Search
  • Follow NativePlanet
Share
» »జార్ఖండ్‌లోని లక్షద్వీప్‌లా కనిపించే ఈ ప్ర‌దేశాన్ని చూశారా?

జార్ఖండ్‌లోని లక్షద్వీప్‌లా కనిపించే ఈ ప్ర‌దేశాన్ని చూశారా?

అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్ ప్రస్తుత ప‌రిస్థితుల్లో వార్త‌ల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ప్రజలు ఈ రోజుల్లో లక్షద్వీప్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ చాలా మందికి అక్కడికి చేరుకోవడం చాలా క‌ష్టంగా ఉంటుంది. ల‌క్ష‌ద్వీప్‌కు వెళ్లాలంటే క‌చ్చితంగా 25వేల‌ నుండి 30 వేల రూపాయల కంటే ఎక్కువే ఉండాలి. అందుకే ల‌క్ష‌ద్వీప్‌ను సంద‌ర్శించ‌లేని వారు జార్ఖండ్‌లోని ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శిస్తే చాలు. ల‌క్ష్య‌ద్వీప్‌ను సంద‌ర్శించినా అనుభూతి క‌లుగుతుంది. జంషెడ్‌పూర్‌లోని బురిడి డ్యామ్ గురించి ఇప్ప‌డు మాట్లాడుకుంటున్నాం. సముద్రంలో తిరుగుతూ ఆనందించాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శించండి.

ఇది ఉక్కు నగరం జంషెడ్‌పూర్ సమీపంలోని ఘట్‌శిలాలో ఉంది. ఈ ప్రాంతంలో కుటుంబ‌స‌భ్యుల‌తో క‌ల‌సి స‌రాదాగా గ‌డ‌పొచ్చు. ప్రకృతి ప్రేమికుల‌కు ఈ ప్రాంతం స్వ‌ర్గ‌ధామమ‌నే చెప్పాలి. ఇక్క‌డ అడవులు, నదులు, జలపాతాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ ప్ర‌కృతి సహజ దృశ్యాలతో నిండిన ఈ ప్రదేశం ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. దిగువ కొండలను కప్పి ఉంచే అడవులు పశ్చిమ బెంగాల్‌లోని దాల్మా శ్రేణి నుండి పశ్చిమ మిడ్నాపూర్ వరకు ఏనుగు కారిడార్‌లో భాగంగా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా, ఇది పర్యాటకులకు అత్యంత ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్‌గా మారింది. చుట్టూ ఉన్న ప్రకృతి ఒడిలో స‌రాదాగా కూర్చునే అవ‌కాశం ఉంటుంది.

ghatsilatour1

ప‌ర్యాట‌కులు ఇక్కడ పచ్చటి గడ్డిలో హాయిగా కూర్చుని, ఇక్క‌డిఅందాల‌ను వీక్షించొచ్చు. ఎటు చూసిన క‌నిపించే ప‌చ్చ‌ద‌నం ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక్క‌డ బోటింగ్ కూడా ఆనందించవచ్చు. ఈ బోటు ట్రిప్ కేవ‌లం100 రూపాయ‌ల‌ నుండి ప్రారంభమవుతుంది. పిక్నిక్‌ల కోసం ఘట్‌శిల, కోల్‌కతా, ఖరక్‌పూర్, జంషెడ్‌పూర్, చండిల్ వంటి ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఈ బురిడి డ్యామ్‌లో పర్యాటకుల కోసం బనానా బోటింగ్ రైడ్‌లు, వాటర్ సర్ఫింగ్ మొదలైన కొన్ని ఉత్తేజకరమైన నీటి కార్యకలాపాలను పరిచయం చేయడం ద్వారా దీనిని పర్యావరణ అనుకూల పర్యాటక కేంద్రంగా మార్చింది. అదే సమయంలో, ఇక్క‌డ సరస్సు చుట్టూ ఉన్న నీలి జలాలను కూడా ఆరాధించవచ్చు. మోటారు, తెడ్డు బోటింగ్‌ను కూడా ఇక్క‌డ ఆస్వాదించ‌వ‌చ్చు.

ఇక్క‌డ ప్ర‌తి ఏటా అక్టోబ‌ర్ మాసంలో ఓ మేళాను నిర్వ‌హిస్తారు. ఇది ఆనకట్ట ఒడ్డున పదిహేను రోజుల పాటు జరుగుతుంది.

మేళా సమయంలో, సంతాల్ తెగ వారు మధుబని కళ మరియు పెయింటింగ్స్, వార్లీ పెయింటింగ్స్, ధోక్రా ఆర్ట్స్ బట్టలు, మట్టి కుండలు, దీపాలు, నగలు మొదలైన ప్రసిద్ధ సంతాలీ హస్తకళలను ప్రదర్శించ‌డం జ‌రుగుతుంది.

బురుడి డ్యామ్ ఎలా చేరుకోవాలి?

రైలు మార్గం ద్వారా ప్ర‌యాణించాల‌నుకునేవారికి సమీపంలోని రైల్వే స్టేషన్ ఘట్‌శిల, అక్కడ నుండి ఆటో లేదా క్యాబ్‌ని అద్దెకు తీసుకోని బ‌య‌లుదేరొచ్చు. ఇక‌, రోడ్డు మార్గం ద్వారా అయితే, జార్ఖండ్‌లోని వివిధ ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు బ‌స్సులు అందుబాటులో ఉంటాయి. ఈ డ్యామ్‌ని సంద‌ర్శించేందుకు స‌రైన స‌మ‌యం అక్టోబ‌ర్‌. బిందా పెయిర్ స‌మయంలో అయితే డిసెంబ‌ర్ నుండి ఫిబ్ర‌వ‌రి నెల వ‌ర‌కు ఈ డ్యామ్‌ని సంద‌ర్శించొచ్చు. బురుడి డ్యామ్ పిక్నిక్‌ల స్పాట్‌గా ప్ర‌సిద్ధిచెందింది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు అత్యంత శీతలమైన చలికాలంలో ఎక్కువ మంది పర్యాటకులు ఇక్క‌డ‌కు వ‌స్తుంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+