Search
  • Follow NativePlanet
Share
» »చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్‌కు షిల్లాంగ్ వెళ్తున్నారా..?

చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్‌కు షిల్లాంగ్ వెళ్తున్నారా..?

ప్ర‌తి ఏటా షిల్లాంగ్‌లో చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్‌ను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. ఈసారి కూడా ఆ పండగకు ఆ ప్రాంతమంతా ఎంతో అందంగా ముస్తాబ‌య్యింది. ఈ సారి నవంబర్ 17 నుండి 19 వరకు షిల్లాంగ్‌లో చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ నిర్వహించబడుతోంది. ఇది షిల్లాంగ్‌లో జ‌రిగే అతి పెద్ద పండుగ‌. ఈ పండుగ‌ను వీక్షించేందుకు సుదూర దేశాల నుంచి పర్యాటకులు, కళాకారులు త‌ర‌లి వస్తుంటారు. మీరు కూడా ఈ అద్భుతమైన పండుగ‌ను ప్ర‌త్య‌క్షంగా చూడాల‌నుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా షిల్లాంగ్‌కువ వెళ్లాల్సిందే. ఇది మీ యాత్రను మ‌రింత ఆహ్ల‌ద‌భ‌రితంగా మారుస్తుంది.

cherryblossomfestival

మూడురోజుల‌పాటే జ‌రిగే ఫెస్టివ‌ల్‌..

మేఘాలయ ఈ సంవత్సరం షిల్లాంగ్ చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్‌ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. చెర్రీ పువ్వుల పేరు చెప్ప‌గానే అంద‌రికి ముందుగా జపానే గుర్తుకొస్తుంది. కానీ, భార‌త‌దేశంలోని షిల్లాంగ్‌లో కూడా చెర్రీ పువ్వులు క‌నిపిస్తాయి. ఇక్క‌డ‌ నవంబర్‌లో అలాంటి అందమైన వాతావరణం చూసే అవ‌కాశం ఉంటుంది. ఈ సమయంలో నగరంలో ఎటు చూసినా గులాబీ-తెలుపు పువ్వులతో అందమైన పరిసరాలతో ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఈ ఫెస్టివ‌ల్ షిల్లాంగ్‌లోని రి భోయ్ జిల్లాలోని మదన్ కుర్క్లాంగ్, RBDSA స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ఈ పండుగను అంతర్జాతీయ చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తుంటారు. ఈ సమయంలో షిల్లాంగ్‌లోని ప్రతిచోటా పైన్ చెట్లు, చెర్రీ పువ్వులు ఎంతో అందంగా ముస్తాబై ప్రతి ఒక్క ప‌ర్యాట‌కుడిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. అలాగే ఈ ఫెస్టివల్‌లో ఆహారం, స్థానిక వైన్, మంచి సంగీతాన్ని కూడా ఆస్వాదించొచ్చు. మరోవైపు ఇక్క‌డి సంస్కృతి గురించి తెలుసుకోవ‌డంతో పాటు, స్థానిక ప్రజలతో కూడా మాట్లాడొచ్చు.

చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ ప్ర‌త్యేక‌త‌...

ఈ ఏడాది చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్‌లో మ్యూజిక్, ఫ్యాషన్ షో, బ్యూటీ షో, మార్షల్ ఆర్ట్స్, డిస్కో, జపనీస్ కాస్ప్లే, గోల్ఫ్ టోర్నమెంట్‌లు వంటి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారు. ఇక్క‌డ జ‌రిగే ప్రతి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు ఈ పండుగకు మ‌రో ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంది. అదే కరోకే పోటీలు. ఈ ఫెస్టివ‌ల్‌ను చూసేందుకు వ‌చ్చే పర్యాటకులకు ఇక్క‌డ సరైన వసతి ఏర్పాట్లను కూడా చేశారు.

cherryblossomfestival

లక్ష మందికి పైగా పర్యాటకులు వస్తారని అంచనా..

ఈ ఉత్సవాలకు వచ్చే భారతీయ, విదేశీ పర్యాటకుల కొసం వినోదం, వసతి కోసం ముందునుంచే మంచి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫెస్టివల్ స‌మ‌యంలో ప్ర‌ఖ్యాత న‌టీన‌టుల‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోని చాలా మంది ప్ర‌ముఖులు ఇక్క‌డికి వ‌చ్చే సంద‌ర్శ‌కులను ఆహ్లాద‌భ‌రించేందుకు ఇప్ప‌టికే స‌న్న‌హాలు పూర్తిచేశారు. ఈ ఫెస్టివ‌ల్‌పై పర్యాటక మంత్రి పాల్ లింగ్డోహ్ మాట్లాడుతూ..రోజుకు 30,000 మంది సందర్శకులు రానున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నామ‌న్నారు.

ఈవెంట్ ముగిసే సమయానికి సుమారు లక్ష మంది సందర్శకులు వ‌స్తార‌ని భావిస్తున్నామ‌న్నారు. అలాగే, ఇక్క‌డికి వ‌చ్చేవారిలో తొంభై శాతానికి పైగా సంద‌ర్శ‌కులు స్థానికేత‌రులే ఉంటార‌ని అన్నారు. దేశీయ, అంత‌ర్జాతీయ సంద‌ర్శ‌కుల‌తో ఈ ఫెస్టివ‌ల్ కొత్త అందాల‌ను సంత‌రించుకుంటుంద‌ని తాము విశ్వ‌సిస్తున్నామ‌ని అన్నారు. ఈ ఫెస్టివల్‌ను సంద‌ర్శించాల‌నుకునేవారు ఒక్కో రోజు టిక్కెట్‌లను విడి విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జ‌న‌ర‌ల్ టిక్కెట్లు, విఐపీ టిక్కెట్లు అని వేరుగా ఉంటాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+