Search
  • Follow NativePlanet
Share
» »విశాఖ‌పట్నం నుంచి గోవా టూర్‌.. ఐఆర్‌సిటిసి ఆఫ‌ర్‌..!

విశాఖ‌పట్నం నుంచి గోవా టూర్‌.. ఐఆర్‌సిటిసి ఆఫ‌ర్‌..!

విశాఖ‌పట్నం నుంచి గోవా టూర్‌.. ఐఆర్‌సిటిసి ఆఫ‌ర్‌..!

గోవా అనగానే అందమైన బీచ్‌లు, సముద్రం, పచ్చని పరిసరాలు గుర్తొస్తాయి. ఎటుచూసినా సముద్రపు అలల సవ్వడులు తీరం మీదుగా వీచే పిల్లగాలుల అల్లరి కేరింతలు.. ఒక్క‌టేమిటి.. చెప్పుకుంటూ పోతే ఎన్నోప‌ర్యాట‌క అందాలు గోవా సొంతం అని చెప్పుకోవ‌చ్చు. అలాంటి ప్ర‌దేశానికి వెళ్లాల‌ని ఎవ‌రికుండ‌దు చెప్పండి. అయితే, గోవా వెళ్లాల‌నుకునే ప‌ర్యాట‌కుల‌కు ఐఆర్‌సీటీసీ టూరిజం ఒక శుభ‌వార్త తీసుకొచ్చింది. అదేంటంటారా? విశాఖపట్నం నుంచి గోవాకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. గోవా డిలైట్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ప్యాకెజీలో భాగంగా ప‌ర్యాట‌కులు గోవాకు ప్లైట్‌లో వెళ్లొచ్చు. విమానంలో ప్ర‌యాణించాల‌న్న‌ప‌ర్యాట‌కుల కల నెర‌వేరుతుంది. అలాగే ఇష్ట‌మైన గోవా అందాల‌ను కూడా చూడొచ్చు. మ‌రెందుకాల‌స్యం ఇంత‌కీ, ఐఆర్‌సిటిసి టూరిజం అందిస్తున్న ఆ ఆఫ‌ర్ వివ‌రాలేంటో తెలుసుకుందామా?

గోవా డిలైట్ పేరుతో ఐఆర్‌సిటిసి అందిస్తున్న ఈ ప్యాకెజీ నాలుగు రాత్రులు, ఐదు రోజుల ప్ర‌యాణం. ఈ టూర్ ప్యాకేజీలో నార్త్ గోవా, సౌత్ గోవాతో పాటు గోవాలోని బీచ్‌లు, ఇతర పర్యాటక స్థలాలు కవర్ అవుతాయి. 2023 అక్టోబర్ 20న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. రండి, ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

1

ఐఆర్‌సీటీసీ గోవా డిలైట్ టూర్..

ఐఆర్‌సీటీసీ గోవా టూర్ ప్యాకేజీ మొదటి రోజు విశాఖపట్నంలో ప్రారంభం అవుతుంది. పర్యాటకులు మధ్యాహ్నం 2.55 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8.55 గంటలకు గోవా చేరుకుంటారు. పర్యాటకుల్ని అక్కడ్నుంచి గోవాలోని ప్యారడైజ్ విలేజ్ బీచ్‌కు తీసుకెళ్తారు. రాత్రికి అక్కడే బస చేయాల్సి ఉంటుంది. మ‌రుస‌టి రోజు నార్త్ గోవా టూర్ ఉంటుంది. అందులో భాగంగా, ఫోర్ట్ ఆగ్వాడా, కాండోలిమ్ బీచ్, బాగా బీచ్‌ను అక్క‌డ సంద‌ర్శించొచ్చు. ఇక్క‌డ నిర్వ‌హించే వాట‌ర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. అయితే, వాటి ఖ‌ర్చుల‌న్నీ ప‌ర్యాట‌కులే స్వ‌యంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత నార్త్ గోవాలోని అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్‌ల‌ను సందర్శించే అవ‌కాశం కూడా ఉంటుంది.

2

గోవా ప‌బ్స్‌కి వెళ్లొచ్చు..

మూడో రోజు కొంత స‌మ‌యం ఖాళీగానే ఉంటుంది. ఆ స‌మ‌యంలో పర్యాటకులు గోవాలో చక్కర్లు కొట్టొచ్చు. మఫ్సా మార్కెట్, పబ్స్‌కి వెళ్లొచ్చు. నాలుగో రోజు సౌత్ గోవా టూర్ ఉంటుంది. అందులో భాగంగా, ఓల్డ్ గోవా చర్చ్, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషీ ఆలయం, మిరామర్ బీచ్‌ల‌ను చూడొచ్చు. మండోవీ నదిపై బోట్ క్రూజ్ ఎంజాయ్ చేయొచ్చు. ఐదో రోజు గోవా నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 3.40 గంటలకు గోవాలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో ప‌ర్యాట‌కుల గోవా టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధర..

ఐఆర్‌సీటీసీ గోవా డిలైట్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ఒకరికి ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.27,640, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.28,750, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.39,010 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో బస, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, మండోవీ రివర్ క్రూజ్ టికెట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అన్నీ ఇందులోనే కవర్ అవుతాయి.

టూర్ ప్యాకేజీ చేయండిలా..

ఐఆర్‌సీటీసీ గోవా డిలైట్ టూర్ ప్యాకేజీ బుక్ చేయడానికి https://www.irctctourism.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Tour Packages పైన క్లిక్ చేయాలి. GOA DELIGHT EX VISHAKHAPATNAM లింక్ పైన క్లిక్ చేయాలి. టూర్ ప్యాకేజీ వివరాలన్నీ చెక్ చేసి, లాగిన్ అయి మీ విమాన ప్ర‌యాణాన్ని బుక్‌చేసుకోవాల్సి ఉంటుంది.

More News

    Read more about: visakhapatnam goa
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+