ఛండీగడ్‌లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలను చూశారా?
భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఇక్కడ అనేక పురాతనమైన కట్టడాలు, చారిత్రత్మాక నిలయాలు, ప్రకృతితో నిండిన ప్రాంతాలు ఉన్నాయి. అందుకే విదేశాల నుంచి కూడా భారతదేశంలోని ప్రాంతాలను చూడ్డానికి చాలా మంది తరలివస్తుంటారు. మరి అలాంటప్పుడు మనమెందుకు విదేశాలకు వెళ్లడం. ఇక్కడే మనదేశంలోని పురాతన కట్టడాలను, ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ప్రాంతాలను ఈ సెలవుల్లో విహరిద్దామా? మరెందుకాలస్యం ఉత్తరభారతంలోని ఛండీగడ్ ప్రసిద్ధ ప్రదేశాలకు నిలయం. ఇక్కడ ప్రతి ఏటా పర్యాటకుల రద్ధీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని చుట్టేయ్యండి. .
చండీగఢ్‌లో సందర్శించడానికి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరం పంజాబ్ మరియు ఉత్తర భారతదేశ ప్రజల కళ, సంస్కృతి మరియు జీవనశైలిని ఇక్కడికి వచ్చే పర్యాటకులకు పరిచయం చేస్తుంది. చండీగఢ్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి రాక్ గార్డెన్ మరియు ఇస్కాన్ దేవాలంతో పాటు జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డెన్ ఎంతో ప్రసిద్ధిగాంచింది.

జాకీర్ హుస్సేన్ గార్డెన్
గులాబీలతో నిండిన ఈ అందమైన తోట 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ గార్డెన్‌కు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ పేరు పెట్టారు. ఈ ఉద్యానవనం అద్భుతమైన శిల్పకళను కలిగి ఉంది. ఇది పువ్వుల అందాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ తోటలో 1500 కంటే ఎక్కువ రకాల గులాబీలు ఉండడమే దీని ప్రత్యేకత. ఈ సెలవుల్లో పిల్లలతో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించొచ్చు. మీ పిల్లలకు ఇన్ని రకాల గులాబీలను చూపించొచ్చు. ఈ ప్రాంతమంతా చుట్టూ గులాబీలతో నిండి ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది.

ఇస్కాన్ దేవాలయం
శాంతియుతమైన మరియు మతపరమైన ఇస్కాన్ దేవాలయం ఛండీగడ్‌లో సందర్శించడానికి గొప్ప ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం పర్యాటకులలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రతిరోజు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయ పరిసరాల్లో స్మృతి చిహ్నాలు మరియు మిఠాయిలు కొనుగోలు చేసేందుకు అనేక దుకాణాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రదేశం చుట్టూ దట్టమైన గడ్డి మరియు పచ్చదనంతో నిండిన భూమి ఉంది. పిక్నిక్‌ల వంటి కార్యకలపాలు ఇక్కడ కుటుంబంతో కలిసి సరదాగా గడపొచ్చు. కృష్ణుణి భక్తులు కోసం రోజు వారి పూజలు ఇక్కడ నిర్వహించబడతాయి.

సుఖ్నా సరస్సు
సుఖ్నా సరస్సు సుమారు 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది మరియు అనేక వలస పక్షులు సందర్శించే ప్రదేశం ఇది. మీరు ఇక్కడ కొంగలు మరియు సైబీరియన్ బాతులను కూడా గుర్తించవచ్చు. పక్షి ప్రేమికులు లేదా ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి ఇది ఎంతో ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడ వాటర్ స్కీయింగ్, ఫిషింగ్ మరియు బోటింగ్ ఆనందించవచ్చు. సుఖ్నా సరస్సు చండీగఢ్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. సుఖ్నా సరస్సుపైనే ఒక టవర్ ఉంది. దీనిని సూసైడ్ టవర్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ టవర్‌ను సుఖ్నా సరస్సులో నీటి మట్టాన్ని కొలవడానికి ఉపయోగిస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం ప్రజలు ఈ టవర్‌పైకి ఎక్కి సుఖ్నా సరస్సులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని అందుకే దీనిని సూసైడ్ టవర్ అని పిలిచేవారని ఇక్కడి వారి నమ్మకం.

రాక్ గార్డెన్
చండీగఢ్‌లోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో రాక్ గార్డెన్ ఒకటి. మీరు కళల ప్రేమికులైతే, మిమ్మల్ని ఎంతగానో ఆకర్షించే అద్భుత దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. రాక్‌గార్డెన్ భారతదేశంలోని ఛండీగడ్‌లో సుఖ్నాసరస్సుకు దగ్గరలో ఉన్న రాతి ఉద్యానవనం ఇది. దీనిని నెక్‌చంద్ రాతి ఉద్యానవనం గా కూడా పిలుస్తారు.

టెర్రస్డ్ గార్డెన్
ఛండీగడ్‌లోని టెర్రస్డ్ గార్డెన్స్ ప్రధాన నగరంలోని ప్రసిద్ధ మరియు ఎంతో ఇష్టపడే పర్యాటక ఆకర్షణ. దీన్ని 1979 స్థాపించబడింది. అప్పటి నుండి విపరీతమైన ప్రజాదరణ పొందింది. మొత్తం పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనాలు పచ్చదనంతో నిండి, సుందర దృశ్యాలను అందిస్తాయి. ఇక్కడ కనిపించే వివిధ స్థాయిలు, ఆకారాలు, మరియు టెర్రస్ డిజైన్‌ల కారణంగా దీనికి ఆ పేరు పెట్టారు.



Click it and Unblock the Notifications













