అరుణాచలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ ఆర్‌టిసి ఓ శుభవార్తను అందించింది. అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు సిద్ధమయ్యింది. జూన్ 22వ తేదిన జ్యేష్ట పౌర్ణమి సందర్భంగా పుణ్యక్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం వేలాది సంఖ్యలో భక్తులు తరలి వెళ్తారు. దాంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రో
డ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులను నడిపేందుకు సిద్ధమయ్యింది. ఈ సర్వీసులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తమిళనాడులోని అరుణాచలానికి నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వివరించింది. భక్తులందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఆసక్తి గల భక్తులు తమ సర్వీసులు వినియోగించుకుని, భక్తులు అరుణాచల గిరి ప్రదక్షిణను సులభతరం చేసుకోవాలని ఆర్‌టిసి సూచింంచింది. అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ప్యాకేజీలాగా ఎపీఎస్‌ఆర్టీసీ అందిస్తోంది.
ఎపీఎస్‌ఆర్టీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే..
జూన్ 22న జ్యేష్ట పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లేవారికి ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు తుని నుంచి బయలుదేరుతారు. ఈ ప్రయాణంలో భాగంగా శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం పుణ్యక్షేత్రాల్లో దర్శనం చేసుకుంటారు. అనంతరం అరుణాచలం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతారు. గిరి ప్రదక్షిణ తర్వాత కంచి, విజయవాడ పుణ్యక్షేత్రాలు దర్శనం ఉంటుంది. ఆ మరుసటి రోజు 23వ తేది ఉదయం తునికి చేరుకుంటారు. ఇక, ఈ బస్సులో ప్రయాణానానికి ఒక్కొక్కరికి రూ.3,500 టికెట్ చార్జి ఉంటుంది. టికెట్ రిజర్వ్ చేసుకునేవారు డిపో కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది.

సత్తెనపల్లి నుంచి సూపర్ లగ్జరీ బస్సు..
అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకునేవారు సత్తెనపల్లి నుంచి కూడా బయలుదేరొచ్చు. ఇక్కడి నుంచి కూడా అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏపీఎస్ఆర్‌టిసి ఏర్పాటు చేసింది. జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సత్తెనపల్లి బస్ కాంప్లెక్స్ నుంచి బస్సు బయలుదేరుతుంది. 22వ తేదీన అరుణాచలం, గిరి ప్రదక్షిణ, దర్శనం ముగిసిన అనంతరం అదే రోజు సాయంత్రం కంచి మీదుగా 23న ఉదయం మళ్లీ సత్తెనపల్లికి చేరుకుంటుంది. ఈ ప్రయాణానికి మొత్తం రూ.2,000 ఖర్చవుతుంది. ఈ టిక్కెట్లును ఆన్‌లైన్‌లో ఏపీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకునే అవకాశం ఉంది.
రాజంపేట నుంచి...
అరుణాచల గిరిప్రదక్షిణ కోసం ఏపీఎస్ఆర్‌టిసి రాజంపేట నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈనెల 21న రాజంపేట బస్సు కాంప్లెక్స్ నుంచి అరుణాచలానికి ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరుతుంది. ఈ బస్సు టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

పీలేరు నుంచి..
జూన్ 21వ తేదీన పీలేరు నుంచి అరుణాచలానికి ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సు సర్వీసులను ఎపీఎస్ఆర్‌టిసి అందుబాటులోకి తీసుకరానుంది. ఎక్స్‌ప్రెస్ బస్ సర్వీస్ టిక్కెట్టు ధర రూ.700 ఉండగా, ఆర్డినరీ బస్ సర్వీస్ టిక్కెట్టు ధర రూ.650 గా నిర్ణయించారు. ఈ నెల 21న మధ్యాహ్నం 1 గంటకు ఎక్స్‌ప్రెస్ బస్సు పీలేరు నుంచి బయలుదేరుతోంది. ఆర్డీనరి బస్సు తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరుతుంది. అరుణాచలంలో ఆలయ దర్శనం, గిరిప్రదక్షిణ తర్వాత బస్సు తిరిగి పీలేరుకు చేరుకుంటుంది.
మచిలీపట్నం నుంచి..
జూన్ 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నం నుంచి ఆరుణాచలానికి ఆర్టీసీ స్పెషల్ బస్సులు బయలుదేరనున్నాయి. ఈ స్పెషల్ సర్వీసు మచిలీపట్నం నుంచి రేపల్లె మీదుగా శ్రీకాళహస్తి, కాణిపాకం, అర్ధవీడు, సిరిపురం మీదుగా అరుణాచలం చేరుతుంది. ఈ నెల 22వ తేదీ పౌర్ణమి రోజున దైవదర్శనం, అరుణాచల గిరి ప్రదక్షిణ అనంతరం సమీపంలోని కంచి, విష్టుకంచి, కామాక్షమ్మ గుడి, బంగారు బల్లి, తిరుత్తణి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరిగి 24వ తేదీన మచిలీపట్నం చేరుకుంటారు. దీనికి రూ.3,000 టిక్కెట్టు ధరగా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా ఏపీఎస్ఆర్‌టిసి వెబ్‌సైట్‌లో టిక్కెట్టు బుక్ చేసుకోగలరు.



Click it and Unblock the Notifications












