Search
  • Follow NativePlanet
Share
» »యానాం పర్యటనలో త‌ప్ప‌క‌ చూడాల్సిన 4 సంద‌ర్శ‌నీయ‌ ప్రదేశాలు

యానాం పర్యటనలో త‌ప్ప‌క‌ చూడాల్సిన 4 సంద‌ర్శ‌నీయ‌ ప్రదేశాలు

కొత్త ప్రాంతాలను అన్వేషించడం అంటే నిస్సందేహంగా మ‌న‌సును ప్ర‌శాత‌త‌ను చేరువ చేయ‌డ‌మే అవుతుంది. మ‌న రోజువారీ జీవితంలో విహారానికి స‌మ‌యాన్ని కొంత స‌మ‌యాన్ని కేటాయించ‌డం ఎంతో అవ‌స‌రం. దీనివ‌ల్ల‌ దైనందిన జీవితంలో విరామాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. ప్ర‌కృతి అందించిన సుంద‌ర దృశ్యాల‌తోపాటు చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న క‌ట్ట‌డాల‌ను ప‌రిచ‌యం చేసే అలాంటి అంద‌మైన ప్రాంత‌మే యానాం. ఇది అనేక ప్ర‌సిద్ధ‌ పర్యాటక ప్రదేశాలకు నిలయంగా పేరుగాంచింది. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ అంద‌మైన‌ ప్రదేశంలోని ఫ్రెంచ్ కాలనీ పాండిచ్చేరితో పోల్చబడుతుంది. అంతేకాదు, ఔత్సాహిక ప‌ర్యాట‌కులు తరచుగా సందర్శించే ప్రదేశాలలో ఒకటిగా నిలిచిన యానాం ప‌ర్య‌ట‌న‌లో తప్పనిసరిగా సందర్శించాల్సిన నాలుగు పర్యాటక ప్రదేశాలు చూద్దాం!

శాంతిని చేరువ చేసే శివ‌మ్‌ బాత్‌

మనం శివుని గురించి ఆలోచించినప్పుడు మనస్ఫూర్తిగా గుర్తుకు వచ్చే పదం శాంతి. అలాంటి శాంతియుత‌మైన వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదించాలంటే శివమ్ బాత్ వ‌ద్ద‌కు చేరుకోవాలి. ఇది గోదావరి న‌దీ తీరం ప్రవేశ ద్వారం వద్ద ఉంది. ఇక్కడ నది తీరంపైపు బోర్డువాక్ ప్రారంభమవుతుంది. గంభీరమైన భారీ ఏనుగుల విగ్రహాలు భారీ శివలింగానికి కాపలాగా ఉన్న‌ట్లు క‌నిపిస్తాయి. ఆ శివ‌లింగంపై రెండు వైపుల నుంచీ ఏనుగులు నీటిని జార‌విడుస్తూ ఉంటాయి. ఈ విగ్రహాలు రాత్రిపూట మరింత ఉత్కంఠభరితంగా క‌నువిందు చేస్తాయి. యానాం ప‌ర్య‌ట‌న‌లో కుటుంబ‌స‌మేతంగా సంద‌ర్శించ‌దగ్గ ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌లో ఇది ముందు వ‌ర‌సులో ఉంటుంది.

veereshwaraswamytemple

వీరేశ్వర స్వామి ఆలయం

అలాగే, మీరు యానాం వెళ్లినప్పుడు తప్పనిసరిగా సందర్శించవలసిన దేవాలయాలలో వీరేశ్వర స్వామి ఆలయం ఒక‌టి. ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యానాంలోని ఓ కొండపై ఉంటుంది. ప్ర‌ఖ్యాత‌ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఇదొక‌టి. ఇప్పటికీ అవివాహితులు, వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు ఒకే ఒక్క సందర్శనలో తమ సమస్యలన్నింటి నుండి విముక్తి పొందుతార‌ని ప్ర‌చారంలో ఉంది.

yanamobelisktower1

యానాం ఒబెలిస్క్ టవర్

ఈ టవర్ యానాం శివార్లలో సిటీ సెంటర్ నుండి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ట‌వ‌ర్ పైకి చేరుకునేందుకు విశాల‌మైన మెట్లదారి ఉంటుంది. ఇది 101.6 మీటర్ల వరకు ఎత్తు ఉండి, ఈఫిల్ టవర్‌ను పోలి రూపొందించబడింది. సంద‌ర్శ‌కులు ఈ ట‌వ‌ర్‌పైకి ఎక్కేందుకు అవ‌కాశం ఉంటుంది. దీని శిఖ‌రంపైనుంచి చూస్తే ఉర‌క‌లు వేసే గోదావ‌రి న‌ది అందాల‌ను వీక్షించ‌వ‌చ్చు. అలాగే, ప‌చ్చ‌ద‌నం ప‌రిచిన‌ట్లు క‌నిపించే చుట్టుప‌క్క‌ల అంద‌మైన ప్ర‌కృతి దృశ్యాల‌ను మీ చేతుల్లో ఉన్న ఫోన్‌ల‌లో ఫొటోలు తీసి దాచుకోవ‌చ్చు. ప్ర‌కృతి అందాల‌ను ఇష్ట‌ప‌డేవారు ఈ ట‌వ‌ర్‌పైకి వెళ్ల‌కుండా వెనుదిరిగిరాలేరు అన‌డంలో సందేహ‌మే లేదు.

draksharamam1

ద్రాక్షారామం

హిందువుల ఆరాధ్యదైవమైన‌ శివుడిని పూజించే ఐదు పంచారామ క్షేత్రాలలో ఒకటి ద్రాక్షారామం. ఈ ఆలయం కోనసీమ జిల్లా ద్రాక్షారామం పట్టణంలో ఉంది. ఈ ఆలయంలో శివుడు భీమేశ్వర స్వామిగా పూజించ‌బ‌డ‌తాడు. ఈ పురాత‌న ఆల‌య నిర్మాణ శైలి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ప్ర‌శాంత‌త‌కు మారుపేరుగా పిలిచే ఈ ప్ర‌దేశం ఆధ్యాత్మిక చింత‌న కలిగిన‌వారికి స్వ‌ర్గ‌ధామంగా చెప్ప‌బ‌డుతోంది. మ‌రెందుకు ఆల‌స్యం వెంట‌నే కుటుంబ‌స‌మేతంగా యానాం ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరండి!

More News

Read more about: yanam tour shivam bath
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+