Search
  • Follow NativePlanet
Share
» »హరియాళీ తీజ్ సంద‌ర్భంగా యూపీలోని ఫేమ‌స్ శివాల‌యాలను సంద‌ర్శించాల్సిందే..!

హరియాళీ తీజ్ సంద‌ర్భంగా యూపీలోని ఫేమ‌స్ శివాల‌యాలను సంద‌ర్శించాల్సిందే..!

నేడు ఆగ‌స్టు 7. అంటే హరియాళీ తీజ్. ఇవాళ చాలామంది మ‌హాశివున్ని ఎంతో భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో కొలుస్తారు. ఈ సంద‌ర్బంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌సిద్దిచెందిన పురాత‌న శివాలయాలు చూసి రావాల్సిందే. ఈ ఆల‌యాలు అనేక మూఢ విశ్వాసాలను క‌లిగి ఉన్నాయి. ఈ పురాత‌న ఆలయాల చరిత్ర కూడా రామాయణ కాలంతో ముడిపడి ఉందని ఇక్క‌డివారు చెబుతుంటారు. సాధారణ రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ తీజ్, పండుగల సంద‌ర్భంలో మాత్రం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. హరియాలీ తీజ్ సంద‌ర్బంగా ఇక్క‌డి శివాల‌యాల‌ను త‌ప్ప‌క వీక్షించాల్సిందే..

హరియాలీ తీజ్ పండుగ సంద‌ర్భంగా నేడు చాలామంది వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం వంటి దీక్ష‌లు పాటిస్తారు. అంతేకాదు, ఎంతో భ‌క్తితో శివుడిని పూజిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని ఈ ఆల‌యాలు రామాయణంతో ముడిపడి ఉన్న పురాతన శివాలయాలుగా ఇక్క‌డివారు చెబుతున్నారు. కాబ‌ట్టి త‌ప్ప‌కుండా ఈ పురాతన శివాలయాలను తెలుసుకోవాల్సిందే. ఈ శివాల‌యాల‌ను సందర్శించేందుకు ప్రతి ఏటా భక్తులు సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు. రండి ఆ ఆల‌యాలేంటో చూసేద్దాం..

kashivishwanath

కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, బనారస్

కాశీ విశ్వనాథ దేవాలయం ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని పురాతన నగర‌మైన‌ బనారస్‌లోని విశ్వనాథ్ గలిలో ఉంటుంది. ఈ ఆలయం శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడ విష్ణువు, బ్రహ్మ విగ్ర‌హాలు ఉంటాయి. శివుడు భారీ జ్యోతిర్లింగ రూపంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తుంటాడు. కాశీ విశ్వనాథ్ శివునికి అత్యంత ఇష్టమైన ప్రదేశం. అందుకే చాలామంది ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించేందుకు త‌ర‌లివ స్తుంటారు. ఇక్క‌డిక వ‌చ్చిన వారి స‌ల పాపాలు తొల‌గి ఆత్మ పవిత్రమవుతుందని స్థానికుల ప్ర‌గాఢ విశ్వాసం. హరియాలీ తీజ్ సంద‌ర్భంగా ఇక్కడ విభిన్నమైన వైభవాన్ని చూడొచ్చు.

గోలా గోకర్నాథ్ ఆలయం, లఖింపూర్ ఖేరి

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలోని గోల గోకర్నాథ్ పురాత‌న‌ శివాలయం శివ భక్తుల విశ్వాసానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది. దీనినే ఛోటీ కాశీ అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయ శివలింగ కథ రామాయణ కాలానికి సంబంధించినదని స్థానికులు చెబుతుంటారు. సాధార‌ణ రోజుల్లో కాకుండా ఇక్క‌డ పండుగ‌లు, ఉత్స‌వాల స‌మ‌యంలో భక్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంది. హరియాళీ తీజ్, నాగ పంచమి, శివరాత్రి రోజుల్లో ఇక్క‌డ భ‌క్తులు బారులు తీరుతారు.

gomuteshwar1

గర్ముక్తేశ్వర్, పురాతన శివాలయం

గర్ముక్తేశ్వర్ ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో గంగా నది ఒడ్డున వెలసింది. ఇది కార్తీక స్నాన జాతరకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏడాది పొడవునా భక్తుల రద్దీ కొన‌సాగుతూనే ఉంటుంది. యూపీలోని గర్హ్‌ముక్తేశ్వర్‌లో ఉన్న ఆలయాన్ని పురాతన గంగా దేవాలయం అని కూడా అంటారు. హరియాలీ తీజ్, నాగపంచమి సందర్భంగా దర్శనం కోసం ఇక్కడకు భ‌క్తులు రావొచ్చు.

lodheshwarmahadevtemple1

లోధేశ్వర్ మహాదేవ్ ఆలయం

లోధేశ్వర్ మహాదేవ్ ఆలయం యూపీలోని బారాబంకి జిల్లా, రామ్ నగర్ తహసీల్‌లోని మహదేవ గ్రామంలో ఉన్న ఒక హిందూ శివాలయం. ఇది ఎంతో ప్ర‌సిద్ధిచెందిన ఆల‌యం. యుధిష్ఠిరుడు ఈ ఆలయాన్ని స్థాపించాడని ఇక్క‌డివారు చెబుతుంటారు. శివుని ప్రత్యేక రోజున దర్శించుకోవడానికి ఇక్క‌డికి వస్తుంటారు.

More News

    Read more about: hariyali teej festivals
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+