Search
  • Follow NativePlanet
Share
» »విశాఖ‌ప‌ట్నంలోని బెస్ట్ చిల్ర్డ‌న్ పార్క్‌కు మీ పిల్ల‌ల‌ను తీసుకెళ్లారా..?

విశాఖ‌ప‌ట్నంలోని బెస్ట్ చిల్ర్డ‌న్ పార్క్‌కు మీ పిల్ల‌ల‌ను తీసుకెళ్లారా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంద‌మైన ప్ర‌దేశాల‌కు కొద‌వే లేదు. ఇందులో ముఖ్యంగా విశాఖ‌ప‌ట్నం ఓ అందమైన నగరంగా ప్ర‌సిద్ధిచెందింది. విశాఖ‌ప‌ట్నం వాణిజ్యపరంగానే కాదు పర్యాటకంగానూ ఎంతో ప్రత్యేక స్థానాన్ని సంత‌రించుకుంది. జన‌వ‌రిలో వ‌చ్చే సెల‌వుల్లో, సంక్రాంతి సెల‌వుల్లో, స్పెషల్ అకేషన్స్‌లో పిల్లలు, పెద్దలు సరదాగా గడిపేందుకు విశాఖ‌ప‌ట్నం ఉత్త‌మ‌మైన గమ్యస్థానం అని చెప్పుకోవాలి. తెల్లవారుజామున వాకింగ్ మొదలుకొని సాయంత్రం వేళ సేద తీరే వరకూ ఇక్కడ సందర్శించేందుకు అనేక బీచ్‌లు, టూరిస్ట్‌ ప్లేస్‌లు, పార్క్‌లు వంటి ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇవి వినోదాన్ని పంచడంతో ప‌ర్యాట‌కుల్లో స‌రికొత్త ఉత్సాహాన్ని కూడా నింపుతాయి.

విశాఖపట్నం బీచ్‌ల‌కే ప్ర‌సిద్ధిచెంద‌డ‌మే కాదు. ఇక్క‌డ ఆధ్యాత్మిక ప్రాంతాల‌కు కొద‌వేలేదు. సింహాచ‌లం, కైల‌స‌గిరి వంటి పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకోవ‌చ్చు. వీటితోపాటు వైజాగ్‌లో పేరుగాంచిన జ‌ల‌పాతాలు కూడా మ‌రెన్నో ఉన్నాయి. ఇక్క‌డికి చాలామంది సాయంత్రం అయితే చాలు విశాఖ బీచ్ రోడ్డుకు నగరవాసులు పిల్ల‌ల‌ను తీసుకొస్తుంటారు పేరెంట్స్‌. ఇక్క‌డ పిల్లల‌ కోసం ప్ర‌త్య‌కంగా బీచ్‌లు కూడా ఉన్నాయి.

బీచ్‌కు వచ్చే చిన్నారులు కోసం విశాఖ జివియంసి అధికారులు ప్రత్యేకంగా ఓ పార్క్‌ను కూడా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఆల్ ఎబిలిటీస్ పార్క్‌ను అభివృద్ధి చేసి చిన్నారులకు అందించారు. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ చే నిర్మించబడిన ఈ స్థలం దాని పేరుకు తగినట్లుగానే ఉంటుంది. ఎందుకంటే ఇది దివ్యాంగుల‌కు కూడా పూర్తి వినోదాన్ని అందిస్తుంది.

childrensparkinvisakhapatnam

RK బీచ్ రోడ్డులో చిల్డ్ర‌న్స్ పార్క్‌...

పిల్ల‌ల కోసం ఏర్పాటు చేసిన ఈ పార్కు RK బీచ్ రోడ్డులో మనకు కనపడుతుంది. ఈ బీచ్‌లోకి ఎంట్రీ అవుతుండగానే చిన్నపిల్లాడు నిక్కరు వేసుకుని గంభీరంగా కూర్చున్నట్లు బాలబీముడిలాంటి పెద్ద విగ్రహాన్ని ప్ర‌త్యేకంగా పిల్ల‌ల కోసం ఏర్పాటు చేశారు. పిల్లలు ఈ విగ్రహం దగ్గర బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పార్క్ లోపల రంగురంగుల స్వింగ్‌లు, ర్యాంప్‌లతో ఈ పార్క్ చిన్నారులను ఆహ్వ‌నిస్తోంది. ఈ పార్క్ పిల్లల‌కు ఎంతో సురక్షితమైనది, ఆకర్షణీయమైన వాతావరణంలో ఆడుకునేందుకు ఎంత‌గానో తోడ్పడుతుంది. ఈ పార్క్ YMCA ఎదురుగా 2156 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. రూ.

3.5 కోట్ల బడ్జెట్‌తో ఈ పార్క్‌ను ఎంతో సుందరంగా నిర్మించారు. అయితే, ఇది వినికిడి లోపం ఉన్నవారికి, అంధులకు, వికలాంగులకు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పార్క్‌లోని మొత్తం ఆట సామాగ్రి అంతా సింగ‌పూర్ నుండి దిగుమ‌తి చేసుకున్న‌దే. ఇందులో ఎక్కువ భాగం రబ్బరుతో తయారు చేయబడినవే ఉంటాయి. ఇది సురక్షితంగా ఉండటమే కాకుండా తుప్పు పట్టడం, పాడయ్యే సమస్యలు లాంటివి ఉండవు.

ఈ పార్క్‌లోని ప్లే జోన్‌లలోని రబ్బరు ఫ్లోరింగ్ పిల్లలకు ఆడుకునేటప్పుడు వారికి ఎంతో భద్రతను అందిస్తాయి. అలాగే, ఈ పార్క్ వీల్ చైర్‌లో ఉన్నవారికి స్థలం యొక్క ప్రతి మూలను సులభంగా చేరుకోడానికి సహాయపడే విధంగా నిర్మించబడింది. పార్క్‌లో ఉన్న వంతెన వైజాగ్ తీరప్రాంతం యొక్క సుందరమైన అందాలు వీక్షిస్తూ, పిల్లలు ఆడుకునేందుకు ఎంతో చక్కని ప్రదేశమని చెప్పొచ్చు.

మీ పిల్లలను ఇక్కడకు ఒక్కసారి తీసుకెళ్తే చాలు వాళ్లు ఇక్క‌డ బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఈ పార్క్ ప్ర‌తి రోజూ ఉదయం 10 నుండి రాత్రి 10:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ పార్క్‌లో ప్ర‌వేశించేందుకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. ఈ ప్రదేశానికి చాలా మంది ప్రజలు వస్తుంటారు. పిల్లలకు ఈ పార్క్‌ ఎంతో ఆహ్లాద‌భరింతంగా ఉంటుంది

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+