Search
  • Follow NativePlanet
Share
» »మేఘాలయ‌లో ప్ర‌సిద్ధిచెందిన ఈ ప్ర‌దేశాల‌కు ఎప్పుడైనా వెళ్లారా..?

మేఘాలయ‌లో ప్ర‌సిద్ధిచెందిన ఈ ప్ర‌దేశాల‌కు ఎప్పుడైనా వెళ్లారా..?

ఈశాన్య భారతదేశంలోని ప్రతి ప్రదేశానికి దాని సొంత‌ ప్రత్యేకత ఉంది. సిక్కిం అయినా, అరుణాచల్ ప్రదేశ్ అయినా, మిజోరాం అయినా, అస్సాం అయినా, మేఘాలయ అయినా, ఇక్కడి అద్భుతమైన దృశ్యాలను ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. అంతేకాదు, ఇక్క‌డి దృశ్యాల‌న్నీఓ అందమైన పెయింటింగ్‌లా ఉంటాయి. ఇక్క‌డి అందాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూడాలంటే ఒక‌టి రెండు రోజులు స‌రిపోవు. మేఘాల‌యలో అంద‌మైన ప్ర‌దేశాల‌కు కొద‌వేలేదు. ఈ ప్రాంతం కాలుష్య ర‌హిత ప్రాంతం కూడా.

ఇక్క‌డ కొన్ని ప్ర‌దేశాల‌కు వాటి ప్ర‌త్యేక‌త‌ల‌కు ప్ర‌సిద్ధిచెందాయి. ఇక్క‌డ జ‌రిగే ఫెస్టివ‌ల్స్‌కు ప్రపంచం నుంచే ప‌ర్యాట‌కులు త‌ర‌లివ‌స్తుంటారు. ఈ ఉత్స‌వాల‌లో అనేక రకాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. పర్యాటకులతో పాటు, దేశంలోని క‌ళాకారులే కాకుండా ప్రపంచంలోని కళాకారులు కూడా ఇందులో పాల్గొనడం విశేషం. మేఘాలయ భారతదేశంలో చాలా అద్భుతమైన ప్రదేశం, ఇక్కడ సహజ సౌందర్యం ప్రతిచోటా వ్యాపించి ఉంటుంది. శీతాకాలంలో ఈ ప్రాంతం సంద‌ర్శించేందుకు ఎంతో అనువైన‌ది. రండి ఇక్క‌డి ప్ర‌దేశాల గురించి తెలుసుకుందాం.

umngot river , meghalaya

ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం..

మేఘాల‌య‌లో ఆసియాలోనే అత్యంత ప‌రిశుభ్ర‌మైన గ్రామం ఉంది. ఇది బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో గల మాలినోంగ్‌ గ్రామం. ఇది ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరుగాంచింది. షిల్లాంగ్‌ నుంచి సుమారు రెండు గంటలు ప్రయాణం చేస్తే మలినోంగ్ గ్రామాన్ని చేరుకోవ‌చ్చు. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన లివింగ్ బ్రిడ్జిలు అద్భుతంగా ఉంటాయి. షిల్లాంగ్‌ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఓ ఫారెస్టు ఉంది. దాని పేరు మఫ్లాంగ్‌ సేక్రెడ్‌ ఫారెస్ట్‌. ఇది ఇక్కడ సంద‌ర్శించ‌ద‌గిన ప్రాంతాలలో ఒకటి.

ఈ గ్రామాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా చాలా అందంగా ఉంటాయి. తూర్పు ఖాసీ హిల్స్‌లో ఉన్న ఈ గ్రామంలో, రోడ్లపై లేదా ఇళ్ల చుట్టూ ఎక్కడా చెత్త కుప్పలు కనిపించవు. ఈ గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. వెదురు, కలప, చెట్ల ఆకులు ఇలాంటి సహజ పదార్థాలను మాత్ర‌మే ఇక్క‌డ విస్తృతంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇక్క‌డ జలపాతాలు, జీవన రూట్ వంతెనలు కూడా చూసే అవ‌కాశం ఉంటుంది.

ఫిబ్రవరి వరకు ఇక్క‌డ తీవ్రమైన చలి..

మేఘాలయలో నదులన్నీ వర్షాధారమ‌య్యి ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉమియం, క్యన్ఛియాంగ్‌, మావపా, ఉమియం, మైన్గోట్‌, వంటి మిండూ నదులు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌వి. మేఘాల‌య‌లోని దాకిలో ఉన్న ఉమాన్‌గోట్ నది ఎంతో స్వ‌చ్ఛంగా ఉంటుంది. ఇక్క‌డ బోటు ప్ర‌యాణం చేస్తుంటే గాల్లో తేలిన‌ట్లే ఉంటుంది. ఇక్క‌డ నీటి అడుగు భాగం అద్దంలో చూసినంత స్వచ్ఛంగా, స్పష్టంగా కనిపించ‌డమే ప్ర‌త్యేక‌త‌. ఈ నది ఇండో-బంగ్లాదేశ్‌ సరిహద్దున ప్రవహిస్తూ ఉంటుంది.

malinong cleanest village

చెట్ల వేళ్లతో నిర్మించిన వంతెనపై నడిచిన అనుభవం

మేఘాలయలో 180 సంవత్సరాల పురాతన లివింగ్ రూట్ వంతెనను చూడొచ్చు. దట్టమైన అడవులు, నది మధ్యలో నిర్మించిన ఈ వంతెన ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కానీ ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే మాత్రం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం సవాలుతో కూడుకున్న ప‌నే. అయితే, మేఘాలయలో ఇంకా ఇతర డబుల్ రూట్ వంతెనలు కూడా ఉన్నాయి. వీటిని సులభంగా చేరుకోవచ్చు. ఈ లివింగ్ రూట్ వంతెనను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో కూడా చేర్చ‌డం జ‌రిగింది.

ఎలా చేరాలి...

షిల్లాంగ్‌కు సుమారు 35 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉమ్రోయ్ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇక్కడికి చేరాలంటే హైదరాబాద్ నుంచి కనెక్టివ్ ఫ్లైట్లు అందుబాటులోఉన్నాయి. కోల్‌కతా లేదా గౌహతీ వరకు రైల్లో చేరుకుని అక్కడ నుంచి బస్సులో చేరుకోవ‌చ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+