వైజాగ్ సమీపంలోని ఐదు వేసవి విడిది కేంద్రాలు
వేసవి కాలం వచ్చేసింది. చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. అందుకే ఇది రాబోయే వేడి ఉష్ణోగ్రతల నుండి తప్పించుకోవడానికి వైజాగ్ ప్రజలు ప్రయాణానికి సద్ధమవ్వాల్సిన సమయం ఇది. వైజాగ్‌కు సమీపంలో వేసవి విడిది కోసం అత్యంత ప్రజాదరణ పొందిన ప్రదేశాలను మేం అన్వేషించాం. ఇవి వైజాగ్ నుండి కొన్ని గంటల ప్రయాణంలోనే చేరుకోగలిగే ప్రకృతిసిద్ధమైన సందర్శనీయ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. వేసవి వేడి నుండి త్వరగా రిలాక్స్ అయ్యేందుకు వైజాగ్ సమీపంలోని ఐదు వేసవి విడిది కేంద్రాల విశేషాలు మీకోసం.

లంబసింగి
ఆంధ్ర ప్రదేశ్ కాశ్మీర్ అని పిలువబడే హిల్ స్టేషన్ లంబసింగి. ఈ హిల్ స్టేషన్ మేఘాలతో నిండిన ఉదయాలకు అత్యంత ప్రసిద్ధి చెందింది. మండు వేసవిలో సైతం ఉదయపువేళ చల్లని మేఘాలు మిమ్మలని ఆత్మీయంగా పలకరిస్తాయి. స్నేహితులతో క్యాంపింగ్ ట్రిప్‌కు కూడా ఇది మంచి ఎంపిక. వేసవి సమీపిస్తున్నందున ఈ గమ్యస్థానం సరైన విశ్రాంతి ప్రదేశంగా చెప్పబుడుతోంది. విశాఖపట్నం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకునేందుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు.

చింతపల్లి
పచ్చని కొండలతో దట్టమైన అటవీప్రాంతమే చింతపల్లి. మీరు అడవులను ప్రేమించేవారైతే మాత్రం జర్నీ చేసేందుకు చింతపల్లి సరైన ఎంపిక. అడుగడుగునా ప్రకృతి అందాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అంతేకాదు, కొన్ని అరుదైన జీవులను దగ్గరగా చూసే అవకాశం కూడా దొరుకుతుంది. స్థానిక గిరిజనుల జీవనశైలి మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. మీరు రోజంతా ప్రకృతి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపాలి అనుకుంటే సమీపంలోని కోటిపల్లి రిజర్వాయర్ బోటింగ్ మరియు కయాకింగ్‌లను ఆస్వాదించవచ్చు.

అనంతగిరి
అరకు లోయకు అతి సమీపంలో ఉన్న ఈ కాఫీ స్వర్గం అనేక జలపాతాలకు నిలయం. ఈ హిల్ స్టేషన్ వైజాగ్ సమీపంలోని ఇతర వేసవి గమ్యస్థానాల వలె రద్దీగా ఉండదు. పచ్చని పూదోటలా స్వాగతం పలికే కాఫీ తోటలు అదరపు ఆకర్షణగా నిలుస్తాయి. వైజాగ్ నుండి 100 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న అనంతగిరి ఏకాంత ప్రదేశాలను ఇష్టపడే వారికి మరియు మంచి వాతావరణాన్ని కోరుకునే వారికి మంచి ఎంపిక.

పాపికొండలు
వైజాగ్ సమీపంలోని అత్యుత్తమ హిల్ స్టేషన్‌లలో ఒకటి పాపికొండలు. నది వెంబడి ఒక్కసారిగా కదులుతున్న పర్వతాల యొక్క ఆప్టికల్ ఇల్యూషన్ మాటల్లో చెప్పలేని అనుభవం. పాపికొండలు జాతీయ ఉద్యానవనం, గోదావరిపై పడవ ప్రయాణం మరియు గండి పోచమ్మ దేవాలయం వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నందున, ఈ ప్రదేశానికి మీ వారాంతపు పర్యటన ఉత్కంఠభరితమైన దృశ్యమాన అనుభూతిని కలిగిస్తుంది. వైజాగ్ నుండి ప్రయాణం నాలుగు గంటల కంటే తక్కువ సమయం పడుతుంది.
దేవమల్లి
ఒడిశాలోని దక్షిణ ప్రాంతంలో ఉందీ పర్వత శిఖరం. వైజాగ్ నుండి ఐదు గంటల ప్రయాణం కంటే ఎక్కువ దూరం కాదు. దేవమల్లి సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, వేసవి తాపాన్ని తప్పించుకుంటూ విశ్రాంతి తీసుకోవడానికి ఇది అద్భుతమైన ప్రదేశం. బహిరంగ కార్యకలాపాలను ఆస్వాదించే వారికి, హ్యాంగ్ గ్లైడింగ్, ట్రెక్కింగ్ మరియు శిఖరాన్ని అధిరోహించడం వంటివి మీరు ఇక్కడ ఆనందించవచ్చు. దేవమల్లి వైజాగ్ నుండి 164 కిలోమీటర్ల దూరంలో ఉంది.



Click it and Unblock the Notifications












