Search
  • Follow NativePlanet
Share
» »జార్ఖండ్‌లోని ఈ నదిలో బంగారం ప్ర‌వ‌హిస్తుంది..!

జార్ఖండ్‌లోని ఈ నదిలో బంగారం ప్ర‌వ‌హిస్తుంది..!

జార్ఖండ్‌లోని ఈ నదిలో బంగారం ప్ర‌వ‌హిస్తుంది..!

భారతదేశంలో వేలాది చిన్న‌, పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి నేటి కాలంలో ప్రజల జీవనోపాధిగా మారాయి. అనేక రాష్ట్రాల రైతులు వ్యవసాయం కోసం నదుల నీటిపై ఆధారపడుతుండగా, చాలా మంది ప్రజలు ఇతర ప్రయోజనాల కోసం నదిని ఉపయోగిస్తున్నారు. దేశంలో ప్ర‌వ‌హించే ఒక న‌ది నుంచి బంగారం వ‌స్తుందంటే న‌మ్ముతారా? అవును నిజ‌మేనండి..

ఇది విన‌డానికి కాస్త వింత‌గానే ఉన్నా న‌మ్మాల్సిందే.. ఆ న‌ది గురించి తెలుసుకుందాం ప‌దండి. జార్ఖండ్‌లోని స్వర్ణరేఖ నది ఇక్క‌డి ప్రజలకు ఆదాయ వనరుగా మారింది. ఇక్క‌డివారు ఈ నీటిలో నుండి వచ్చే బంగారాన్ని అమ్మి, ఆ డబ్బుతో కుటుంబాల‌ను పోషించుకుంటున్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఉపాధిగా మారిన ఈ బంగారు న‌దిగురించిన ఆసక్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలుసుకుందాం ప‌దండి.

1

ఈ బంగారు నది జార్ఖండ్‌లో ప్రవహిస్తుంది

ఈ నది భార‌త‌దేశంలోని జార్ఖండ్‌లో ప్రవహిస్తుంది. ఈ నది పేరు సుర్ణరేఖ నది లేదా సుబర్ణరేఖ నది. దీనినే స్వర్ణరేఖ న‌ది అని కూడా పిలుస్తారు. నదిలో నీటితోపాటు బంగారం ప్రవహించడం వల్ల దీనిని స్వర్ణరేఖ అంటారు. సుబర్ణరేఖ నది రాంచీ నుండి 16 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. దీని పొడవు సుమారు 474 కిలోమీట‌ర్లు ఉంటుంది. అయితే ఈ నదిలో బంగారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది పెద్ద ప్రశ్న. దీని గురించి ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. చాలా మంది శాస్త్రవేత్తలు దీనిని పరిశోధించారు.

నది ఏ ప్రాంతాల గుండా వెళుతుంది?

ఈ నది ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల గుండా వెళుతుంది. సుబర్ణ రేఖ మరియు దాని ఉపనది కర్కారిలో బంగారు రేణువులు కనిపిస్తాయి. కర్కారి నది నుండి బంగారు రేణువులు ప్రవహించి బంగారు రేఖ నదికి వెళ్తాయి. ఈ రెండు నదుల్లో బంగారు రేణువులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

2

ఎక్క‌డి నుండి వస్తుంది

ఈ నది అనేక రాళ్ల గుండా వెళుతుందని, ఈ సమయంలో రాపిడి కారణంగా బంగారు రేణువులు అందులో కరిగిపోయి ఉంటాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నది ఇసుక నుండి బంగారం సేకరించడానికి చాలా కష్టపడాల్సి వ‌స్తుందని ఇక్క‌డి వారు అంటున్నారు. ఈ కణాలు బియ్యం గింజతో సమానంగా లేదా చిన్నవిగా ఉంటాయి.

బంగారాన్ని వెలికితీసి బతుకుతున్నారు

జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలలో స్థానిక గిరిజనులు ఉదయం పూట ఈ నదికి వెళ్లి, బంగారు రేణువులను సేకరించేందుకు ఉద‌యాన్నే అక్క‌డికి వ‌స్తారు. నదిలోని ఇసుకను జల్లడల ద్వారా వేరు చేసి ఒక్కొక్కటిగా బంగారం రేణువులను సేకరిస్తారు. బంగారం ముద్ద‌లుగా మాత్రం ఇక్క‌డ దొర‌కదు. ఒక వ్యక్తి ఒక నెలలో 70 నుంచి 80 బంగారు రేణువులను సేకరిస్తారు. ఏడాది పొడవునా ఇక్కడ బంగారం దొరకదు. కేవలం వర్షాకాలం, శీతాకాలంలో మాత్రమే ఇక్కడ ఎక్కువ‌గా బంగారం సేకరిస్తుంటారు.

3

ఇక్కడి గిరిజనులు ఈ నది మొత్తాన్ని జల్లెడ పడతారు. బంగారం రేణువులను దక్కించుకునేందుకు చాలా కష్టపడతారు. ఇలా బంగారం రేణువులను సేకరించి.. వాటిని దగ్గరలోని పెద్ద నగరానికి తీసుకెళ్లి అమ్ముతుంటారు. ఇదే ఇక్క‌డివారికి జీవ‌నోపాధి అని చెప్పుకోవాలి. బంగారం రేణువులను దక్కించుకునేందుకు ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎంతో కష్టపడతారు. రోజంతా వెతికినా ఒక్కోసారి ఒక్క బంగారం రేణువు కూడా దొరకదు. అలాంటప్పుడు ఒట్టి చేతులతోనే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. బంగారం నది పక్కనే ఉన్నా ఇక్కడి ప్ర‌జ‌ల‌ స్థితిగతుల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు.

More News

    Read more about: surnarekha river jharkhand
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+