దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగా క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అనే అర్థం వస్తుంది. అంటే ఎర్రని కొండ అని అర్థం. దీనినే తమిళంలో అయితే ''తిరువన్నామలై'' అంటారు. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటిగా పేరుగాంచింది. అరుణాచల గిరి పద్రక్షిణ చేసినవారికి సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు..
ఇక్కడికి వచ్చి మొక్కుకున్న వారికి కోరిన కోరికలన్నీ నెరువేరుతాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఇక్కడికి నిత్యం భక్తులు వేలాది సంఖ్యలో తరలి వస్తుంటారు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు పొందుతారని ఇక్కడికి వచ్చిన వారు చెబుతుంటారు. జులై 20న జరిగే గిరిప్రదక్షిణకు వెళ్లాలనుకునే భక్తులకు ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్తను మోసుకొచ్చింది. హిందుపూరం నుంచి అరుణాచలం వరకు సూపర్ లగ్జరీ బస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌లను నడుపుతోంది. ఇక, ఈ బస్సు సర్వీస్‌లను యాత్రికులు వినియోగించుకోవాలని ఏపీఎస్‌ఆర్టీసీ కోరుతోంది. ఇతర పుణ్యక్షేత్రాల పర్యటన మాదిరిగానే ఈ బస్సు సర్వీస్‌లు కూడా అరుణాచలం సందర్శించేందుకు తీసుకెళ్తుంది. ఏపీఎస్‌ఆర్టీసీ నిత్యం ప్రయాణికులకు అందుబాటులో కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను తీసుకుని వస్తోంది. డిమాండ్‌ను బట్టీ ప్రయాణికులకు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని ఏపీఎస్ఆర్‌టిసి అందిస్తుంది. అందులో భాగంగానే ప్రతినెల పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని అరుణాచలానికి ఈ స్పెషల్ బస్సు సర్వీస్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రతి నెల అందుబాటులో..
ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ 2+2 సీట్లతో అనంతపురంలోని హిందూపురం నుంచి తమిళనాడులోని అరుణాచలం వరకు ప్రయాణికుల కోసం అందుబాటులోకి వచ్చింది. ఈ స్పెషల్ బస్సు సర్వీసులు ప్రతి నెల ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. జులై 20 వతేదిన అరుణాచలం గిరి ప్రదక్షణ ఉంటుంది. ఈ గిరిప్రదక్షిణ వెళ్లాలనుకునేవారు జూలై 19 (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు హిందూపురం బస్ కాంప్లక్స్ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. మరుసటి రోజు శనివారం ఉదయం 4 గంటలకు అరుణాచలం చేరుకుంటారు.
అతితక్కువ ధరతోనే...
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనంతరం అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం హిందూపురానికి తిరుగు ప్రయాణం ఉంటుంది. అరుణాచలంలో జూలై 20 (శనివారం)న ఉదయం 5.50 గంటలకు గిరి ప్రదక్షణ ప్రారంభమవుతుంది. జూలై 21 (ఆదివారం) న మధ్యాహ్నం 3: 47 నిమిషాలకు గిరిప్రదక్షిణ పూర్తవుతుంది. అతితక్కువ ధరతోనే ప్రయాణం ఉంటుంది.
టిక్కెట్టు ధర రెండు వైపుల కలిపి ఒక్కరికి రూ.1,320గా ఏపీఎస్ఆర్‌టిసి నిర్ణయించింది. ఇతర పూర్తి సమచారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు. అలాగే టిక్కెట్ బుకింగ్ వాటికోసం హిందూపురం బస్ డిపోన్ సంప్రదించగలరు. ఇక, ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు.



Click it and Unblock the Notifications












