సిక్కిం రాష్ట్రంలో గాంగ్ టాక్ ఒక అతి పెద్ద పట్టణం. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 1,437 మీ. ల ఎత్తున శివాలిక్ కొండలలి తూర్పు హిమాలయ పర్వత శ్రేణులలో కలదు.
గాంగ్ టాక్ ప్రదేశం బౌద్ధ మత ప్రదేశాలకు ప్రవేశ ద్వారం అని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం పెరిగే పర్యాటకుల సంఖ్య తో ఈ ప్రదేశం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మారుతోంది. గాంగ్ టాక్ లో అనేక ఆకర్షణలు కలవు. వైలో ఎంచీ మొనాస్గారి, నాథులా పాస్, డో ద్రుల్ కోర్తెన్ వంటివి ప్రధానమైనవి.
ది రిడ్జ్, హిమాలయ జు పార్క్ వంటివి కూడా పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి. ఈ ప్రదేశ అందాలు ప్రతి ఒక్కరూ ముగ్దులవుతారు. మరి గాంగ్ టాక్ వెళితే, అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమిటి ? పరిశీలించండి.

గాంగ్ టాక్ ఎలా చేరాలి ?
గాంగ్ టాక్ కు సమీప ఎయిర్ పోర్ట్ బాగ్ డోగ్రా ఎయిర్పోర్ట్. ఇక్కడకు దేశంలోని ప్రధాన ఎయిర్ పోర్ట్ ల నుండి తేలికగా చేరవచ్చు. ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా అద్దె తక్సి లలో గ్యాంగ్ టాక్ కు రోడ్ మార్గంలో చేరవచ్చు. సిలిగురి లోని న్యూ జలపాయ్ గురి గాంగ్ టాక్ కు సమీప రైలు స్టేషన్. ఈ రైలు స్టేషన్ నుండి దేశంలోని ప్రధాన నగరాల రైల్ స్టేషన్ లకు అనుసంధానం కలదు. సిలి గురి బస్సు స్టాండ్ నుండి గ్యాంగ్ టాక్ కు అనేక బస్సు లు ఇతర వాహనాలు కూడా కలవు.
Photo Courtesy: Abhishek Kumar

బాబా హర్భజన్ సింగ్ మెమోరియల్
బాబా హర్భజన్ సింగ్ మెమోరియల్ జేలేప్లా పాస్ మరియు నాతు లా పాస్ ల మధ్య కలదు. ఇది ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం. ప్రతి రోజూ వందలాది యాత్రికులు ఇక్కడకు వస్తారు. ఈ టెంపుల్ తమ కోరికలు తీరుస్తుందని భక్తులు భావిస్తారు. మొదటగా ఒక నీటి బాటిల్ ఇక్కడ వుంచి తమ తిరుగు ప్రయాణంలో యాత్రికులు దానికి తెచ్చుకుంటారు.

సొంగ్మో సరస్సు
సొంగ్మో సరస్సు ను చాంగు సరస్సు అని కూడా అంటారు. ఇది తూర్పు సిక్కిం లో కలదు. ఇది ఒక అందమైన మంచు గడ్డాల సరస్సు. ఇక్కడకు అనేకమంది పర్యాటకులు వస్తారు. నాతు లా పాస్ వెళ్ళే మార్గంలో ఈ సరస్సు కలదు. 2006 సంవత్సరంలో ఈ సరస్సు చిత్రాన్ని ఇండియన్ పోస్టల్ డిపార్టుమెంటు తమ స్టాంప్ పై చిత్రించి స్టాంప్ ను విడుదల చేసింది. Photo Courtesy: Ravinder Singh Gill

డో ద్రుల్ కోర్తెన్
డో ద్రుల్ కోర్తెన్ అనేది గాంగ్ టాక్ లో ఒక స్తూపం. దీనిని బౌద్ధమత శాఖలలో ఒక బౌద్ధ సన్యాసి అందంగా నిర్మించాడు. దీనిలో అనేక బౌద్ధ మత అంశాలను వివరించే వస్తువులు చూడవచ్చు. స్తూపం సమీపంలో బౌద్ధ గురువుల విగ్రహాలు కూడా చూడవచ్చు. ఈ స్తూపానికి సుమారు 108 ప్రార్థనా చక్రాలు కలవు. Photo Courtesy: Zeimusu

ఎన్కేయ్ మొనాస్టరీ
ఎంకేయ్ బౌద్ధ ఆరామం గ్యాంగ్ టాక్ లో ఒక పరమ పవిత్ర ప్రదేశంగా పూజించబడుతుంది. ఎంకేయ్ మొనాస్టరీ అంటే అర్ధం ఒంటరి ప్రదేశం అని అర్ధం చెపుతారు. ఇక్కడ కల బౌద్ధ మత విగ్రహాలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
Photo Courtesy: Thuresson

గురు దొంగ్మార్ సరస్సు
గురు దొంగ్మార్ సరస్సు ఒక మంచి నీటి సరస్సు. ఇది ప్రపంచ ఎత్తైన ప్రదేశాలలో కల సరస్సులలో ఒకటి. ఈ సరస్సు కాంచన గంగ పర్వత శ్రేణులకు ఈశాన్యం దిశగా వుంటుంది. గురు దొంగ్మార్ సరస్సు నుండి సో లాస్మో సరస్సు వరకు అక్కడ కల ఆర్మీ అనుమతి తీసుకుని ట్రెక్కింగ్ చేస్తూ ప్రదేశ అందాలను వీక్షించవచ్చు.
Photo Courtesy: Sivakumar

హిమాలయ జూలాజికల్ పార్క్
హిమాలయ జూలాజికల్ పార్క్ గాంగ్ టాక్ కు 8 కి. మీ. ల దూరంలో కలదు. ఈ పార్క్ ను బుల్ బులె అని కూడా అంటారు. ఇక్కడ మీరు అనేక జంతువులను రక్షణ కల వాటి స్థానాలలో చూడవచ్చు. బార్కింగ్ డీర్ , పందాలు, పులులు, టిబెట్ తోడేళ్ళు, సివెట్ పిల్లులు, హిమాలయ బ్లాకు బేర్ వంటి జంతువులు కలవు.
Photo Courtesy: Carsten.nebel

జవహర్లాల్ నెహ్రూ బొటానికల్ గార్డెన్
జవహర్లాల్ నెహ్రూ బొటానికల్ గార్డెన్ తూం టెక్ మొనాస్టరీ సమీపంలో కలదు. అనేక వృక్షాలు, మొక్కలతో ఆకర్షణీయంగా ఈ గార్డెన్ నిర్వహిస్తున్నారు. Photo Courtesy: Nichalp

నాతు లా పాస్
నాతు లా పాస్ అనేది ఒక పర్వత మార్గం. ఈ మార్గం సిక్కిం ను చైనా యొక్క టిబెట్ బ్రాన్తానికి కలుపుతుంది. దీని గుండా ఇండియన్ లను మాత్రమే నిర్దేశిత దినాలలో వెళ్లేందుకు అక్కడి సైన్యం అనుమతిస్తుంది. ఇక్కడ ఒక ఇండియన్ వార్ మెమోరియల్ కూడా కలదు.
Photo Courtesy: $udeep Bajpai

రూమ్ టెక్ మొనాస్టరీ
రూమ్ టెక్ మొనాస్టరీ గాంగ్ టాక్ నుండి 24 కి. మీ. ల దూరం. టిబెట్ బౌద్ధులకు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. సిక్కిం లో ఇది అతి పెద్ద మొనాస్టరీ. మొనాస్టరీ వెనుక భాగంలో ఒక పెద్ద కర్మ నలందా సంస్థ అనే బౌద్ధ మత స్టేడి కేంద్రం కలదు. ఇక్కడకు ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ మత విద్యార్ధులు వచ్చి శిక్షణ పొందుతారు.

సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్
సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇది జాంగు ప్రదేశంలో కలదు. ఇక్కడ సిక్కిం టూరిజం శాఖ ఒక సౌకర్యవంతమైన కాఫీ హోటల్ మరియు నివాసాలకు లాజ్ కూడా నడుపుతోంది. విజిటర్ లు ఈ జలపాతాల దృశ్యాలు ఫోటోలు తీసుకొని ఆనందించవచ్చు.
Photo Courtesy: Snthakur

తీస్తా నది
సిక్కిం లో కల తీస్తా నది అతి పొడవైన నది. ఇది రాష్ట్రం అంతా ప్రవహిస్తుంది. దీనిలో వైట్ వాటర్ రాఫ్టింగ్ చేయటం ఒక పర్యాటక ఆకర్షణ. బలమైన ప్రవాహ వేగాలు దీనిని ఒక ఆదర్శనీయ రాఫ్టింగ్ ప్రదేశంగా మార్చాయి. మెల్లి, తీస్తా బజార్ లలో గ్రూప్ వైట్ వాటర్ రాఫ్టింగ్ చేయవచ్చు. వైట్ వాటర్ రాఫ్టింగ్ ఈ ప్రదేశంలో ఒక మరువ లేని అనుభూతిగా క్రీడాకారులకు మిగులుతుంది.



Click it and Unblock the Notifications











