Search
  • Follow NativePlanet
Share
» » వైజాగ్‌లో IPL మ్యాచ్‌లకు వెళుతున్నారా? సిటీలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు ఇవే!

వైజాగ్‌లో IPL మ్యాచ్‌లకు వెళుతున్నారా? సిటీలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు ఇవే!

విశాఖ‌ప‌ట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆత్రుతగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌లు దగ్గరపడుతున్నాయి. దేశం నలుమూలల నుండి వ‌చ్చే IPL అభిమానులకు న‌గ‌ర‌వాసులు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే విశాఖ‌ సముద్రతీర స్వర్గధామానికి తరలివచ్చే వారి కోసం, విభిన్నమైన అనుభవాలు వేచి చూస్తున్నాయి. మీరు చరిత్ర ప్రియులైనా, ప్రకృతి ప్రేమికులైనా వైజాగ్‌లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేక ఆకర్షణలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీరు ఈ నగరంలో అడుగుపెట్ట‌డం మొదటిసారైతే విశాఖ‌ప‌ట్నంలో తప్పక సందర్శించాల్సిన కొన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు మీకోసం..

ఆర్‌కే బీచ్ అందాలు..

వైజాగ్ నడిబొడ్డునుంచి మీ ప్రయాణాన్ని ప్రారంచిన‌ట్ల‌యితే సుందరమైన తీరప్రాంతం ఆర్‌కే బీచ్ మీరు షికారు చేయడానికి అనువైన ప్ర‌దేశంగా చెప్పొచ్చు. ఇక్క‌డ‌ నిర్మలమైన సూర్యాస్తమయ అనుభూతిని అస్స‌లు మిస్స‌వ్వొద్దు. తాటి చెట్లతో చుట్టుముట్టిన‌ట్లు ద‌ర్శ‌న‌మ‌చ్చే ఈ తీరప్రాంతం బంగాళాఖాతం యొక్క అద్భుతమైన వీక్షణలను అందిస్తుంది. దారిపొడ‌వునా నోరూరించే మురీమిక్స‌ర్‌ని టేస్ట్ చేయ‌డం మ‌ర్చిపోవ‌ద్దు. మిర్చి భాజీని అందించే ఫుడ్ స్టాల్స్‌లో మోమోస్ నుండి పావ్ భాజీ వరకు, మీరు ఇక్కడ ప్రతిదీ ఎంతో ఇష్టంగా తింటారు మ‌రి. సీ పెర్ల్ వద్ద అరకు కాఫీ, లేదా చాయ్‌ సమోసాను మ‌న‌సారా ఆస్వాదిస్తూ.. తీర‌ప్రాంత అందాల‌ను చూసేయండి.

iplmatchesinvizag

INS కుర్సుర స‌బ్‌మెరైన్‌ మ్యూజియం..

INS కుర్సురా సబ్‌మెరైన్ మ్యూజియం వైజాగ్ న‌గ‌రంలో సంద‌ర్శ‌ణీయ ప్ర‌దేశాల జాబితాలో చెప్పుకోద‌గ్గ‌ది. ఈ మ్యూజియంలోకి అడుగుపెడితేచాలు.. గ‌త‌ చరిత్రలోకి ప్రవేశించిన అనుభూతి క‌లుగుతుంది. భార‌త నౌకాద‌ళ ప్రాముఖ్య‌త‌ను క‌ళ్ల‌కుక‌ట్టిన‌ట్లు చూసే అవ‌కాశం ఇక్క‌డ దొరుకుతుంది. 1971 నాటి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో జలాంతర్గామి కీలక పాత్ర పోషించింది. సబ్‌మెరైన్‌కు ఇంజనీర్‌గా పనిచేసిన జి. ఫణి రాజు ఇప్పుడు విశాఖపట్నంలోని INS కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియంకు క్యూరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ మ్యూజియం సందర్శన ద్వారా కొంత జ్ఞానాన్ని పొందడం మాత్రమే కాదు, మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన యోధులను స్మ‌రించుకోవ‌డానికి గొప్ప అవ‌కాశంగా భావించ‌వ‌చ్చు. వారంలో సుమారు 10,000 మంది సందర్శకులు మ్యూజియంను సందర్శిస్తారు.

iplmatchesinvizag

కైలాసగిరి హిల్ పార్క్..

వైజాగ్ న‌గ‌ర అందాల‌తోపాటు తీర‌పు దృశ్యాల‌ను ఒకేసారి చూడాలంటే మాత్రం కైలాస‌గిరి హిల్ పార్క్‌కు వెళ్లాల్సిందే. కొండపైన ఉన్న ఈ సుందరమైన ప్రదేశం సిటీ స్కైలైన్‌తోపాటు పచ్చదనంతో నిండిన న‌గ‌రాన్ని, నీల‌పు ఆకాశం స‌ముద్రాన్ని ముద్దాడుతున్న‌ట్లు క‌నిపించే సుంద‌ర దృశ్యాల‌ను అందిస్తుంది. మీరు రోప్‌వే రైడ్ ద్వారా కూడా శిఖరాన్ని చేరుకోవచ్చు. లేదా ప్రశాంతమైన ట్రెక్‌ను ఆస్వాదిస్తూ.. కొండ‌పైకి కాలిన‌డ‌క‌ను కూడా వెళ్ల‌వ‌చ్చు. కైలాస‌గిరి హిల్ పార్క్‌ సాయంత్రం రద్దీగా ఉంటుంది. కాబట్టి ఉదయం సందర్శించేలా ప్లాన్ చేసుకుంటే అనువుగా ఉంటుంది.

విశాఖ న‌గ‌రంలోని ఈ పర్యాటక ప్రదేశాలేకాకుండా యారాడ బీచ్‌, రుషికొండ బీచ్‌, భీమిలి బీచ్ ఇలా చుట్టుప‌క్క‌లా చాలా సంద‌ర్శ‌నీయ ప్రాంతాలు ఉన్నాయి. వైజాగ్‌ సాంస్కృతిక వారసత్వం, సహజసిద్ద‌మైన ప్ర‌కృతి అందాలు, రుచికరమైన ఆహారాల సమ్మేళనంతో మొదటిసారి నగరాన్ని సందర్శించే IPL అభిమానుల‌కు మరపురాని ప్రయాణాన్ని అందిస్తుంది!

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+