ఈ సెలవుల్లో చాలామంది విహారయాత్రలకు వెళ్లాలని ప్రణాళికలు వేస్తుంటారు. మరికొందరేమో ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించాలనుకుంటారు. అలాంటివారికోసం తెలంగాణ టూరిజం ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా అతితక్కువ ధరలోనే హైదారబాద్ నుంచి యాదాద్రికి ప్రయాణం చేయవచ్చు. ఈ టూర్ ప్యాక్‌లో యాదాద్రితో పాటు మరికొన్ని ఆలయాలను కూడా సందర్శించొచ్చు. మరీ ముఖ్యంగా.. నగర జీవితంతో సతమతమయ్యేవారికి మానసిక ప్రశాంతతను చేరువ చేసే ఈ ఆధ్యాత్యిక కేంద్రాల టూర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం ఆ ప్యాకేజీ వివరాలు చూద్దామా!
తెలంగాణలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాదాద్రి ఆలయం. ఈ ఆలయంలోని నరసింహస్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి శనివారం ఇక్కడ సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఈ వారాంతపు రోజుల్లో యాదాద్రిని సందర్శించేందుకు తెలంగాణ టూరిజం శాఖ ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్‌లో ఒక్క యాదాద్రి మాత్రమే కాకుండా అక్కడికి సమీపంలోని కొలనుపాకతో పాటు సురేంద్రపూరి ఆలయాలను సందర్శించొచ్చు. బస్సు జర్నీ ద్వారా సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

టూర్ ప్యాకేజీ ధరల వివరాలిలా...
తెలంగాణ టూరిజం YADAGIRIGUTTA PACKAGE TOUR పేరుతో ఈ టూర్‌ను ప్రకటించింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఈ టూర్ ప్యాకేజీ ప్రతి శనివారం పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఇది బస్సు జర్నీ. ఏసీ మినీ కోచ్‌లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
హైదరాబాద్ నుంచి యాదాద్రి గుట్టకు వెళ్లేందుకు పెద్దలకయితే రూ. 1499గా నిర్ణయించారు. పిల్లలయితే రూ.1199 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ కేవలం ఒక్కరోజుల్లోనే ముగుస్తుంది. ఏసీ బస్సు ప్రయాణం కావడంతో కుటుంబసమేతంగా విహారానికి ఈ ప్యాకేజీ ఎంతో అనువుగా ఉంటుంది.

రూట్ మ్యాప్ ఇదే..
ఈ ప్యాకేజీలో భాగంగా మొదటిరోజు ఉదయం తొమ్మిదిగంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఉదయం 10:30 గంటలకు కొలనుపాకకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడికి సమీపంలో ఉన్న పురాతన జైన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. 11:30 AM గంటల సమయంలో కొలనుపాక నుంచి యాదగిరి గుట్టకు మీ ప్రయాణం ఉంటుంది. 12:30 PM గంటల సమయంలో యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడ కొండపై వెలసిన శ్రీ లక్ష్మి నరసింహాస్వామిని దర్శించుకుంటారు.
అనంతరం మధ్యాహ్నం 1:30 PM to 2:00 PM సమయంలో హరిత హోటల్ లో భోజనం చేస్తారు. సాయంత్రం 4:30 PM సురేంద్రపురికి బయలుదేరుతారు. ఇక్కడ ప్రముఖ ఆలయాల సెట్టింగ్‌లను వీక్షిస్తారు. అంతటితో మీ టూర్ ప్యాకేజీ ముగుస్తోంది. రాత్రి 9:30 PM గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. యాదాద్రి దర్శనం చేసుకోవాలనుకునేవారు తప్పకుండా తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి https://tourism.telangana.gov.in/ బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుకోవచ్చు. మరెందుకాలస్యం మీ టూర్‌ను మొదలుపెట్టండి మరీ..



Click it and Unblock the Notifications












