Search
  • Follow NativePlanet
Share
» »విశాఖవాసుల‌కు గుడ్‌న్యూస్‌... స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ట్రైన్స్ రూట్స్ ఇవే..!

విశాఖవాసుల‌కు గుడ్‌న్యూస్‌... స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ట్రైన్స్ రూట్స్ ఇవే..!

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ స్పెష‌ల్ ట్రైన్ ఏప్రిల్ 13 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ స్పెష‌ల్ ట్రైన్స్ జులై 4 వరకు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయి. 02811 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ఏప్రిల్ 13 నుంచి భువనేశ్వర్-యలహంకకు బ‌య‌లుదేరుతుంది.

ఈ ట్రైన్ మే 25 వరకు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. 08539 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ వైజాగ్ నుంచి కొల్లాం బ‌య‌లుదేరుతుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ ఏప్రిల్ 17 నుంచి జులై 3 వరకు ప్రతి బుధవారం ప్ర‌యాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఉదయం 8.20 గంటలకు వైజాగ్‌లో బ‌య‌లుదేరుతుంది.

howrah-yeswantpur

యలహంక నుంచి భువనేశ్వర్ కు...

08540 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ కొల్లాం నుంచి విశాఖకు బ‌య‌లుదేరుతుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ ఈ నెల 18 నుంచి జులై 4 వరకు ప్రతి గురువారం రాత్రి 7.35 గంటలకు కొల్లాంలో బయలుదేరి మ‌రుస‌టి రోజు రాత్రి 11.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఏప్రిల్ 13 వ‌తేది నుంచి బ‌య‌లుదేరే భువనేశ్వర్-యలహంక (02811) స్పెష‌ల్ ట్రైన్ మే 25 వ తేది వ‌ర‌కు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది.

ఈ స్పెష‌ల్ ట్రైన్ ప్రతి శనివారం సాయంత్రం 7.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి, అర్ధరాత్రి దాటిన తర్వాత 1.53 గంటలకు దువ్వాడ వ‌స్తోంది. తిరిగి ఇదే ట్రైన్ 1.55 గంటలకు బయలుదేరుతుంది. 02812 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ యలహంక నుంచి భువనేశ్వర్ కు వెళుతుంది. ఇది ఈ నెల 15 నుంచి అంటే నేటి నుంచి మే 27 వరకు ప్రతి సోమవారం ఉదయం 5 గంటలకు యలహంకలో బయలుదేరి, మ‌రుస‌టి రోజు తెల్లవారుజామున 4.30 దువ్వాడ చేరుకుంటుంది. అనంత‌రం తిరిగి 4.32 గంటలకు బయలుదేరుతుంది.

visakha-kollamtrain schedule

హౌరా-యశ్వంత్‌పూర్‌ స్పెష‌ల్ ఏసీ ట్రైన్...

ఈనెల‌ 18 నుంచి జూన్ 27 వ‌ర‌కు హౌరా-యశ్వంత్‌పూర్‌(02863) స్పెష‌ల్ ఏసీ ట్రైన్ ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ ప్ర‌తి గురువారం మధ్యాహ్నం 12.40 గంటలకు హౌరాలో బయలుదేరి, ఆ మరుసటి రోజు తెల్లవారుజామున 2.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఇదే ట్రైన్ తిరిగి 2.45 గంటలకు బయలుదేరుతుంది. 02864 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ యశ్వంత్‌పూర్ నుంచి హౌరా బ‌య‌లుదేరుతుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ ఏప్రిల్ 20 నుంచి 29 వరకు ప్రతి శనివారం ప్ర‌యాణికులకు అందుబాటులో ఉంటుంది.

అంతేకాదు, ఈ ట్రైన్ ప్ర‌తి శ‌నివారం ఉదయం 5 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి రాత్రి 11.05 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అనంత‌రం తిరిగి 11.07 గంటలకు బయలుదేరుతుంది. 06081 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ కొచ్చివెల్లి నుంచి షాలిమార్‌కు వెళ్లే ఈ ట్రైన్ మే 31 వరకు ప్ర‌యాణికుల‌కు అందుబాటులోఉంటుంది. షాలిమార్ నుంచి కొచ్చివెల్లి(06082) వెళ్లే స్పెష‌ల్ ట్రైన్ ఏప్రిల్ 15 నుంచి జూన్‌ 6 వరకు న‌డుస్తోంది. న్యూటిన్‌ సుఖియా-ఎస్‌ఎంవీ బెంగళూరు(05952) వెళ్లే స్పెష‌ల్ ట్రైన్ మే 2 నుంచి జూన్ 27 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఎస్‌ఎంవీ బెంగళూరు- న్యూటిన్‌ సుఖియా(05951) వెళ్లే స్పెష‌ల్ ట్రైన్ మే 6 నుంచి జులై 1 వరకు అందుబాటులో ఉంటుందని తూర్పు కోస్తా రైల్వే అధికారులు తెలిపారు.

More News

    Read more about: vishkapatana andhrapradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+