్ట్ గెస్ట్ హౌస్ కలదు. దీనిలో సాధారణ రూములు, డార్మిటరీ లు దొరుకుతాయి. ఇంకనూ, టాంగో రిసార్ట్, హోటల్ కింగ్ ఫిషర్, పెర్ల్ పార్క్ బీచ్ రిసార్ట్, కాలా పాని రిసార్ట్ లు కూడా ఎంపిక చేయవచ్చు. ఎక్కువగా ఎవరూ రాని ఈ నీల్ ఐలాండ్ మీ ఆనందకర పర్యటనకు అవసరమైన అన్ని అందాలు, ఏర్పాట్లు కలిగి వుంది. కనుక తదుపరి మీ అండమాన్ పర్యటనలో నీల్ ఐలాండ్ తప్పక పర్యటించి ఆనందించండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+