Search
  • Follow NativePlanet
Share
» »విశాఖ తీరంలో ఫేమ‌స్‌ స్ట్రీట్ ఫుడ్ లోకేష‌న్స్‌.. మీకోసం!

విశాఖ తీరంలో ఫేమ‌స్‌ స్ట్రీట్ ఫుడ్ లోకేష‌న్స్‌.. మీకోసం!

అందాల విశాఖ న‌గ‌రం అద్భుతమైన బీచ్‌లకు మాత్రమే కాకుండా.. రుచికరమైన సముద్రపు ఆహారానికి కూడా ప్రసిద్ధి చెందిందని చాలామందికి తెలియ‌క‌పోవ‌చ్చ‌. వైజాగ్‌లో చాలా ప్రదేశాలు నోరూరించే రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను అందిస్తున్నాయి. అయితే, మీరు చౌకైన.. వినూత్న రుచుల‌ను ఆస్వాదించాలంటే మాత్రం విశాఖ‌లో ఈ స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయాల్సిందే. ఇక్క‌డి తోపుడు బండ్లు, ఫుడ్ ట్రక్కులు, స్టాల్స్ మిమ్మ‌ల్ని ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి. ఇవి వేడి వేడి నోరూరించే సీఫుడ్‌ను నేరుగా మీ ప్లేట్‌ల‌లో ఇట్టే ఇమిడిపోతాయి. కాబట్టి, వైజాగ్‌లోని కొన్ని అత్యుత్తమ స్ట్రీట్ ఫుడ్ పాయింట్‌ల‌ను ఇక్కడ మీకు పరిచ‌యం చేయ‌బోతున్నాం. విశాఖ‌లో అడుగుపెడితే మాత్రం మీరు ఫుడ్ త‌ప్ప‌కుండా ప్రయత్నించండి!

ahabeachbites

ఆహా బీచ్ బైట్స్

స‌ముద్ర‌పు చేపలు, పీతలు కాకుండా ప్ర‌త్యేక‌మైన సీఫుడ్ వంట‌కాల‌కు పేరుపొందిన‌ ఏకైక స్ట్రీట్ ఫుడ్ పాయింట్ ఆహా బీచ్ బైట్స్‌. ఇక్క‌డ‌ సముద్ర ఆహార ప్రియులు త‌మ నోటికి ప‌నిచెప్ప‌కుండా ఉండ‌లేరు. ఎండ్రకాయల నుండి స్క్విడ్ ఫిష్‌ వరకు, ఆక్టోపస్ నుండి మచ్చల కొడవలి చేప వరకు ఈ దుకాణం మిమ్మ‌ల్ని ప‌ల‌క‌రించ‌ని రుచులు ఉండ‌వు. ఇక్క‌డి ప్రతి వంట‌కం కూడా కస్టమర్‌ల ఆర్డర్‌పై వెంట‌వెంట‌నే తయారు చేయబడుతుంది. తాజాగా కట్ చేసిన సీ ఫుడ్ వంట‌కాలు ఇక్క‌డ అందుబాటులో ఉంటాయి. ఈ ఆహా బీచ్ బైట్స్‌ YMCA పార్కింగ్ ద‌గ్గ‌రి ఎన్టీఆర్ బీచ్ రోడ్‌లో కిర్లంపూడి లేఅవుట్ వ‌ద్ద సంద‌డి చేస్తుంది.

EAT MORE BBQ

ఈట్ మోర్ BBQ ఇతర రుచికరమైన వివిధ రకాల చేపల డిష్‌ల‌ను అందించడం ద్వారా దాని పేరుకు తగ్గట్టుగా ప్ర‌సిద్ధి చెందింది. మీరు క్వాయిల్ ఫ్రై, చికెన్ వింగ్స్, చికెన్ పాప్‌కార్న్ లేదా చికెన్ స్ట్రిప్స్‌ని ఇష్టపడేవారైతే మాత్రం ఈ స్టాల్‌ను అస్సలు మిస్స‌వ్వొద్దు. బార్రాముండి (పండుగప్ప), రెడ్ స్నాపర్, కింగ్ మాకేరెల్, ఇండియన్ సాల్మన్, అపోలో, డ్రై ఆంకోవీస్, రొయ్యలు (కబాబ్ మరియు ఫ్రై), పీతల వంట‌కాల ఘుమ‌ఘుమ‌లు ఇక్క‌డి వీధుల‌ను ర‌ద్దీగా మార్చేస్తాయి. ఈ వంటలను తవా గ్రిల్‌పై వేయించమని లేదా నూనెను ఉపయోగించమని మీరే మీ అభిప్రాయాన్ని తెల‌ప‌వ‌చ్చు. మీ ప్రాధాన్యతను బట్టి టమోటో మరియు పుదీనా చట్నీతో వడ్డిస్తారు.

చిరునామా: నైట్ ఫుడ్ స్ట్రీట్, వైఎస్ఆర్ సెంట్రల్ బ్యాక్‌సైడ్, ఓల్డ్ జైలు రోడ్, ద్వారకా నగర్

shawarmastation1

షావర్మా స్టేషన్

అరటి ఆకుతో చుట్ట‌బ‌డే ప్రత్యేకమైన తవా ఫిష్ ఫ్రైతో మంచి పేరు సంపాదించింది షావర్మా స్టేషన్. వైజాగ్‌లోని అరుదైన సీఫుడ్ స్ట్రీట్ పాయింట్‌ల‌లో ఇలాంటి ప్ర‌త్యేక‌మైన వంట‌కాల‌ను అందించ‌డం ద్వారా షావ‌ర్మా స్టేష‌న్ ముందు ఆహార‌ప్రియుల‌ను ఆక‌ర్షిస్తోంది. మీరు ఎంచుకోగల వివిధ రకాల చేపలను చూడొచ్చు. కింగ్ మాకేరెల్, బార్డ్ స్పానిష్ మాకేరెల్ (కోణం), పాంఫ్రెట్, బర్రాముండి (పండుగప్ప) చేపలు ఇక్క‌డ సంద‌డి చేస్తాయి. వీరి రెసిపీలో చేపలను సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో మెరినేట్ చేయడం, అరటి ఆకులలో చుట్టడం ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటుంది. నూనె ప్ర‌భావాన్ని తగ్గించేందుకు అరటి ఆకు చుట్ట‌డం ఈ రుచిని మ‌రింత పెంచుతుంది.

చిరునామా: నైట్ ఫుడ్ స్ట్రీట్, వైఎస్ఆర్ సెంట్రల్ బ్యాక్‌సైడ్, ఓల్డ్ జైలు రోడ్, ద్వారకా నగర్

fishcanteen

ఫిష్ క్యాంటీన్

ఫిష్ క్యాంటీన్ అనేది సీ ఫుడ్ ప్రియులు వైజాగ్‌లో తప్పక సందర్శించవలసిన ప్రదేశం. క్రాబ్ ఫ్రై, పాంఫ్రెట్ ఫ్రై, రొయ్యల ఫ్రై, మాకేరెల్ ఫ్రై లాంటి మ‌రెన్నో ప్ర‌త్యేక‌మైన వంట‌కాలు మీ నోరూరిస్తాయి. చికెన్ జాయింట్‌లు, చికెన్ ఫ్రై, చికెన్ పకోరస్, నూడుల్స్, ఫ్రైడ్ రైస్ వంటి ఇతర ఆహార ప‌దార్థాలు ఈ ఫిష్ క్యాంటీన్ పేరును ప్ర‌చారంలోకి తెచ్చాయి. నెట్స్ నుండి తాజాగా తీసుకువచ్చిన ఈ వంటకాలు నిమ్మకాయ, ఉల్లిపాయలతో అలంక‌రించి మ‌రీ వడ్డిస్తారు. సుగంధ ద్రవ్యాలు, పిండితో మెరినేట్ చేయబడిన వంట‌కాల శుభ్ర‌త విష‌యంలో రాజీ ప‌డిన‌ట్లు ఎక్క‌డా క‌నిపించ‌దు. ఈ స్టాల్ ఉదయం 11:00 నుండి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది. ఆర్‌కే బీచ్‌కి ఆనుకుని ఈ పాయింట్ ఆక‌ర్షిస్తోంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+