గణేష్ చతుర్థికి మరికొద్ది రోజులే సమయం ఉండటంతో ముంబై, పుణేల నుంచి నడిచే స్పెషల్ ట్రైన్లన్నీ వేగంగా ఫుల్ అయిపోతున్నాయి. ఈ పండుగ రద్దీని తట్టుకునేందుకు సెంట్రల్ రైల్వే ఏకంగా 246 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కొంకణ్, గోవా రూట్లలో సెప్టెంబర్ 9 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉండటంతో సెప్టెంబర్ 3 నాటికే బుకింగ్స్ సంఖ్య 1,17,682 దాటిపోయింది. ఇక తిరుగు ప్రయాణాలు ఎక్కువగా సెప్టెంబర్ 18 నుంచి 27 మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా ముంబై-కొంకణ్ మార్గంలో వీకెండ్ ప్రయాణాలకు సీట్లు చకచకా ఖాళీ అయిపోతున్నాయి. కాబట్టి ప్రయాణికులు వెంటనే సీట్లు బుక్ చేసుకోవడంతో పాటు, స్టేషన్‌కు కాస్త ముందే చేరుకోవడం మంచిది.
మొత్తం 262 ట్రిప్పుల్లో 200 రిజర్వ్‌డ్, 62 అన్‌రిజర్వ్‌డ్ రైళ్లు ఉన్నాయి. రూట్ల వారీగా చూస్తే.. సావంత్‌వాడి రోడ్‌కు 112, రత్నగిరికి 64, మడ్గావ్‌కు 24 ట్రిప్పులు కేటాయించారు. రద్దీని నియంత్రించేందుకు ప్రధాన రైల్వే హబ్‌లలో క్యూ లైన్ల నిర్వహణ, అదనపు కౌంటర్లు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) భద్రతను పెంచుతున్నారు. CSMT, LTT, దాదర్, పుణే, నాగ్‌పూర్ స్టేషన్లలో ప్రయాణికులు వేచి ఉండేందుకు ప్రత్యేక హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తున్నారు. అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్స్ సాధారణ ఛార్జీలకే అందుబాటులో ఉంటాయి. వీటిని RailOne యాప్ ద్వారా లేదా స్టేషన్ కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది UTS యాప్ అందుబాటులో లేదనే విషయాన్ని గమనించాలి. ప్రయాణికులు కనీసం 30 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకుని సూచిక బోర్డులను గమనించడం శ్రేయస్కరం.

కొంకణ్ స్పెషల్ రైళ్లు: సెప్టెంబర్ 9 నుంచి ప్రయాణాలు ప్రారంభం
మొదటి విడత రైళ్లు సెప్టెంబర్ 8 నుంచి 12 మధ్య బయలుదేరుతాయి. వీటిలో వెస్ట్రన్ రైల్వేకు చెందిన 09013 ముంబై సెంట్రల్-తోకూర్ రైలు సెప్టెంబర్ 8న సర్వీస్ ప్రారంభించనుంది. 09019 ముంబై సెంట్రల్-సావంత్‌వాడి రోడ్ స్పెషల్ సెప్టెంబర్ 9న నడుస్తుండగా, 09020 నంబర్ రైలు తిరుగు ప్రయాణం అవుతుంది. సెప్టెంబర్ 11 నుంచి 01151, 01152 CSMT-సావంత్‌వాడి రోడ్ డైలీ ట్రైన్లు అందుబాటులోకి వస్తాయి. పుణే-రత్నగిరి స్పెషల్స్ 01445, 01446 రైళ్లు సెప్టెంబర్ 12, 15, 19, 22, 26 తేదీల్లో నడుస్తాయి. ఇక పండుగ తర్వాత తిరుగు ప్రయాణపు రైళ్లు సెప్టెంబర్ 12 నుంచి 27 వరకు కొనసాగుతాయి.
గణపతి రద్దీకి పెరిగిన బుకింగ్స్.. వెయిట్‌లిస్ట్ కన్ఫర్మ్ అవ్వాలంటే ఈ టిప్స్ పాటించండి!
కోచ్ లభ్యత రైలును బట్టి మారుతుంటుంది, కాబట్టి ఏసీ, స్లీపర్, జనరల్ కేటగిరీలన్నింటినీ ఒకసారి సరిగ్గా చెక్ చేసుకోండి. ప్రయాణ తేదీని ఒక రోజు అటుఇటుగా మార్చుకుంటే వరుస సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. ఒకవేళ వెయిట్‌లిస్ట్ వచ్చినా కంగారు పడకండి.. ఛార్ట్ ప్రిపరేషన్ సమయానికి ఖాళీ అయ్యే సీట్లను గమనిస్తుండండి లేదా ప్రీమియం తత్కాల్‌ను ప్రయత్నించండి. అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌ల టికెట్ల కోసం RailOne యాప్ లేదా నేరుగా కౌంటర్లను ఉపయోగించుకోండి. ఈ ఏడాది నుంచి UTS యాప్ సేవలను నిలిపివేశారు. అలాగే ప్రయాణంలో ఈ-టికెట్, గుర్తింపు కార్డు (ID) తప్పనిసరిగా వెంట ఉంచుకోండి. స్టేషన్లలో ప్రత్యేక క్యూలు, ఎంట్రీ గేట్లు, అదనపు టికెట్ విండోలు అందుబాటులో ఉంటాయి.
వర్షాల వల్ల ప్రయాణం ఆలస్యమయ్యే ఛాన్స్.. లాస్ట్ మైల్ ట్రావెల్ ప్లాన్ ఉందా?
కొంకణ్ మార్గంలో జూన్ 15 నుంచి అక్టోబర్ 20 వరకు వర్షాకాల టైమ్‌టేబుల్ అమల్లో ఉంటుంది. ఘాట్ పరిసర ప్రాంతాల్లో వేగ పరిమితులు ఉండటం వల్ల రైళ్లు కాస్త ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది. అందుకే కనెక్టింగ్ ట్రైన్లు లేదా పికప్‌ల కోసం కనీసం 45 నుంచి 90 నిమిషాల అదనపు సమయాన్ని ప్లాన్ చేసుకోండి. భారీ వర్షాల హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రయాణానికి ముందే 'నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్' (NTES)లో లైవ్ స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది. ఇక సావంత్‌వాడి, కాంకవ్‌లి, రత్నగిరి, మడ్గావ్ స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు లేదా షేరింగ్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లేదా బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణికులు వీకెండ్ ప్లాన్స్ కోసం గోవాకు కనెక్టింగ్ ఫ్లైట్లను కూడా ఎంచుకోవచ్చు.



Click it and Unblock the Notifications











