Search
  • Follow NativePlanet
Share
» »ప‌శ్చిమబెంగాల్‌లోని ఈ గ్రామాన్ని ఎప్పుడైనా సంద‌ర్శించారా..?

ప‌శ్చిమబెంగాల్‌లోని ఈ గ్రామాన్ని ఎప్పుడైనా సంద‌ర్శించారా..?

రోజువారి ఈ ఉరుకుల ప‌రుగుల జీవితం నుంచి విసుగుచెంది కాస్త విశ్రాంతి పొందాల‌నుకుంటున్నారా? కాసేపు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో గ‌డ‌పాల‌నుకుంటున్నారా? అలాంటి వారికోసం ప‌శ్చిమబెంగాల్‌లోని ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది. ఎందుకంటే ఈ ప్ర‌దేశం ప్ర‌కృతి అందాల‌తో, ఎంతో ప్ర‌శాంతంగా, ఆహ్లద‌భ‌రితంగా ఉంటుంది. ఈ ప్ర‌శాంతంమైన వాతావ‌ర‌ణంలో సెలవుల‌ను బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్క‌డ ప‌ర్యాట‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేసే ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్ నుండి సుమారు కొన్ని కిలోమీట‌ర్ల దూరంలో ఉంది రాంధుర గ్రామం. ఈ గ్రామం ప్ర‌కృతి ప్ర‌సాదించ‌న వరం అంటుంటారు.

డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం, దీని కారణంగా ఈ ప్రదేశం సంవత్సరంలో చాలా నెలలు పర్యాటకులతో నిండి ఉంటుంది. ఇక్కడ ఉన్న పర్యాటక ప్రదేశాల అందం కార‌ణంగా ప్ర‌పంచం నలుమూలల నుండి వ‌చ్చే ప్రజలను ఆకట్టుకుంటుంది. అయితే పశ్చిమ బెంగాల్‌లోని రాంధుర గ్రామం కూడా అలాంటిదే. ప‌చ్చ‌ని చెట్ల‌తో ప‌ర్యాట‌కుల‌ను ఆహ్వానిస్తోంది ఈ ప్ర‌దేశం. ఇంకా, ఇక్క‌డ దూర్, సుందర్‌బన్స్, దిఘా, కాలింపాంగ్, కుర్సియోంగ్, చందన్‌నగర్ వంటి అనేక ఇతర ప్రదేశాలు ఎన్నో చూడదగినవి ఉన్నాయి.

sundarbans1

పశ్చిమ బెంగాల్‌లోని ప్రతి నగరానికి దాని స్వంత ప్రత్యేకత ఉంటుంది, అయితే ప్రతిచోటా సాధారణంగా కనిపించే ఒక విషయం ఇక్క‌డి ప్రకృతి అందాలు. ఈ అందాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూడాల‌నుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా రాంధుర అనే చిన్న గ్రామాన్ని సందర్శించాల్సిందే. ఈ ప్ర‌దేశం డార్జిలింగ్ నుండి కేవలం 30 కిలోమీట‌ర్ల దూరంలో కాలింపాంగ్ నుండి సుమారు 15 కిలోమీట‌ర్ల మాత్ర‌మే ఉంటుంది. ఇక్కడ నుండి కాంచనజంగా శిఖరాలను సులభంగా చూసే అవ‌కాశం ల‌భిస్తుంది. ఇక్క‌డి అందాల‌ను మీ కెమెరాల్లో బంధించవచ్చు.

రాంధూర చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు

ఎచే గ్రామం రాంధుర నుండి కేవలం 2 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంటుంది. ఇది దాని సేంద్రీయ రూపానికి ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. వీటితో పాటు ఇక్క‌డ తించులి,తుక్దా ప్ర‌దేశాలు కూడా చాలా ప్ర‌సిద్ధిచెందాయి. ఈ గ్రామం సుదూర ప్రాంతాలకు విస్తరించి ఉన్న అందమైన, సువాసనగల తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డ ఒకప్పుడు బ్రిటిష్ అధికారుల నివాసాలుగా ఉన్న పాత భవనాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూడొచ్చు. అందులో బస చేసే అనుభూతిని కూడా మీరు పొందొచ్చు. ఈ గ్రామానికి రావడం ద్వారా తీస్తా, రంగేట్ నదుల సంగమ అద్భుతమైన దృశ్యాల‌ను చూడొచ్చు. అయితే, ఇక్కడ ఉన్న టెర్రస్ పొలాలు కూడా ఈ గ్రామాన్ని మ‌రింత అందంగా మారుస్తాయి.

randhuravillage , west bengal

రాంధూరను సంద‌ర్శించేందుకు ఉత్తమ స‌మ‌యం..

పశ్చిమ బెంగాల్‌లోని చాలా ప్రదేశాలను సంద‌ర్శించేందుకు సెప్టెంబర్ నుండి మార్చి వరకు ఉత్త‌మ స‌మ‌యం. ఈ కాలంలో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. విమాన మార్గం ద్వారా అయితే, ప‌శ్చిమ బెంగాల్‌లోని చాలా ప్రాంతాలకు చేరుకోవడానికి బాగ్డోగ్రా సమీపంలోని విమానాశ్రయం. ఇక్కడ నుండి కాలింపాంగ్ చేరుకునేందుకు టాక్సీలు, బ‌స్సులు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. ఇక, రైలు మార్గం ద్వారా అయితే, న్యూ జల్పైగురి సమీపంలోని రైల్వే స్టేషన్. ఇక్కడి నుండి రాంధూరకు వాహనాలు అందుబాటులో ఉంటాయి. రోడ్డు మార్గం ద్వారా అయితే, పశ్చిమ బెంగాల్‌లోని చాలా నగరాల నుండి కాలింపాంగ్‌కు షేరింగ్ క్యాబ్‌లు లేదా బస్సులు అందుబాటులో ఉంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+