Search
  • Follow NativePlanet
Share
» »ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం కానున్న గోవా కార్నివాల్‌..

ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం కానున్న గోవా కార్నివాల్‌..

గోవాలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో కార్నివాల్ నిర్వహిస్తారు. కార్నివాల్ వాతావరణం ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ స‌మ‌యంలో ప్రజలు రంగురంగుల సాంప్రదాయ దుస్తులను ధరించి వీధుల్లో నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా గ‌డుపుతారు. ఇంకా ఇక్క‌డ వివిధ ర‌కాలైన ఆహార దుకాణాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రతి సంవత్సరం కార్నివాల్‌ను 4 రోజులు పాటు జరుపుకోవ‌డం ఆన‌వాయితీ. గోవా కార్నివాల్ 2024 తేదీలు ఇప్ప‌డు వ‌చ్చేసాయి. ఫిబ్రవరి మాసంలో గోవాకు వెళుతున్నట్లయితే మాత్రం కనీసం ఒకరోజైనా గోవా కార్నివాల్‌ను ఆస్వాదించే విధంగా ట్రిప్‌ని ప్లాన్ చేసుకోండి.

గోవాలో కార్నివాల్ ఎందుకు జరుపుకుంటారు.

గోవాలో అసలు కార్నివాల్ ఎందుకు జరుపుకుంటారు. దాని చరిత్ర ఏమిటో వివ‌రంగా తెలుసుకుందాం. వాస్తవానికి, కార్నివాల్ అనే పదం లాటిన్ పదం 'కార్నెవాలే' నుండి ఉద్భవించింది. అంటే 'మాంసానికి వీడ్కోలు' అని అర్థం. కార్నివాల్ అనేది పోర్చుగీస్ వేడుక. గోవా 450 సంవత్సరాల పాటు పోర్చుగల్ కాలనీగా ఉన్నప్పుడు, పోర్చుగీస్ దాని సంస్కృతి, సంప్రదాయాలపై చాలా ప్రభావం చూపింది. లెంట్ అనేది ఉపవాస కాలం కాబట్టి, లెంట్ రాకను జరుపుకోవడానికి పోర్చుగీస్ వలసరాజ్యాల యుగంలో దీనిని జరుపుకుంటారు.

goacarnival celebrations

ఇది అంతకుముందు కూడా జరుపుకున్నప్పటికీ, 18వ శతాబ్దం మధ్యలో గోవాలో కార్నివాల్ పండుగ హోదాను పొందింది. అప్పట్లో దీనిని 'ఎంట్రూడో' అని పిలిచేవారట‌. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, గోవా 1961 వరకు పోర్చుగీస్ కాలనీగా ఉంది. ఈ సమయంలో కార్నివాల్ ఆధునికీకరణ ప్రారంభమైంది. పర్యాటకులను ఆకర్షించడానికి, స్థానిక సంగీతకారుడు టిమోటియో ఫెర్నాండెజ్ దీనిని బ్రెజిల్ కార్నివాల్ గా రూపొందించ‌డం జ‌రిగింది.

ఈ సంవత్సరం గోవా కార్నివాల్ ఎప్పుడు?

ప్రతి సంవత్సరం గోవాలో 4 రోజుల పాటు కార్నివాల్ నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు గోవాలో కార్నివాల్ ప్రారంభం కానుంది. లెంట్ ఫిబ్రవరి 14న ప్రారంభమై మార్చి 28న ముగుస్తుంది. అందువల్ల గోవాలో ఉపవాస కాలం ప్రారంభమయ్యే ముందు ఈ వార్షిక వేడుకను జరుపుకుంటారు. గోవా కార్నివాల్ 4 ప్రదేశాలలో నిర్వహించబడుతుంది. పంజిమ్, మార్గోవ్, వాస్కో-డ-గామా మరియు మపుసా వీధుల్లో ఈ వేడుక నిర్వ‌హిస్తారు. ఈ సమయంలో రంగురంగుల దుస్తులలో ప్రజలు నిండి ఉంటారు. గోవా కార్నివాల్ ప్రధాన ఆకర్షణ వీధుల్లో కవాతు నిర్వ‌హించ‌డం. దీనిలో పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు ముసుగులు ధరించి నృత్యం చేస్తూ పాట‌లు పాడుతుంటారు.

goacarnival

వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు..

గోవా కార్నివాల్ సందర్భంగా అనేక రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. కార్నివాల్‌ ఫ్లోట్‌ పరేడ్‌, ఫుడ్‌ అండ్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌, స్ట్రీట్‌ పార్టీ, బీచ్‌ పార్టీ వంటి వాటిలో కేవలం స్థానిక ప్రజలే కాకుండా గోవాలో ఉన్న పర్యాటకులు, విదేశీ పౌరులు కూడా పాల్గొని ఆనందిస్తారు. గోవా కార్నివాల్ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఇందులో పాల్గొనడానికి ఎటువంటి రుసుము వసూలు చేయబడదు. ఈ కార్నివాల్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్నివాల్ సమయంలో రెడ్ అండ్ బ్లాక్ డ్యాన్స్‌లో భాగస్వామితో క‌లిసి విహ‌రించాల‌నుకుంటే మాత్రం అందుకోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ రుసుము కూడా చాలా తక్కువగా ఉంటుంది.

More News

Read more about: goa tourism goa carnival
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+