భాగ్యనగరం హైదరాబాద్‌లో నైట్ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మిరుమెట్లుగొలిపై విద్యుత్ కాంతుల వెలుగుల్లో వేడి వేడి ఫాస్ట్ ఫుడ్ ఆరగించేందుకు నగరవాసులు క్యూ కడుతూ ఉంటారు. అయితే, తాజాగా మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఓ వార్త ఇప్పుడు హైదరాబాద్ నైట్ లైఫ్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది. ఆ విశేషాలేంటో చూద్దాం.
చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌లో సరికొత్త ట్రెండ్ మరింత డెవలప్ కాబోతోంది. దేశ ప్రజల చూపులను తన వైపునకు తిప్పుకొంటోందీ ఈ భాగ్యనగరం. హైదరాబాద్‌లోని వాణిజ్య కేంద్రాలతోపాటు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను 24×7 తెరిచి ఉంచడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందిని సమాచారం. ఈ తరహా చర్యలతో రాత్రి సమయంలో ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంతోపాటు హైదరాబాద్‌లో నైట్‌లైఫ్, వ్యాపారాలు ఊపందుకునే అవకాశం ఉంది. ఒక నివేదిక ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం హైటెక్ సిటీతోపాటు పలు ప్రధానమైన వ్యాపార కేంద్రాల్లో రాత్రిపూట ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.
అందుకు అవసరమైన రవాణా సౌకర్యాలతో పాటు రాత్రిపూట ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అయితే, బార్‌లు మరియు పబ్‌లు ఇప్పటికే ఉన్న సమయాలకు మించి తెరిచి ఉంచేందుకు మాత్రం అనుమతులు ఉండే అవకాశం లేదు. మరీ ముఖ్యంగా ఈ తరహా అనుమతులు కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఇచ్చేవారు. అయితే, తాజాగా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంతోపాటు సిటీ ఖ్యాతిని పెచ్చేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఉపాధి అవకాశాలు పెరుగుతాయి
అలాగే చార్మినార్, గోల్కొండ వంటి ప్రాంతాల్లో నైట్‌లైఫ్ కార్యకలాపాలను ప్రోత్సహించడం వల్ల అటు పర్యాటకాన్ని అభివృద్ధి చేసినట్లు అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ తహరా నైట్‌లైఫ్ మరియు వ్యాపారానికి అనుమతులు రూపొందించిన ప్రతిపాదిత ప్రణాళికతో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడమే కాకుండా హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
ఇప్పటికే భాగ్యనగరంగా పేరుగాంచిన హైదరాబాద్‌లో ఐటీరంగం దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. అయితే, పోలీస్ డిపార్ట్‌మెంట్ మాత్రం ఈ ప్రణాళికకు పూర్తిగా అనుకూలంగా లేదని తెలుస్తోంది. ముఖ్యంగా శాంతిభద్రతల సమస్యలు, నేరాలు, సంఘ వ్యతిరేక చర్యలు పెరుగుదల గురించి ఆందోళన వ్యక్తం చేస్తోంది.
గతంలోనే అనుమతులు.. అయినప్పటికీ..
నిజానికి, రాష్ట్రంలో దుకాణాలు, సంస్థలు 24/7 పనిచేయడానికి అనుమతిస్తూ గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అనుమతులతో హైదరాబాద్ నైట్ లైఫ్ మరియు వ్యాపారాలను గణనీయంగా పెంచుతుందని భావించినప్పటికీ, కొన్ని యాజమాన్యాలు మాత్రమే ఆసక్తిని కనబరిచాయి. అంతేకాదు, ఇలా 24/7 కార్యకలాపాలను అనుమతించిన మొదటి రాష్ట్రం తెలంగాణ ఒక్కటే కాదు. 2017లో మహారాష్ట్ర ఇదే విధమైన సడలింపును ప్రకటించింది.
అలాగే, కర్ణాటక జనవరి 2021 నుండి మూడేళ్లపాటు ఈ సడలింపును మంజూరు చేసింది. తమిళనాడు కూడా 2019లో ఈ సౌలభ్యాన్ని ప్రవేశపెట్టింది. జూన్ 2022లో దీనిని మరో మూడేళ్లపాటు పొడిగించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటోన్న తాజా నిర్ణయంతో భాగ్యనగరం నైట్‌లైఫ్‌ను మీరూ ఎంజాయ్ చేయండి.



Click it and Unblock the Notifications












