Search
  • Follow NativePlanet
Share
» »బీహార్‌లోని ఈ హిల్‌స్టేష‌న్ల‌ను ఎప్పుడైనా చూశారా?

బీహార్‌లోని ఈ హిల్‌స్టేష‌న్ల‌ను ఎప్పుడైనా చూశారా?

బీహార్‌లోని ఈ హిల్‌స్టేష‌న్ల‌ను ఎప్పుడైనా చూశారా?

హిల్ స్టేషన్ల పేరు చెప్ప‌గానే చాలామందికి హిమాచల్ ప్రదేశ్ లేదా ఉత్తరాఖండ్ హిల్ స్టేషన్లు గుర్తుకు వస్తాయి. అయితే బీహార్‌లో కూడా హిల్ స్టేషన్లు ఉన్నాయ‌ని మీకు తెలుసా? అవును, ఒకటి కాదు ఇక్కడ చాలానే కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి వేసవిలో కూడా చ‌లికాలపు అనుభూతిని మీకందిస్తాయి. ఈ వేస‌విలో హిమాచ‌ల్ లేదా ఉత్త‌రాఖండ్‌ను సంద‌ర్శించ‌డం మాత్ర‌మే కాదు బీహార్‌లోని ఈ హిల్‌స్టేష‌న్లు కూడా ఒక‌సారి సంద‌ర్శించండి. చారిత్రాత్మకంగా మరియు సాంస్కృతికంగా ఎంతో ప్ర‌సిద్ధిచెందిన బీహార్‌లో రామ‌శిలా హిల్‌స్టేష‌న్ గురించే ఈ రోజు మ‌నం మాట్లాడుకుంటున్నాం.

ramshilahillstation1

రామశిలా హిల్ స్టేషన్

బీహార్‌లోని గయా నగరంలో చుట్టూ కొండప్రాంతాలు ఉన్నాయి. వీటికి భిన్నమైన చరిత్ర ఉంది. ఈ కొండలలో రామశిల కొండ ప్ర‌ముఖ‌మైన‌ది. ఇది చారిత్రాత్మకంగా మరియు సాంస్కృతికంగా ఎంతో ప్ర‌సిద్ధిగాంచింది. ఫల్గు నది ఒడ్డున విష్ణుపద్ మద్నీర్‌కు ఉత్తరాన 8 కిలోమీట‌ర్ల దూరంలో ఈ రామశిల కొండ ఉంది. దీని పేరు శ్రీరాముడితో ముడిపడి ఉందని ఇక్క‌డి వారు నమ్ముతారు. పురాతన కాలం నుండి అనేక రాతి శిల్పాలు ఇప్పటికీ ఈ కొండపై ఉన్నాయి.

రామేశ్వర్ లేదా పాతాలేశ్వర్ ఆలయం అని పిలువబడే కొండ పైన ఉన్న ఈ ఆలయం వాస్తవానికి 1014 AD లో నిర్మించబడింది. అయితే తరువాత ఈ ఆలయం అనేక సార్లు పునరుద్ధరించబడింది. ఆలయం ముందు క్రీ.శ. 1811లో కలకత్తాకు చెందిన శ్రీ కృష్ణ బసు నిర్మించిన మంటపం ఉంటుంది. ఇక్కడ పితృపక్ష సమయంలో హిందూ భక్తులు తమ పూర్వీకులకు పిండం సమర్పిస్తారు. ఇక్క‌డి కొండపై రాముడు, సీత మరియు హనుమంతుని విగ్రహాలను ప్రతిష్టించిన ఆలయాన్ని కూడా చూడొచ్చు.

రామశిల కొండ చుట్టూ ఉన్న ప్రదేశాలు విష్ణుపాద ఆలయం

ఈ ఆలయాన్ని 1787లో రాణి అహల్యాబాయి నిర్మించింది. ఇది చాలా అందమైన మతపరమైన ప్రదేశం. ఇది మూడు వైపులా నీటితో చుట్టుముట్టబడి ఉంది. 40 సెంటీమీటర్ల పొడవున్న విష్ణుమూర్తి పాదముద్ర కూడా ఈ ఆలయంలో ఉంది.

thaimonastery

థాయ్ మొనాస్టరీ

బుద్ధగయలోని థాయ్ మొనాస్టరీ విశిష్టమైన నిర్మాణానికి మరియు అందానికి ప్రసిద్ధి చెందింది. ఇది బంగారు పలకలతో కప్పబడిన వాలుగా ఉన్న పైకప్పును కలిగి ఉంది. 25 మీటర్ల ఎత్తైన బుద్ధుని కాంస్య విగ్రహాన్ని ఈ ప్రాంతంలో చూడొచ్చు. ఈ ప్రాంతం యోగా, ధ్యానానికి ప్ర‌సిద్ధి. యోగా, ధ్యానంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు.

barabarcave

బరాబర్ గుహ

గయ సమీపంలో ఉన్న బరాబర్ గుహలు వాటి పురాత‌న‌మైన చ‌రిత్ర‌ను క‌లిగిన్నాయి. ఈ గుహలు 2వ శతాబ్దంలో స్థాపించ‌బ‌డ్డాయి. ఇక్క‌డి ప్రతి గుహలో పూర్తిగా గ్రానైట్‌తో కత్తిరించిన రెండు గదులను చూడొచ్చు. ఇక్క‌డి అన్ని గుహలు భారీ తోరణాలను కలిగి ఉంటాయి.

ramshilahill

రామశిలా కొండకు ఎలా చేరుకోవాలి

గయాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గయా అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. భారతదేశంలోని అనేక నగరాల ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోల్‌కతా నుండి విమానాలు బయలుదేరుతాయి. గయా రైల్వే స్టేషన్ నుండి రాజధాని, శతాబ్ది మరియు సంపర్క్ క్రాంతి వంటి రైళ్లు ఢిల్లీ, ముంబై మరియు ఇతర నగరాల నుండి నేరుగా నడుస్తాయి. గ‌యా నుండి నేరుగా బ‌స్సులు కూడా అందుబాటులో ఉంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+