Search
  • Follow NativePlanet
Share
» »కేర‌ళ‌లోని ఈ ప్ర‌సిద్ధ ప్రాంతాల‌ను ఎప్పుడైనా సంద‌ర్శించారా?

కేర‌ళ‌లోని ఈ ప్ర‌సిద్ధ ప్రాంతాల‌ను ఎప్పుడైనా సంద‌ర్శించారా?

కేర‌ళ‌లోని ఈ ప్ర‌సిద్ధ ప్రాంతాల‌ను ఎప్పుడైనా సంద‌ర్శించారా?

కేరళ చాలా అందమైన రాష్ట్రం. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ పర్యాటకుల రద్దీ చాలా ఎక్కువ‌గా ఉంటుంది. కేరళను దేవతల భూమి అని కూడా అంటారు. ఇక్కడి పర్యాటక ఆకర్షణలు టూరిస్టులకు ఎప్పటికీ మరపురాని విధంగా ఉంటాయి. ఈ స్వర్గ భూమిలో అనేక హిల్ స్టేషన్లు, బ్యాక్ వాటర్స్, బీచ్ లు, వన్యప్రాణి అభయారణ్యాలు, వాణిజ్య నగరాలు, అందమైన కుగ్రామాలు చాలానే ఉన్నాయి. కుటుంబంతో హాలిడేకు వెళ్లాలనుకునే వారు, కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌లు, ఒంట‌రిగా విహ‌రించాల‌నుకునేవాళ్లు, త‌ప్ప‌కుండా ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించొచ్చు. కాబట్టి కేరళలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

మున్నార్

కేరళలోని అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో మున్నార్ ఒకటి. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 6000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ పర్వత పట్టణం పర్యాటకులను ఎంత‌గానో ఆకర్షిస్తుంది. ఇక్కడి వాతావరణం తేయాకు తోటల సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ దాదాపు 80,000 మైళ్లలో తేయాకుకు సాగు చేస్తున్నారు. సాహ‌స ప్రియుల‌కు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది. బ‌స చేసేందుకు మున్నార్‌లో అనేక హోటళ్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం అక్టోబ‌ర్ నుంచి మార్చివ‌ర‌కు సంద‌ర్శ‌న‌కు ఎంతో అనువైన‌ది.

Fortkochi view

ఫోర్ట్ కొచ్చి

ఫోర్ట్ కొచ్చిని ఓల్డ్ కొచ్చి లేదా వెస్ట్ కొచ్చి అని కూడా అంటారు. ఇక్క‌డ కాలినడకన సంద‌ర్శ‌న ప‌ర్యాట‌కుల‌కు ఎంతో మ‌ధురాను భూతిని క‌లిగిస్తుంది. ఇక్కడ ఉన్న డచ్ ప్యాలెస్ చాలా ప్రసిద్ధి చెందింది. కేరళ వెళ్లే పర్యాటకులు ఫోర్ట్ కొచ్చిను తప్పక చూసి తీరాలి. అరేబియన్ రాణిగా కూడా ఇది పిలువబడుతుంది. చరిత్ర, వారసత్వం, విభిన్న సంస్కృతుల కలయిక గల నగరం ఇది. ప్రకృతి ప్రేమికులకు, చరిత్ర పట్ల ఆసక్తి గలవారికి కేరళలో చూడాల్సిన ఉత్తమమైన పర్యాటక ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్క‌డ సంద‌ర్శించేందుకు ఎన్నో ప్ర‌దేశాలు ఉన్నాయి.

Wayanad view

వాయనాడ్

వాయనాడ్ చాలా అందమైన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. చారిత్రక గుహలు, జలపాతాలు మరియు అనేక పర్యాటక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. కేరళలో పచ్చదనంతో ఆకట్టుకునే ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ అధిక మోతాదులో వరి పొలాలు కనిపిస్తాయి. ప్రకృతి అందాలతో పాటు ఉత్కంఠభరితమైన సాహసాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్రాంతంలో దాదాపు 50 తెగల గిరిజనులు నివసిస్తున్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి నీలకురింజి పూలు ఇక్క‌డ పూస్తాయి. ఈ ప్రాంతం అక్టోబ‌ర్ నుంచి మే వ‌ర‌కు సంద‌ర్శ‌న‌కు ఎంతో అనువైన‌ది.

Alleppey view

అలెప్పి

అలెప్పీ కేరళలో సందర్శించడానికి అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. ఏడాది పొడవునా ఇక్కడ పర్యాటకుల రద్దీ ఉంటుంది. ఈ బీచ్ వాలీబాల్, సర్ఫింగ్ వంటి కార్యకలాపాలకు సరైన ఎంపికగా పరిగణించబడుతుంది. కేరళలోని అలెప్పీను 'వెనిస్ ఆఫ్ ది ఈస్ట్' అని కూడా పిలుస్తారు. ఇక్కడ అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాక్ వాటర్స్ లో హౌస్ బోట్ షికారు, అందులో బస ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఇంకా ఇక్క‌డ మరారి బీచ్, అంబలప్పుజలోని శ్రీ కృష్ణ ఆలయం, పున్నమడ సరస్సు, కృష్ణపురం ప్యాలెస్, అలప్పుజ బీచ్, కరుణాకరన్ మ్యూజియం, పతిరమనల్ మొదలైన ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతం సెప్టెంబ‌ర్ నుంచి మే వ‌ర‌కు సంద‌ర్శ‌న‌కు ఎంతో అనువైన‌ది.

More News

Read more about: kerala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+