ఇండియాస్ అమెరికాగా పిలిచే ఈ ప్రాంతాన్ని చూశారా?
ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. అందులో ఒకటి. అమెరికాలోని బ్రైస్ కాన్యన్ నేషనల్ పార్క్. ఇక్కడ ఉన్నటువంటి పర్వతం లాంటి ఎత్తైన రాయిని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రకృతి స్వయంగా ఈ రాళ్లను చెక్కినట్లు అనిపిస్తుంది దీని నిర్మాణం. ఈ ప్రకృతి అందాలను చూసేందుకు అనేక దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.
కానీ, ఇప్పుడు దాని గురించి ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? అలాంటి ఆకారంతోనే భారతదేశంలో కూడా ఓ ప్రదేశం ఉందని మీకు తెలుసా? ఇప్పడు దాని గురించే మనం మాట్లాడుకుబోతున్నాం. రండి ఆలస్యం ఎందుకు? భారతదేశంలోని ఆ అద్భుతమైన ప్రదేశాన్ని చూద్దాం. దీనిని "అమెరికా ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు. ఈ అద్భుతాన్ని చూసేందుకు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదండి. భారతదేశంలోని మధ్యప్రదేశ్‌కు వెళితే సరిపోతుంది.

ఇండియాస్ అమెరికాగా పేరు..
మధ్యప్రదేశ్‌లోని అత్యంత ప్రసిద్ధ ప్రయాణ గమ్యస్థానాన్ని భీంబేట్కా అంటారు. ఇక్కడి రాతి నిర్మాణాలు, గుహలను చూస్తే అమెరికాలోని బ్రైస్ కాన్యన్ నేషనల్ పార్క్ లానే మనకు అనిపిస్తుంది.
ఇక్కడే రాతియుగం మొదలైంది
భింబేట్కా రాక్ షెల్టర్స్ అనేది భారత ఉపఖండంలో మానవ జీవితపు ప్రారంభ జాడలను చూపే ఒక పురావస్తు ప్రదేశం. దక్షిణాసియా రాతియుగం ఇక్కడి నుంచే మొదలైంది. దీనిని 2003లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఉంది భీంబేట్కా. భోపాల్ నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. ఇక్కడి రాతి చిత్రాలు చాలా ప్రసిద్ధి చెందినవి. 30,000 సంవత్సరాల క్రితం ఆదిమ మానవుడు వేసిన వందలాది రాతి చిత్రాలను ఇక్కడి గోడలపై చిత్రించారు. ఈ చిత్రం తర్వాతి తరానికి సందేశాన్ని అందించే సాధనంగా నిలిచింది.

మహాభారత కాలానికి సంబంధించిన చరిత్ర..
భీంబేట్కా చరిత్ర మహాభారత కాలానికి సంబంధించినది. ఐదుగురు పాండవులలో ఒకడైన భీముడు ఇక్కడ కూర్చునేవాడని చెబుతారు. ఇక్కడ మొత్తం 760 శిలలు ఉన్నాయి. వాటిపై అన్ని సైజుల పెయింటింగ్స్ తయారు చేయబడ్డాయి. అవి అస్పష్టంగా కనిపించినప్పటికీ, సూర్యకాంతి వాటిపై పడినప్పుడు, వాటిని చూడటం సులభంగానూ, ఆసక్తికరంగానూ ఉంటుంది.
రాక్ తాబేలు తప్పక సందర్శించాలి
భింబేట్కాలోని మరొక ఆసక్తికరమైన ప్రదేశం రాక్ తాబేలు. ఇక్కడి గుహల ప్రవేశ ద్వారం పైన కొండపై ఒక చిన్న దేవాలయం ఉంది. గుహలను చూసేందుకు వచ్చేవారు సాధారణంగా ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.

భీంబేట్కా చేరుకోవడం ఎలా
రైలు మార్గం ద్వారా అయితే భీంబెట్కాకు సమీప రైల్వే స్టేషన్ భోపాల్. భోపాల్ స్టేషన్ నుండి భీంబెట్కాకు సుమారు 37 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైల్వే స్టేషన్ వెలుపలి నుండే భీంబెట్కాకు టాక్సీలు లేదా ప్రైవేట్ కార్లు అందుబాటులో ఉంటాయి.
విమాన మార్గం ద్వారా అయితే భోపాల్‌లోని రాజా భోజ్ విమానాశ్రయం భీంబెట్కాకు సమీప విమానాశ్రయం. ఇక్కడి నుండి భీంబెట్కాకు దాదాపు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విమానాశ్రయం నుండి క్యాబ్‌లు లేదా టాక్సీలు ఉంటాయి
రోడ్డు మార్గం ద్వారా అయితే, సొంత వాహనంలో కూడా భీంబేట్కాకు వెళ్లొచ్చు. భోపాల్ నుండి సుమారు 46.3 కిలోమీటర్ల దూరం ఉంటుంది.



Click it and Unblock the Notifications











