నిక్ నేమ్ .. దీనినే తెలుగులో 'మారుపేరు' లేదా 'ముద్దుపేరు' అని అంటారు. నిక్ నేమ్ అన్నవి మనుషులకు, ప్రాంతానికి లేదా వస్తువులకు పెడుతుంటారు. పరిచయస్తులు లేదా బాగా కావలసినవారు లేదా తెలిసినవారు నిక్ నేమ్ లతో పిలుస్తుంటారు. కొన్ని సార్లు పొడవాటి పేర్లున్న వారికి కూడా నిక్ నేమ్ లు వాడుతుంటారు.
చాలా వరకు స్టార్ డమ్ ఉన్న సెలెబ్రిటీ ల అభిమానులు, తమకిష్టమైన హీరో హీరోయిన్ల ముద్దుపేర్లు తెలుసుకోవటానికి ఇష్టపడుతుంటారు. మరికొందరు వాటితోనే స్టార్ లు అయిపోతుంటారు. ఉదాహరణకు నాని - నవీన్ బాబు, చలాకి చంటి - వినయ్ మోహన్ లాగన్నమాట. అలానే భారతదేశంలో కూడా కొన్ని ప్రదేశాలకు, ప్రాంతాలకు నిక్ నేమ్ లు ఉన్నాయి. ఇదివరకే మీరు ఎపి, తెలంగాణ రాష్ట్రాలలోని కొన్ని పట్టణాలకు మారుపేర్లు తెలుసుకున్నారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న కొన్ని ప్రధాన నగరాలకు గల మారుపేర్ల గురించి తెలుసుకుందాం ..!

బెంగళూరు
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు. ఇక్కడ సందర్శించటానికి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో బెంగళూరు ప్యాలెస్, లాల్ బాగ్, విధాన సౌధ, బుల్ టెంపుల్, దొడ్డ గణేశ టెంపుల్ మరియు మొదలుగునవి. షాపింగ్ మాల్స్, గోల్ఫ్ క్రీడామైదానాలు, ఉద్యానవనాలు, వాణిజ్య వీధులు కూడా పర్యాటకులను అలరిస్తాయి.
బెంగళూరు నగరానికి మారుపేర్లు : ఎలక్ట్రాన్ సిటీ ఆఫ్ ఇండియా, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, స్పేస్ సిటీ, సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ, పెన్షనర్డ్ ప్యారడైజ్, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.
చిత్రకృప : Swaminathan

చెన్నై
చెన్నై తమిళనాడు రాష్ట్ర రాజధాని మరియు కోరమాండల్ తీరంలో ఉన్నది. బీసెంట్ నగర బీచ్, జగన్నాథ టెంపుల్, కపాలీశ్వర టెంపుల్, మెరీనా బీచ్ మొదలుగునవి ఇక్కడ చూడవచ్చు. షాపింగ్ మాల్స్, వాణిజ్య వీధులు యాత్రికులను అలరిస్తాయి.
నిక్ నేమ్ : మద్రాస్, చెన్నపట్నం, సౌత్ ఇండియన్ కల్చరల్ సిటీ, డెట్రాయిట్ అఫ్ ఆసియా, ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా, హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.
చిత్రకృప : Thangaraj Kumaravel

కోయంబత్తూర్
కోయంబత్తూర్ తమిళనాడు రాష్ట్రంలో రెండవ పెద్ద నగరం. కోవై కుట్రాలం, పట్టీశ్వర్ టెంపుల్, అజియార్ డ్యాం, ధ్యాన్ లింగ టెంపుల్, ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ మొదలుగునవి చూడదగ్గవి.
మారు పేరు : మాంచెస్టర్ అఫ్ సౌత్ ఇండియా, టెక్స్ టైల్స్ సిటీ ఆఫ్ ఇండియా.
చిత్రకృప : Vijayasarathi R

హైదరాబాద్
తెలంగాణ, ప్రస్తుత ఎపి రాజధాని ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఇక్కడ చార్మినార్ దగ్గరి నుంచి గోల్కొండ వరకు చూడవలసినవి, చేయవలసినవి ఎన్నో ఉన్నాయి.
నిక్ నేమ్ : హైటెక్ సిటీ, ముత్యాల నగరం, సిటీ ఆఫ్ నిజామ్స్, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ బిర్యాని.
చిత్రకృప : Debajyoti Das

ఆగ్రా
ఢిల్లీ కి 180 కి. మీ ల దూరంలో ఆగ్రా కలదు. ఇక్కడ ప్రపంచ అద్భుత కట్టడాలతో ఒకటైన తాజ్ మహల్ కలదు.
నిక్ నేమ్ : తాజ్ నగరి.
చిత్రకృప : Dennis Jarvis

అహ్మదాబాద్
అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో కలదు. ఈ నగరంలో చరిత్రక ఆనవాళ్ళను, అధునాతన మాల్స్ చూడవచ్చు.
నిక్ నేమ్ : బోస్టన్ ఆఫ్ ఇండియా, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా.
చిత్రకృప : Emmanuel DYAN

అలహాబాద్
అలహాబాద్ యూపీలోని పెద్ద నగరాలలో ఒకటి. ఇది హిందువుల ధార్మిక స్థలం. ఇక్కడ దర్శించటానికి అనేక దేవాలయాలు ఉన్నాయి.
నిక్ నేమ్ : దేవుని నివాసం, సంగం సిటీ, సిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్.
చిత్రకృప : Lokankara

అమృత్ సర్
అమృత్ సర్ పంజాబ్ రాష్ట్రంలో కలదు. ఇది సిక్కుల పవిత్ర క్షేత్రం. ప్రసిద్ధి చెందిన స్వర్ణ దేవాలయం ఇక్కడ కలదు.
నిక్ నేమ్ : గోల్డెన్ సిటీ.
చిత్రకృప : Soman

జైపూర్
భారతదేశంలోని పురాతన నగరమైన జైపూర్ ను పాక్షిక ఎడారి ప్రాంతంలో అంబర్ మహారాజు, రెండవ మహారాజ సవాయి జై సింగ్ బెంగాల్ కు చెందిన వాస్తు శిల్పి విద్యాధర్ భట్టాచార్య సహాయంతో నిర్మించాడు.
నిక్ నేమ్ : పింక్ సిటీ, పారిస్ ఆఫ్ ఇండియా, సిటీ ఆఫ్ ప్యాలెస్.
చిత్రకృప : Chirag Pai

జంషెడ్ పూర్
జంషెడ్ పూర్ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద నగరం. ఇక్కడ ప్రసిద్ధి చెందిన జంషెడ్ జీ టాటా స్థాపించిన స్టీల్ ఫ్యాక్టరీ కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది.
మారుపేర్లు : స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా, పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా, టాటానగర్.
చిత్రకృప : Alf van Beem

కోల్కతా
కోల్కతా దేశంలో ప్రసిద్ధి చెందిన నాలుగు నగరాలలో ఒకటి మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని. ఇక్కడ విక్టోరియా మహల్, ఈడెన్ గార్డెన్, హౌరా బ్రిడ్జి, పార్క్ స్ట్రీట్, ఇండియన్ మ్యూజియం, ఆడిటోరియం మొదలుగునవి చూడవచ్చు.
నిక్ నేమ్ : సిటీ ఆఫ్ జాయ్, సిటీ అడ్డు ప్యాలెస్, భారతదేశ సాంస్కృతిక రాజధాని, గేట్ వే ఆఫ్ ఈస్టర్న్ ఇండియా, హెవెన్ ఆఫ్ ఏజ్డ్.
చిత్రకృప : VnGrijl

కొల్హాపూర్
కొల్హాపూర్ మహారాష్ట్ర రాష్ట్రంలో కలదు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మి దేవి ఆలయం కలదు. జ్యోతిబా టెంపుల్, రాధానగరి డ్యాం లకు కూడా వెళ్ళిరావచ్చు.
నిక్ నేమ్ : సిటీ ఆఫ్ రెస్ట్లెర్ (కుస్తీ), దక్షిణ కాశీ.
చిత్రకృప : Ankur P

కొల్లామ్
కొల్లామ్ కేరళ రాష్ట్రంలో కలదు. అష్టమూడి సరస్సుకు సమీపంలో ఉండటంతో ఈ నగరం పర్యాటకంగా ప్రసిద్ధి చెందినది. హౌస్ బోట్, బీచ్, ప్యాలెస్ లు మొదలుగునవి చూడదగ్గవి.
మారు పేరు : ప్రపంచపు జీడిపప్పులు రాజధాని, ప్రిన్స్ ఆఫ్ అరేబియన్ సీ, గేట్ వే ఆఫ్ బ్యాక్ వాటార్స్.
చిత్రకృప : albert

లక్నో
లక్నో - ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. మసీదులు, ప్యాలెస్ లు, చారిత్రక కట్టడాలు తప్పక సందర్శించాలి. స్థానిక రుచులు నోరూరిస్తాయి.
మారుపేర్లు : సిటీ ఆఫ్ నవాబ్స్, షిరాజ్-ఈ- హింద్, కాన్స్టాంటినోపుల్ ఆఫ్ ఈస్ట్, ది గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా.
చిత్రకృప : Prasoonmaheshwari

మధురై
మధురై తమిళనాడు దక్షిణ భాగంలో ఉన్నది. ఇక్కడ మీనాక్షి ఆలయం ప్రసిద్ధి చెందినది.
మారుపేర్లు : ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్, పండుగల నగరం, సిటీ ఆఫ్ ఫోర్ జుంక్షన్స్, టెంపుల్ సిటీ, స్లీప్లెస్ సిటీ.
చిత్రకృప : McKay Savage

మంగళూరు
మంగళూరు కు ఒకవైపు అరేబియా సముద్రం మరోవైపు పశ్చిమ కనుమలు వన్నె తెచ్చాయి. ప్రకృతి ఆస్వాదకులకు ఇదొక స్వర్గం.
నిక్ నేమ్ : కార్డ్లె ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్, గేట్ వే ఆఫ్ కర్ణాటక, రోమ్ ఆఫ్ ది ఈస్ట్, పెట్రో కెమికల్ క్యాపిటల్ అఫ్ సౌత్ ఇండియా, ఐస్ క్రీమ్ క్యాపిటల్ అఫ్ ఇండియా, పశ్చిమ తీర ఆభరణం, వంటల నగరం.
చిత్రకృప : Nithin Bolar k

ముంబై
చిత్రకృప : ShadesofIndiaముంబై దేశంలో ఢిల్లీ తర్వాత అతిపెద్ద నగరం మరియు మహారాష్ట్ర రాజధాని. బీచ్ లు, గేట్ వే ఆఫ్ ఇండియా, విక్టోరియా టర్మినల్, సిద్ధి వినాయక మందిర్ మొదలుగునవి చూడదగ్గవి.
నిక్ నేమ్ : ఏడు దీవుల నగరం, గేట్ వే ఆఫ్ ఇండియా, హాలీవుడ్ ఆఫ్ ఇండియా, మాయ నగరం, కలల నగరం, హాలీవుడ్ ఆఫ్ ఇండియా, మాక్సిముమ్ సిటీ.
చిత్రకృప : ShadesofIndia

వడోదర
విశ్వామిత్ర నది ఒడ్డున ఉన్న వడోదర లేదా బరోడా, ఒకప్పుడు గైక్వాడ్ రాష్ట్ర రాజధాని. ఇక్కడ సందర్శించవలసిన రాచరిక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. పండుగలకు వడోదర ప్రసిద్ధి.
నిక్ నేమ్ : సంస్కృతి నగరం, సంస్కారి నగరి, బన్యన్ సిటీ, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ గార్భా, భారతదేశపు విద్యుత్ పరికరాల తయారీ కేంద్రం.
చిత్రకృప : Emmanuel DYAN

ఉదయపూర్
బ్రహ్మాండమైన కోటలకి, గుళ్ళకు, సరస్సులకు, రాజ భవనాలకు, మ్యూజియాలకు, అభయారణ్యాలకు ప్రసిద్ధి ఉదయపూర్.
నిక్ నేమ్ : శ్వేత నగరం, సరస్సుల గరం, వెనిస్ ఆఫ్ ది ఈస్ట్.
చిత్రకృప : TeshTesh



Click it and Unblock the Notifications